AP TET 2022 Paper 1A, 1B: పేపర్-1 పరీక్షలో ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..
అభ్యర్థులు జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు టెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. జూన్ 16 నుంచి జులై 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. aptet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెట్ సిలబస్‌ను కూడా పాఠశాల విద్యా శాఖ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పొందుపరిచింది.
ఏపీ టెట్ 2022 ఇలా
- రాష్ట్రంలో.. టెట్‌ను పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు.
- పేపర్–1ఎ: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష.. పేపర్–1ఎ.
- పేపర్–1బి: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేయాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష ఇది. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో టీచర్లకు ఈ పేపర్ ఉత్తీర్ణత తప్పనిసరి అనే ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రవేశ పెట్టారు.
- పేపర్–2ఎ: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్ ఇది.
- పేపర్–2బి: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష ఇది.
Secondary Grade Teacher Bitbank
పరీక్ష విధానం ఇలా
టెట్ పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిలను 150 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. వీటికి సంబంధించిన వివరాలు..
పేపర్–1ఎ, 1బి
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1. | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2. | లాంగ్వేజ్1 | 30 | 30 |
3. | లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్) | 30 | 30 |
4. | గణితం | 30 | 30 |
5. | ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ | 30 | 30 |
మొత్తం | 150 | 150 |
- లాంగ్వేజ్–1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి
ఈ విభాగంలో శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం,అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక,బోధన పద్ధతులు, మూ ల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్–కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు,సిద్ధాంతాలు,నిబంధనలను విశ్లేషిస్తూ.. అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
లాంగ్వేజ్–1,2
లాంగ్వేజ్–1లో అభ్యర్థులు ఎంచుకున్న భాష.. అలాగే లాంగ్వేజ్–2గా పేర్కొన్న ఇంగ్లిష్‌లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి.ఇంగ్లిష్‌లో పా ర్ట్స్ ఆఫ్ స్పీచ్,ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి.
ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
పేపర్ 1లో ఈ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి నుంచి అయిదో తరగతి స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన 30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్‌పై ఉంటే.. 6 ప్రశ్నలు పెడగాజిపై ఉంటాయి. పేపర్ 2లో మ్యాథమెటిక్స్, సైన్స్‌లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్ట్‌లపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత స్థాయి ఇంటర్ స్థాయిలో ఉంటుంది.
TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
సైన్స్
ఈ విభాగంలో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు అవపోసన పట్టాలి. పేపర్–2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. అదే విధంగా ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేక అధ్యయనం చేయాలి.
టీచర్ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!