Free Coaching for Polycet-2024: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచితంగా శిక్షణ
కడప : పదవ తరగతి తరువాత పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు కడప పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుకు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలల్లో సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ డిప్లమా ఇంజనీరింగ్ కోర్సులు చేరాలనుకునే విద్యార్థుల కోసం పాలిసెట్ –2024 పరీక్షను ఏప్రిల్ 27వ తేదీ నిర్వహించనున్నారని తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణా తరగతులను కడప మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నామని తెలిపారు.
Also Read: AP POLYCET Previous Papers
ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్, తెలుగు స్టడీ మెటీరియల్‌ను ఇస్తామని తెలిపారు. ఉచిత శిక్షణా తరగతులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఈ అవకాశాన్ని బాలబాలికలు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. విద్యార్థులు తమ పదవ తరగతి హాల్ టికెట్, ఫోటో, ఆధార్‌కార్డు నెంబర్, తమ మొబైల్ ఫోన్‌తోపాటు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 100 రుసుము చెల్లించాలన్నారు. సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. లేకుంటే ఆన్‌న్‌లైన్ హెచ్‌టిటిపిఎస్://పాలిసెట్‌ఏపీ.ఎన్‌ఐసి.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.