AP SI Preliminary Key 2023 : ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ రాతపరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల.. ప్రశ్నపత్రంలో..
ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో ఈ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.పేపర్–1ను (అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ) ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించారు. ఈ పేపర్-1ను 100 ప్రశ్నలు.. 100 మార్కులకు నిర్వహించారు. అలాగే పేపర్–2(జనరల్ స్టడీస్)ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించారు. ఈ పేపర్-2ను 100 ప్రశ్నలు.. 100 మార్కులకు నిర్వహించారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించారు.
ఈ కీ పై అభ్యంతరాలు ఉంటే..
ఈ ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 11:00 గంటలకు విడుదల చేసింది. అభ్యర్థులు ఈ ప్రాథమిక ‘కీ’ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలలోపు తమకు మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్‌లో పంపాల్సిన మెయిల్ ఐడీ: CTSI& PWT @slprb.appolice.gov.in. అలాగే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రెండు వారాల్లో వెల్లడిస్తామని, అభ్యర్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పోలీసు నియామక మండలి వెల్లడించింది.
➤☛ ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్-2023 పేపర్-1 & 2 ప్రాథమిక ‘కీ’ , ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి