సమత సైనిక్ దళ్ స్థాపకులెవరు?
1. సమత సైనిక్ దళ్ స్థాపకులెవరు?
1) జ్యోతిబా పూలే
2) మద్ధూరి అన్నపూర్ణయ్య
3) డా.బి.ఆర్. అంబేడ్కర్
4) సర్దార్ అజిత్ సింగ్
- View Answer
- సమాధానం: 3
2. కింది వాటిలో సరైన జత ఏది?
1) నీల్ దర్పణ్ - దీన బంధు మిత్ర
2) న్యూల్యాంప్స్ ఫర్ ఓల్డ్-అరవింద ఘోష్
3) నేను - నాదేశం-దర్శి చె ంచయ్య
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
3. భారత జాతీయ సైన్యంలో కీలక పాత్ర పోషించిన, స్వాతంత్య్ర సమరయోధుల శిక్షలను తగ్గించిన నాటి భారత సైన్యాధికారి?
1) క్లాడ్ అచిన్లేక్
2) హాల్వెల్
3) డబ్ల్యూడబ్ల్యూ హంటర్
4) టెంపుల్వుడ్
- View Answer
- సమాధానం: 1
4. స్వతంత్ర భారత దేశంలో తొలి కేంద్రమంత్రి వర్గంలో ఎన్.వి.గాడ్గిల్ ఏ శాఖను నిర్వహించారు?
1) హోం, సమాచార శాఖ
2) విద్యుత్, గనులశాఖ
3) వ్యవసాయం, ఆహారం
4) విద్య, విదేశీ వ్యవహారాలు
- View Answer
- సమాధానం: 2
5. 1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రారంభ కేంద్రం ఏది?
1) మీరట్
2) మిడ్నాపూర్
3) లక్నో
4) గ్వాలియర్
- View Answer
- సమాధానం: 1
6. స్వామి రామానందతీర్థ అసలు పేరు ఏమిటి?
1) నరేంద్రనాథ్ దత్
2) వెంకట్రావు ఖడ్గేకర్
3) మూల శంకర్
4) రామచంద్ర పాండురంగ
- View Answer
- సమాధానం: 2
7.అవసరమైతే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నది ఎవరు?
1) లాలాలజపతిరాయ్
2) రఘుపతి వెంకటరత్నం నాయుడు
3) కందుకూరి వీరేశలింగం
4) రవీంద్రనాథ్ ఠాగూర్
- View Answer
- సమాధానం: 3
8. భారతదేశంలో పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు?
1) 1784
2) 1 792
3) 1801
4) 1816
- View Answer
- సమాధానం: 1
9. ఆపరేషన్ రైనో ఏ రాష్ట్రంలోని ఉల్ఫా తీవ్రవాదులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్?
1) ఒడిశా
2) తమిళనాడు
3) అసోం
4) కశ్మీర్
- View Answer
- సమాధానం: 3
10. కింది వాటిలో సరైన జత ఏది?
1) రాజా చెల్లయ్య - ఆర్థిక శాస్త్రం
2) జ్యోతిబసు - రాజకీయ రంగం
3) సచిన్‌దేవ్ బర్మన్ - సంగీత రంగం
4) పైవన్నీ సరైనవి
- View Answer
- సమాధానం: 4
11. మధర్ థెరిసా భారతరత్న అవార్డు ఎప్పుడు పొందారు?
1) 1977
2) 1978
3) 1979
4) 1980
- View Answer
- సమాధానం: 4
12. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ, నీతిని కానీ నిర్మించలేం అని అన్నది ఎవరు?
1) డా.బి.ఆర్. అంబేడ్కర్
2) జ్యోతిబాపూలే
3) మహాత్మా గాంధీ
4) నేతాజీ బోస్
- View Answer
- సమాధానం: 1
13. తెలంగాణ రాష్ట్రంలో మూషిక జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది?
1) నాగర్ కర్నూల్
2) మహబూబాబాద్
3) నల్లగొండ
4) సూర్యాపేట
- View Answer
- సమాధానం: 1
14. భారత్‌లో బ్రిటిష్ వారు మగ్గంపై విధించిన పన్ను ఏది?
1) పుల్లరి
2) మగము
3) దర్శినం
4) మోతుర్పా
- View Answer
- సమాధానం: 4
15. మదర్ థెరిస్సా మహిళా విశ్వ విద్యాలయాన్ని 1984లో ఎక్కడ స్థాపించారు?
1) కోల్‌కతా
2) మైసూర్
3) కొడెకైనాల్
4) మదనపల్లి
- View Answer
- సమాధానం: 3
16. ‘వృక్ష శాస్త్రజ్ఞుల స్వర్గం’ అని పేరొందిన రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) సిక్కిం
3) మేఘాలయ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
17.1946 మే 16న క్యాబినెట్ మిషన్ తన ప్రణాళికను ఎక్కడ ప్రకటించింది?
1) ముంబాయి
2) సిమ్లా
3) నాగ్‌పూర్
4) కలకత్తా
- View Answer
- సమాధానం: 2
18. కింది వాటిలో సరికాని జత ఏది?
1) హంటర్ కమిషన్ - 1882
2) సాడ్లర్ కమిటీ - 1917
3) సార్జంట్ కమిషన్ - 1933
4) హర్టోగ్ కమిటీ - 1929
- View Answer
- సమాధానం: 3
19. బ్రిటిష్ వారి పాలనలో భారత్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1926
2) 1923
3) 1920
4) 1919
- View Answer
- సమాధానం: 1
20.కింది వాటిలో సరైన జత ఏది?
1) బ్రిటీష్ విశ్వవిద్యాలయంలో విద్య అభ్యసించిన తొలి భారత వనిత - కార్నేలియా సోరాబ్జీ
2) హిందూ మతాన్ని స్వీకరించిన తొలి విదేశి వనిత - సిస్టర్ నివేదిత
3) విదేశాల్లో త్రివర్ణ పతాకం ఎగుర వేసిన తొలి భారతీయ వనిత - మేడం బికాజీ కామా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21.1946లో క్యాబినెట్ మిషన్‌తో చర్చించిన సిక్కు ప్రతినిధి?
1) అజిత్ సింగ్
2) సోహాన్ సింగ్ బక్నా
3) రామ్‌సింగ్
4) తారాసింగ్
- View Answer
- సమాధానం: 4
22. జతపరచండి
జాబితా-1
ఎ) అఖిల భారత ఖైదీల దినోత్సవం
బి) క్విట్ ఇండియా దినోత్సవం
సి) అంబే డ్కర్ జన్మ దినోత్సవం
డి) 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభ దినోత్సవం
జాబితా - 2
1) జనవరి 4
2) మే 10
3) ఆగస్టు 9
4) ఏప్రిల్ 14
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-3, సి-4, డి-2
- View Answer
- సమాధానం: 4
23. ‘బిహార్ సింహం’ అని ఎవరిని అంటారు?
1) కున్వర్ సింగ్
2) గులాబ్ సింగ్
3) మాన్ సింగ్
4) దేవి సింగ్
- View Answer
- సమాధానం: 1
24. ‘ఉమెన్స ఇండియన్ అసోసియేషన్’ స్థాపకులెవరు?
1) అనీబిసెంట్
2) రమాభాయి రనడే
3) అరుణా అసఫ్ అలీ
4) ప్రీతిలత వడ్డేదర్
- View Answer
- సమాధానం: 1
25. ‘మార్షమాన్’ స్థాపించిన పత్రిక ఏది?
1) మద్రాస్ మెయిల్
2) దిగ్దర్శన్
3) టైమ్స్ ఆఫ్ ఇండియా
4) కలకత్తా జర్నల్
- View Answer
- సమాధానం: 2
26.భారత జాతీయ కాంగ్రెస్ తొలి కార్యదర్శిగా పనిచేసిన భారతీయుడు?
1) డబ్ల్యూ.సి.బెనర్జీ
2) పి.ఆనందాచార్యులు
3) కె.టి.తెలాంగ్
4) దాదాభాయి నౌరోజి
- View Answer
- సమాధానం: 3
27.సహాయ నిరాకరణ, బహిష్కరణ అనే పదాలను ఉపయోగించి పోరాట మార్గాన్ని అనుసరించాలని చెప్పిన తొలి భారతీయుడు ఎవరు?
1) రామ్‌సింగ్
2) రవీంధ్రనాథ్ ఠాగూర్
3) దేవేంద్రనాథ్ ఠాగూర్
4) గోపాల కృష్ణ గోఖలే
- View Answer
- సమాధానం: 1
28. భారత పురాతత్వ సర్వే సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
1) 1861
2) 1851
3) 1841
4) 1821
- View Answer
- సమాధానం: 1
29. జతపరచండి
జాబితా - 1
ఎ) 379
బి) 89
సి) 78
డి) 72
జాబితా - 2
1) మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వారు
2) దండి యాత్రలో గాంధీజీ అనుచరులు
3) భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి సమావేశానికి హాజరైంది
4) జలియన్‌వాలా బాగ్ దుర్ఘటనలో మరణించిన వారు
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 2
30. అనీబిసెంట్ ఎప్పుడు దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలు అయ్యారు?
1) 1901
2) 1907
3) 1909
4) 1916
- View Answer
- సమాధానం: 2
31.జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1930
2) 1935
3) 1938
4) 1942
- View Answer
- సమాధానం: 3
32.కింది వాటిలో సరికాని జత ఏది?
1) బోర్సాడ్ సత్యాగ్రహం - సర్దార్ వల్లభాయి పటేల్
2) మోప్లా తిరుగుబాటు - అలీ ముస్లియార్
3) బార్డోలీ సత్యాగ్రహం - డా.బి.ఆర్. అంబేడ్కర్
4) పల్నాడు సత్యాగ్రహం - కన్నెగంటి హనుమంతు
- View Answer
- సమాధానం: 3
33. గాంధీ స్మృతి లేదా బిర్లా మందిర్ ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) వార్థా
3) పోర్బందర్
4) కలకత్తా
- View Answer
- సమాధానం: 1
34.అంబేడ్కర్ సమాధి ఉన్న ప్రాంతం పేరేమిటి?
1) శక్తిస్థల్
2) ఏక్తాస్థల్
3) రాజ్‌ఘాట్
4) చైత్యభూమి
- View Answer
- సమాధానం: 4
35. కింది వాటిలో ఆదివాసీ, గిరిజన తిరుగుబాట్లకు సంబంధించి సరైన జత ఏది?
1) సామ్బిసాయ్ - ఖోండ్
2) చిత్తుర్ సింగ్ - రమోసి
3) సేవారామ్ - బిల్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
36.ఆంధ్రదేశంలో జరిగిన తొలి గిరిజన తిరుగుబాటుగా దేనిని పేర్కొంటారు?
1) విశాఖపట్నం తిరుగుబాటు (1832)
2) రంపా తిరుగుబాటు (1879)
3) పల్నాటి సత్యాగ్రహోద్యమం (1922)
4) రాయచోటి తిరుగుబాటు (1922)
- View Answer
- సమాధానం: 1
37. ‘వీరగంధము తెచ్చినాము వీరులెవ్వరో తెల్పుడి’ అనే గేయ కవిత రాసిన త్రిపురనేని రామస్వామి చౌదరి బిరుదు ఏది?
1) కవి కోకిల
2) కవిరాజు
3) కవిరాజశిఖామణి
4) కవి వృషభ
- View Answer
- సమాధానం: 4
38. జతపరచండి
జాబితా-1
ఎ) చంపారాన్ సత్యాగ్రహం
బి) బార్డోలీ సత్యాగ్రహం
సి) మోప్లా తిరుగుబాటు
డి) కుమావూ తిరుగుబాటు
జాబితా - 2
1) గుజరాత్
2) కేరళ
3) ఉత్తరాఖండ్
4) బిహార్
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-1, బి-3, సి-4, డి-2
- View Answer
- సమాధానం: 4
39.కింది జాతీయోద్యమ సంఘటనల్లో చివరిగా జరిగిన సంఘటన ఏది?
1) జలియన్ వాలాబాగ్ దురంతం
2) కన్నెగంటి హనుమంతు వీరమరణం
3) చీరాల-పేరాల ఉద్యమం
4) రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు
- View Answer
- సమాధానం: 4
40. విక్టోరియా మహారాణి కైజర్ - ఎ- హింద్ బిరుదును ఎప్పుడు స్వీకరించారు?
1) 1876
2) 1878
3) 1881
4) 1882
- View Answer
- సమాధానం: 1
41. స్వదేశీ సంస్థనాదీశుల సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటైన కమిటీ?
1) మాక్డోనాల్డ్ కమిటీ
2) సర్‌థామస్ ర్యాలీ కమిటీ
3) బట్లర్ కమిటీ
4) హంటర్ కమిటీ
- View Answer
- సమాధానం: 3
42. కాశ్మీర్ రాజు హరిసింగ్ ఎప్పుడు కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసే ఒప్పందంపై సంతకం చేశారు?
1) 1947 ఆగస్ట్ 30
2) 1947 ఆగస్ట్ 26
3) 1947 సెప్టెంబర్ 30
4) 1947 అక్టోబర్ 26
- View Answer
- సమాధానం: 4
43.కింది వాటిలో సరైన జత ఏది?
1) భారత్ శ్రమ జీవి పత్రిక - శశిపాద బెనర్జీ
2) ‘దీన బంధు’ పత్రిక - నారాయణ్ మేఘాజీ లో ఖండే
3) కేసరి - బాలగంగాధర్ తిలక్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
44. వందేమాతరం ఉద్యమకాలంలో బారిసాల్‌లో స్వదేశి బోధన సమితి స్థాపకులు ఎవరు?
1) రవీంద్రనాధ్ ఠాగూర్
2) అశ్వనీ కుమార్ ద త్
3) పుల్లచంద్రరాయ్
4) మునీంద్ర నంది
- View Answer
- సమాధానం: 2
45. జతపరచండి
సంవత్సరం:
ఎ) 1893
బి) 1931
సి) 1934
డి) 1937
ప్రాధాన్యత:
1) భగత్ సింగ్ ఉరితీత
2) కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపన
3) వార్ధా విద్యా ప్రణాళిక ప్రకటన
4) గాంధీజీ దక్షిణాఫ్రికా పయనం
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-1, సి-2, డి-3
- View Answer
- సమాధానం: 4
46. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ నినాదకర్త ఎవరు?
1) నేతాజీ బోస్
2) భగత్ సింగ్
3) డా.బి.ఆర్. అంబేడ్కర్
4) మహ్మదాలీ జిన్నా
- View Answer
- సమాధానం: 3
47. కింది వాటిలో బంకించంద్ర ఛటర్జీ రచన కానిది ఏది?
1) దుర్గేనందిని
2) కపాలకుండల
3) పరిణీత
4) మృణాళిని
- View Answer
- సమాధానం: 3
48. భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 28
2) ఏప్రిల్ 14
3) జూలై 14
4) ఆగస్ట్ట్ 29
- View Answer
- సమాధానం: 1
49. మదన్ మోహన్ మాలవ్యా స్థాపించిన లీడర్ పత్రికను ఎక్కడ నుంచి ప్రచురించారు?
1) ఢిల్లీ
2) మద్రాస్
3) అలహాబాద్
4) కలకత్తా
- View Answer
- సమాధానం: 3
50.తెలంగాణ ఆర్ధర్ కాటన్ అని ఎవరిని అంటారు?
1) నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్
2) మీర్ మహ్మద్ ముమిన్ అస్త్రబదీ
3) ముజఫర్ జంగ్
4) మీర్ తురాబ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 1
51. భారత్‌లో ప్రొటెస్టెంట్ మత కేంద్రం ఏది?
1) గోవా
2) ట్రాంక్విబార్
3) పాండిచ్చేరి
4) అడయార్
- View Answer
- సమాధానం: 2
52.డా.బి.ఆర్.అంబేడ్కర్ దళిత మహాసభ ఎక్కడ స్థాపించారు?
1) మహద్
2) పూనా
3) నాగ్‌పూర్
4) బొంబాయి
- View Answer
- సమాధానం: 1
53. జ్యోతిరావ్ పూలే రాసిన నాటకం ఏది?
1) గీతా రహస్యం
2) నీల్ దర్పణ్
3) బందీ జీవన్
4) తృతీయరత్న
- View Answer
- సమాధానం: 4