కుల వ్యవస్థ ఎప్పుడు ఉద్భవించింది?
1. కుల వ్యవస్థ ఎప్పుడు ఉద్భవించింది?
1) వేదకాలంలో
2) పౌరాణిక కాలంలో
3) మధ్యయుగంలో
4) ఆధునిక యుగంలో
- View Answer
- సమాధానం: 1
వివరణ: వేదకాలంలోనే కుల వ్యవస్థ ఉద్భవించింది. నాడు బీజ రూపంలో ఉన్న ఈ వ్యవస్థ నేడు మహావృక్షమై తన కూకటి వేళ్లను హిందూ సమాజంలో బలంగా నాటింది. ప్రస్తుతం హిందూ సమాజం మూడువేల కులాలకు పైగా విభజింపబడింది. ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే మహావీరుడు, బుద్ధుడు వంటి ప్రవక్తలందరూ మానవులంతా ఒక్కటే అనే నినదానికి దోహదం చేసారు.
- సమాధానం: 1
2.కులం అంటే ఏమిటి ?
1) కొన్ని సంస్థల సముదాయం
2) వ్యక్తుల సముదాయం
3) రక్త సంబంధీకుల సముదాయం
4) కొన్ని గ్రామాల సముదాయం
- View Answer
- సమాధానం: 2
వివరణ: కులం అంటే కొంతమంది వ్యక్తుల సముదాయం. అంటే ఆ వ్యక్తులకు పితృపరంగా వృత్తి లభిస్తుంది. సంప్రదాయంగా, వారసత్వంగా లభించిన హక్కులు, బాధ్యతలు, భావాల మూలంగా వారంతా ఒక వ్యవస్థగా కలిసి ఉంటారు. వారికి కొన్ని నియమాలను ఐక్యంగా అమర్చుకొని వాటిని తమ వృత్తి, ఆహార నియమాల్లోను, వివాహ సంప్రదాయాల్లోనూ అమలు పర్చుకొంటారు.
- సమాధానం: 2
3. కుల వ్యవస్థ సిద్ధాంతాలను గురించి మనకు తెలియజేస్తున్న మొదటి సిద్ధాంతం ఏది ?
1) నారాయణ సూక్తం
2) విష్ణు సూక్తం
3) పురుష సూక్తం
4) నక్షత్ర సూక్తం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఋగ్వేదంలోని పురుష సూక్తంలో మొదటగా కుల క్రమం గురించి మనకు తెలుస్తుంది. బ్రాహ్మణులు బ్రహ్మ( విధాత) నోటి నుంచి, క్షత్రియులు అతని బాహువుల నుంచి, వైశ్యులు అతని ఊరువుల నుంచి, శూద్రులు అతని పాదాల నుంచి సృష్టించబడినారని తెలుస్తుంది. నారాయణ సూక్తం విశ్వ ఆవిర్భావాన్ని గురించి వివరిస్తుంది. నక్షత్ర సూక్తం కాల విభజన గురించి వివరిస్తుంది.
- సమాధానం: 3
4. వేదకాలంలో కుల వ్యవస్థకు మూల కారణం?
1) జాతి
2) భాష
3) వృత్తి
4) వర్ణం
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆర్యులకు ఉన్న వర్ణ(రంగు) జాడ్యం కుల వ్యవస్థకు మూల కారణమైంది. తెల్లటి వర్ణం వారైన ఆర్యులు తాము అధికులమనే భావం కలిగివుండేవారు. ఈ భావమే ‘దస్యులు’ అనే జాతిని సృష్టించింది.
- సమాధానం: 4
5. వర్ణాశ్రమ ధర్మం ఏ కాలంలో మిక్కిలి ప్రాచుర్యం వహించింది?
1) తొలి వేదకాలం
2) మలి వేదకాలం
3) మధ్యయుగం
4) పౌరాణిక కాలం
- View Answer
- సమాధానం: 2
వివరణ: మలి వేదకాలంలో వర్ణాశ్రమ ధర్మం మిక్కిలి ప్రాచుర్యం వహించింది. ఇది ఒక సాంఘిక సూత్రం. జీవితాన్ని నాలుగు విభాగాలుగా చేసి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు నిబద్దం చేశారు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యను అభ్యసించి, గృహస్థాశ్రమ సమయంలో గృహస్తు జీవితం గడపడం. వానప్రస్థాశ్రమంలో జ్ఞానసముపార్జన చేయడం, సన్యాసాశ్రమంలో పూర్తిగా భవ బంధాలను తెంచుకుని పరమాత్మలో ఐక్యం చెందడానికి కృషిసల్పడం అనే నిబంధనలు ఏర్పడ్డాయి.
- సమాధానం: 2
6. ఈ కింది వారిలో చండాలురు కానివారు ఎవరు?
1) వ్రత్యులు
2) నిషాదులు
3) కైవర్తులు
4) కారావారులు
- View Answer
- సమాధానం: 1
వివరణ: వ్రత్యులకు మొదట వైదిక మతంతో సంబంధం ఉండేది కాదు. వీరు ప్రాకృత భాషను మాట్లాడేవారు. స్థిరనివాసులు కారు, వీరికి మగధయందలి దస్యులతో సంబంధం ఉండేది. వీరినే తర్వాతి కాలంలో వైదిక సంఘంలోకి చేర్చుకున్నారు. నిషాదులు (వేటగాళ్లు), కైవర్తులు (చేపలు పట్టేవారు), కారావారులు (చర్మకారులు) వీరందరూ చండారులలోని వివిధ తెగలవారే.
- సమాధానం: 1
7. మలివేద కాలంలో గృహపతులని ఎవరిని అనేవారు?
1) బ్రాహ్మణులు
2) క్షత్రియులు
3) వైశ్యులు
4) శూద్రులు
- View Answer
- సమాధానం: 3
వివరణ: మలివేద కాలంలో వైశ్యులు వర్తక, వ్యవసాయ, పారిశా్రమ్రిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత వహించారు. వీరిలో ధనికులైన వారిని శ్రేష్ఠి అని, ‘గృహపతుల’ని పిలిచేవారు.
- సమాధానం: 3
8. హరప్పా నాగరికతలో స్త్రీపురుషుల శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసిన ఆనవాళ్లు మనకు ఎక్కడ కనిపించాయి?
1) కాళీభంగన్
2) లోథాల్
3) సుర్కటోడా
4) చన్హుదారో
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్త్రీపురుషుల శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసిన ఆనవాళ్లు – లోథాల్, దేశంలో మొదట సాగు చేసిన భూమికి సాక్ష్యాధారం – కాళీభంగన్, గుర్రం అవశేషాలు లభించిన ఏకైక పట్టణం – సుర్కటోడా, సిరాసీనా అనే ఓ చిన్న కుండను కనుగొన్నవారు – చన్హుదారో.
- సమాధానం: 2
9. ఆద్యంతాలు లేని మతంగా పరిగణించే మతం ఏది?
1) జొరాస్ట్రియన్ మతం
2) ఇస్లాం మతం
3) క్రిస్టియన్ మతం
4) వైదిక మతం
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారతదేశంలో 3,400 సంవత్సరాలకు పూర్వమే వైదిక మతం అభివృద్ధి చెందింది. హరప్పా సంస్కృతి అంతరించిన తర్వాత ఈ అభివృద్ధి ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఈ మతం ఎప్పుడు ఆవిర్భవించిందో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. ఆద్యంతాలు లేని మతం ఇది. అంటే సనాతనం అన్నమాట.
- సమాధానం: 4
10. రుగ్వేదంలోని శ్లోకాలు ఎవరిని ప్రత్యక్ష దైవంగా వర్ణిస్తాయి?
1) ప్రకృతి
2) వరుణుడు
3) అమ్మతల్లి
4) ఇంద్రుడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: వేదాల్లో అతి ప్రాచీనమైంది రుగ్వేదం. ఈవేద సంహితం 10 మండలాల్లో ఎన్నో శ్లోకాలతో కూడుకొని ఉంది. ఈ శ్లోకాలు ప్రకృతిని ప్రత్యక్షదైవంగా వర్ణిస్తాయి. రుగ్వేద కాలంలో సహజ సంఘటనలను ఆధారంగా చేసుకొని ప్రకృతి శక్తులకు దైవత్వం ఆపాదించబడింది.
- సమాధానం: 1
11. గోత్రం అంటే ఏమిటి?
1) జాతి
2) వంశం
3) కులం
4) మతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: అధర్వణ వేదం ప్రకారం గోత్రం అర్థం ‘వంశం’. దీన్ని మొదట బ్రాహ్మణ తరగతి వారు పాటించారు. తర్వాత ద్విజులందరూ పాటించసాగారు. చివరగా అందరూ పాటించారు. వివాహా సమయాల్లో ఈ గోత్ర ప్రాధాన్యత కనిపిస్తుంది. సొంత గోత్రికులందరినీ రక్త సంబంధీకులుగా పేర్కొంటారు. అందుకే స్వగోత్రికుల్లో వివాహాలు జరగవు.
- సమాధానం: 2
12. మనువు ప్రకారం వీరిలో అత్యున్నత స్థానం ఎవరిది?
1) ఉపాధ్యాయుడు
2) ఆచార్యుడు
3) తండ్రి
4) తల్లి
- View Answer
- సమాధానం: 4
వివరణ: మనుస్మృతి ప్రకారం పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు గొప్పవాడు, వందమంది ఆచార్యుల కంటే ఒక తండ్రి గొప్పవాడు, వెయ్యి మంది తండ్రుల కంటే ఒక తల్లి గొప్పది అని మనువు స్త్రీకి అత్యున్నత స్థాయిలో మాతృస్థానాన్ని కల్పించాడు.
- సమాధానం: 4
13. సంతతి లేని వితంతువులకు ఆíస్తిహక్కు కల్పించిన మొదటి పాలకుడు ఎవరు?
1) ఉదయనుడు
2) అమోఘవర్షుడు
3) ఖారవేలుడు
4) కుమార పాలుడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: సాధారణ శకం 12వ శతాబ్దం మధ్యలో గుజరాత్ పాలకుడైన చాళుక్య కుమార పాలుడు సంతతి లేని వితంతువులకు భర్త ఆíస్తిపై హక్కు లభించేటట్టుగా చేశాడు.
- సమాధానం: 4
14. గృహిణిగా గృహకృత్యాలు నిర్వహిస్తూ కుటుంబ సేవకు అంకితమైన స్త్రీని ఏమని పిలిచేవారు?
1) బ్రహ్మవాదిని
2) బ్రహ్మ చారిణి
3) సద్యోవధు
4) పునర్భువు
- View Answer
- సమాధానం: 3
వివరణ: బౌద్ధగ్రంథాల ప్రకారం బ్రహ్మవాదిని అంటే అధ్యాత్మిక చింతన ఉన్న స్త్రీ అని, పెళ్లి కాని కన్యను బ్రహ్మచారిణి అని, గృహిణిగా గృహకృత్యాలు నిర్వహిస్తూ కుటుంబ సేవకు అంకితమైన స్త్రీని సద్యోవధు అని, పునర్వివాహిత స్త్రీని పునర్భువు అని పిలుస్తారు.
- సమాధానం: 3
15. ఉపనయనం అయిన బ్రహ్మచారిని ఏమని పిలిచేవారు?
1) దౌహిత్రుడు
2) జామాత
3) ద్విజుడు
4) వటువు
- View Answer
- సమాధానం: 4
వివరణ: దౌహిత్రుడు కూతురు కొడుకు=మనుమడు, జామాత అంటే అల్లుడు, ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు అని అర్ధం. బ్రాహ్మణులకు, వైశ్యులకు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేయక ముందు అతడు బాలుడు తెలియక చేసే తప్పులకు పాపం అంటదు. ఉపనయనం తర్వాత మంచి చెడు తెలుసుకొనే యుక్త వయస్కుడు, తర్వాత చేసే పాపకర్మలు తనకే చెందుతాయి, కనుక ఉపనయనం చేయక ముందు ఒక జన్మ ఉపనయనం తర్వాత ఒక జన్మగా పరిగణించి ద్విజుడు అంటారు. ఉపనయనం అయిన బ్రహ్మచారిని వటువు అని పిలుస్తారు.
- సమాధానం: 4
16. ఏ వేదాన్ని సంగీత వేదం అంటారు?
1) రుగ్వేదం
2) యజుర్వేదం
3) సామవేదం
4) అధర్వణవేదం
- View Answer
- సమాధానం: 3
17. ‘తాన్సేన్’ అసలు పేరు?
1) రామ్ తనూపాండే
2) మహేష్‌దాస్
3) మకరంద పాండే
4) దోండూ పండిట్
- View Answer
- సమాధానం: 1
18. అక్బర్ ఏ సంగీత పరికరం ఉపయోగించడంలో నిపుణులు?
1) వేణువు
2) వీణ
3) నగారా
4) మృదంగం
- View Answer
- సమాధానం: 3
19. శాస్త్రీయ సంగీత గ్రంథమైన ‘రాగదర్పణాన్ని’ పారశీక భాషలోకి అనువాదం చేసిందెవరు?
1) ఇల్టుట్మిష్
2) బాల్బన్
3) ఘియాజుద్దీన్ తుగ్లక్
4) ఫిరోజ్‌షా తుగ్లక్
- View Answer
- సమాధానం: 4
20. పండిట్ రవిశంకర్ ఏ వాయిద్యంలో నిపుణులు?
1) సితార్
2) వయోలిన్
3) సరోద్
4) గిటార్
- View Answer
- సమాధానం: 1
21. కిందివాటిలో సరైన జత ఏది?
1) భీంసేన్జోషి–హిందుస్తానీ సంగీతం
2) సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్æ– కర్ణాటక సంగీత పితామహుడు
3) జాకీర్ హుస్సేన్–తబల
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
22. తాన్సేన్ సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది?
1) రాజస్థాన్
2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
23. ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మీ ఏ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సంగీత కచేరి నిర్వహించారు?
1) 1966
2) 1968
3) 1977
4) 1978
- View Answer
- సమాధానం: 1
24.సంగీతం పలికే శిలలు ఉన్న విఠలాలయం ఎక్కడ ఉంది?
1) పాలంపేట
2) హంపి
3) హన్మకొండ
4) కొట్టాయం
- View Answer
- సమాధానం: 2