‘ఇండియన్ ఫ్యూడలిజం’ గ్రంథ రచయిత ఎవరు?
1. తమిళ వేదాలుగా ప్రసిద్ధ్ది పొందిన గ్రంథం కానిది ఏది?
1) అప్పర్
2) సంబందార్
3) మణిక్కవీగరల్
4) పెరియపురాణం
- View Answer
- సమాధానం: 4
వివరణ: అప్పర్, సంబందార్, మణిక్కవీగరల్ వీటిని తమిళ వేదాలుగా పేర్కొంటారు. కుళోత్తుంగ చోళుని కాలంలో సెక్కిలార్ శివభక్తి గురించి పెరియపురాణాన్ని రచించాడు.
- సమాధానం: 4
2. తొలి మధ్యయుగ భారతీయ సమాజాన్ని ‘ఈ వ్యవస్థ స్వతంత్ర రైతాంగ విధానం కలిగిన వ్యవస్థ’గా పేర్కొన్న వ్యక్తి?
1) హర్బన్స్ముఖియా
2) బర్టన్ స్టీన్
3) నీలకంఠశాస్త్రి
4) కోశాంబి
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతీయ సమాజాన్ని గురించిన వివిధ చరిత్రకారుల అభిప్రాయాలు:
ఈ వ్యవస్థ స్వతంత్ర రైతాంగ విధానం కలిగిన వ్యవస్థ- హర్బన్స్ముఖియా,వికేంద్రీకరణ పాలన రైతాంగ బ్రాహ్మణ సమాజం - బర్టన్ స్టీన్, స్వయం సమృద్ధి కలిగిన స్థానిక స్వపరిపాలన - నీలకంఠశాస్త్రి, వికేంద్రీకృత పాలన వ్యవసాయ ఆధారమైన ఆర్థిక విధానం, భూస్వామ్య వ్యవస్థ అణగారిన రైతాంగం వంటి లక్షణాలు కలిగిన భూస్వామ్య సమాజం- కోశాంబి
- సమాధానం: 1
3. తొలి మధ్యయుగంలో మారక ద్రవ్యంగా చెలామణి అయినవి?
1) బంగారు నాణేలు
2) గవ్వలు
3) వెండి నాణేలు
4) రాగి నాణేలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: తొలి మధ్యయుగంలో గవ్వలుమారక ద్రవ్యంగా చెలామణి అయ్యాయి.
- సమాధానం: 2
4. ‘ఇండియన్ ఫ్యూడలిజం’ గ్రంథ రచయిత ఎవరు?
1) కోశాంబి
2) బర్టన్ స్టెయిన్
3) ఆర్.ఎస్. శర్మ
4) హర్బన్స్ ముఖియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: మధ్యయుగ భారతదేశాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రముఖ చరిత్రకారులు రచించిన వివిధ గ్రంథాలు:
-‘యాన్ ఇంట్రడక్షన్ టు ద స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ - డి.డి. కోశాంబి
- ‘పెజెంట్, స్టేట్ అండ్ సొసైటీ ఇన్ మిడివల్ ఇండియా’ - బర్టన్ స్టీన్
- ‘ఇండియన్ ఫ్యూడలిజం’ - ఆర్.ఎస్.శర్మ
- ‘వాజ్ దేర్ ఎ ఫ్యూడలిజం ఇన్ ఇండియన్ హిస్టరీ’ - హర్బన్స్ముఖియా
- సమాధానం: 3
5. సమాజ పరిణామ క్రమాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే అత్యుత్తమ విధానం ఏమిటి?
1) రాజవంశాల ప్రకారం
2) రాజకీయ విధానం
3) ఆర్థిక విధానం
4) సామాజిక విధానం
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాజకీయ మార్పుల ఆధారంగా చరిత్రను విభజించడం అంతగా ఆమోదనీయం కాదు. ఎందుకంటే, చరిత్రలో అనేక రాజవంశాలు ఒక దాని వెనుక మరొకటి పరిపాలించడం జరిగింది. అందులో కొన్ని రాజ వంశాలనే విభజనకు ఆధారంగా ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తే, సరైన సమాధానం లేదు. కాబట్టి, ఈ పద్ధతి ఆమోదనీయం కాదు. అన్ని విధాల చరిత్రవిభజనకు అనుకూలమైంది, ఆర్థికపరమైన విభజన. ఆర్థికపరమైన మార్పుల ఆధారంగా చరిత్ర విభజన చేయటం ద్వారా, సామాజికాభివృద్ధి స్థాయిని గ్రహించొచ్చు. అంతేకాక, ఆర్థికపరమైన మార్పులు సమాజంలో మిగిలిన అన్ని అంశాలను ప్రభావితం చేస్తాయి.
- సమాధానం: 3
6. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది?
1) చరిత్రపూర్వయుగంలో
2) ప్రాచీనయుగంలో
3) శిలాయుగంలో
4) చారిత్రక సంధి యుగంలో
- View Answer
- సమాధానం: 1
వివరణ: వ్యవసాయం చరిత్రపూర్వయుగంలో ప్రారంభమై, ప్రాచీనయుగంలో విసృ్తతమైంది. ప్రాచీనయుగం నుంచి ఆధునిక యుగం వరకు వ్యవసాయం ఆర్థికంగా ప్రధానమైన అంశం.
- సమాధానం: 1
7. దక్షిణ భారత భూస్వాములకు, ఐరోపా భూస్వాములకున్న అన్ని హక్కులున్నట్లు తెలిపిన చరిత్రకారుడు ఎవరు?
1) హేమచంద్రరాయ్
2) ఎ. అప్పాదొరై
3) ఆర్. ఎస్. నంది
4) నోబోరు కరాషిమా
- View Answer
- సమాధానం: 4
వివరణ: చరిత్రను హిందూ, టర్కీ, ఆఫ్ఘన్ల యుగాలుగా గుర్తించాలని ప్రతిపాదించినవారు - హేమచంద్రరాయ్
1 భూమి వ్యక్తుల ఆస్తిగా రూపొందడం, భూదానాలు విరివిగా కొనసాగడం వ్యవసాయ విస్తరణకు దారితీసింది - ఎ. అప్పాదొరై
2 భూస్వాముల అధికారాలు పెరగడం వల్ల రైతుల పరిస్థితి దిగజారినట్లు పేర్కొన్నది - ఆర్. ఎస్ . నంది
3 దక్షిణ భారత భూస్వాములకు, ఐరోపా భూస్వాములకున్న అన్ని హక్కులున్నట్లు తెలియజేసిన చరిత్రకారుడు - నోబోరు కరాషిమా
- సమాధానం: 4
8. ఘూర్జర ప్రతిహార శాసనాల్లో ‘ఖలబిక్షా’ అనే పన్ను దేనిని సూచిస్తుంది?
1) ఉత్పత్తిలో భాగం
2) నూర్పిడి పన్ను
3) సంతతి లేని వారిపై పన్ను
4) నిధులపై పన్ను
- View Answer
- సమాధానం: 2
వివరణ:
ఘూర్జర ప్రతిహార శాసనాల ప్రకారం ఉత్పత్తిలో భాగం - భాగ
నూర్పిడి పన్ను - ఖలబిక్షా
సంతతి లేని వారిపై పన్ను - అపుత్రకాథన
నిధులపై పన్ను - నిధి నిధాన.
- సమాధానం: 2
9. తొలి మధ్యయుగాల్లో సముద్ర వ్యాపారంలో ప్రఖ్యాతి గాంచినవారు?
1) చైనీయులు
2) భారతీయులు
3) అరబ్బులు
4) యూరోపియన్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: తొలి మధ్యయుగాల్లో సముద్ర వ్యాపారంలో అరబ్బులు ప్రఖ్యాతిగాంచారు. అప్పట్లో వీరిని సముద్రయానులు అనేవారు. అదే సమయంలో భారతీయులు సముద్ర యానాన్ని నిషిద్దంగా పరిగణించేవారు దాంతో విదేశీ వ్యాపారం పెద్దమొత్తంలో అరబ్బుల ఆధీనంలోకి వెళ్లింది.
- సమాధానం: 2
10. జతపరచండి.
1) ‘టెంపుల్స్ యాజ్ ల్యాండెడ్ మ్యాగ్నెట్స్ ఇన్ ఎర్లీ మిడీవల్ సౌత్ ఇండియా 700 - 1300 A.D.'
2) ‘టెంపుల్ మనీ లెండింగ్ అండ్ లైవ్ స్టాక్ రిడిస్ట్రిబ్యూషన్ ఇన్ ఎర్లీ తాంజోర్’
3) ‘గ్రోత్ ఆఫ్ రూరల్ ఎకానమీ ఇన్ ఎర్లి ఫ్యూడల్ ఇండియా’
4) ‘సౌత్ ఇండియన్ హిస్టరీ అండ్ సొసైటీ’
A. నోబోరు కరాషిమా
B. ఆర్. ఎస్ . నంది
C. డి.ఎన్. ఝా
D. హేమచంద్రరాయ్
E. జార్జ్. డబ్ల్యూ. స్పెన్సర్
1) 1 -C, 2 - E, 3 - B, 4 - A
2) 1 - A, 2 - B, 3 - D, 4 - C
3) 1 - A, 2 - B, 3 - C, 4 - D
4) 1 - D, 2 - E, 3 - B, 4 - A
- View Answer
- సమాధానం: 2
వివరణ:
1. ‘టెంపుల్స్ యాజ్ ల్యాండెడ్ మ్యాగ్నెట్స్ ఇన్ ఎర్లీ మిడీవల్ సౌత్ ఇండియా 700 - 1300 A.D.’ - డి.యన్. ఝా
2. ‘టెంపుల్ మనీ లెండింగ్ అండ్ లైవ్ స్టాక్ రిడిస్ట్రిబ్యూషన్ ఇన్ ఎర్లీ తాంజోర్’ - జార్జ్. డబ్ల్యూ. స్పెన్సర్
3. ‘గ్రోత్ ఆఫ్ రూరల్ ఎకానమీ ఇన్ ఎర్లి ఫ్యూడల్ ఇండియా ’ - ఆర్. ఎస్ . నంది
4. ‘సౌత్ ఇండియన్ హిస్టరీ అండ్ సొసైటీ’ - నోబోరు కరాషిమా.
- సమాధానం: 2
11. భారతదేశంలో ప్రథమ భూదాన శాసనం ఎవరి కాలానికి చెందింది?
1) మౌర్యుల కాలం
2) కుషాణుల కాలం
3) శాతవాహనుల కాలం
4) గుప్తుల కాలం
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారతదేశంలో ప్రథమ భూదాన శాసనం శాతవాహనుల కాలానికి చెందింది. యజ్ఞయాగాలు చేసిన బ్రాహ్మణులకు వీరు సాధారణ శకం మొదటి శతాబ్దం నుంచి గ్రామ దానాలను చేశారు. ఉత్తర భారతదేశంలో మాత్రం గుప్తులకాలం నుంచే భూదాన శాసనాలు లభిస్తున్నాయి.
- సమాధానం: 3
12. రెండో ప్రవరసేనుడు వేయించిన శాసనం ఏది?
1) మాగల్లు దాన తామ్ర శాసనం
2) మొగలుట్ల దాన తామ్ర శాసనం
3) ఉత్తరేశ్వర దాన తామ్ర శాసనం
4) చమ్మక్ తామ్ర శాసనం
- View Answer
- సమాధానం: 4
వివరణ:
మాగల్లు దాన తామ్ర శాసనం: కాకత్య గుండ్యన కోరిక మేరకు తూర్పు చాళుక్యరాజు దానార్ణవుడు ఓ బ్రాహ్మణుడికి మాగల్లు గ్రామాన్ని దానం చేసిన విషయాన్ని తెలుపుతుంది.
గణపతిదేవుని మొగలుట్ల దాన తామ్ర శాసనం: రాజు కూతురు కోట గణపాంబ వేసిన శాసనం మొగలుట్ల గ్రామాన్ని ఓ బ్రాహ్మణుడికి దానం చేయడాన్ని ఇందులో పేర్కొన్నారు.
ఉత్తరేశ్వర దాన తామ్ర శాసనం: ప్రతాపరుద్రుడి మంత్రి చాళుక్య ఇందుశేఖరుడు ఉత్తరేశ్వర గ్రామాన్ని విద్దనాచార్య బ్రాహ్మణునికి దానమివ్వడం గురించి తెలుపుతుంది.
చమ్మక్ తామ్ర శాసనం: రెండో ప్రవరసేనుడు వేయించిన ఈ చమ్మక్ తామ్ర శాసనం వేయి బ్రాహ్మణులకు చేసిన గ్రామ దానాలను గురించి వివరిస్తుంది.
- సమాధానం: 4
13. బ్రాహ్మణేతర గ్రామాల్లో పాలనాసమితిని ఏ పేరుతో పిలిచేవారు?
1) సభ
2) పరుదాయి
3) ఉర్
4) బ్రహ్మదేయ
- View Answer
- సమాధానం: 3
వివరణ: సభ అనేది ప్రాచీన కాలంలో ఉన్న గ్రామస్థాయి కమిటీ దీనిలో గ్రామంలోని ప్రజలందరూ సభ్యులే. పరుదాయి అనేది దేవాలయాలకు చెందిన భూములను పర్యవేక్షించే సంస్థ. ఉర్ బ్రాహ్మణేతర గ్రామాల్లో పాలనాసమితి. బ్రహ్మదేయ గ్రామాలు బ్రాహ్మణులు దానంగా పొందిన గ్రామాలు.
- సమాధానం: 3
14. ఖండఖ్యాదక గ్రంథ రచయిత ఎవరు?
1) భాస్కరాచార్యుడు
2) బ్రహ్మగుప్తుడు
3) ఆర్యభట్ట
4) వరహమిహిరుడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: భాస్కరాచార్యుడు లీలావతి, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాలు రచించాడు. బ్రహ్మగుప్తుడు ఖండఖ్యాదక, బ్రహ్మస్ఫుట సిద్ధాంతాలను రచించాడు. ఈ రెండు గ్రంథాలను సాధారణ శకం 8వ శతాబ్దంలో అరబ్బీలోకి తర్జుమా చేశారు. ఆర్యభట్టుని ఆర్యభట్టీయం, సూర్యసిద్ధాంతం, గోళాద్యాయం, ఆర్య సిద్ధాంతం మెదలైన గ్రంథాలను రచించాడు. వరహమిహిరుడు బృహజ్జాతకము, బృహత్సంహిత, పంచసిద్ధాంతిక మొదలైన గ్రంథాలను రచించాడు.
- సమాధానం: 2
15. మన దేశంలో అంకెల ఆవిర్భావానికి కారణమైన లిపి?
1) ఖరోష్టి లిపి
2) దేవనాగరి లిపి
3) చిత్ర లిపి
4) బ్రాహ్మీ లిపి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఖరోష్టి లిపి కుడి నుంచి ఎడమకు రాసేవారు. ఇది పశ్చిమోత్తర ప్రాంతాల్లో మాత్రమే ప్రబలి సాధారణ శకం 4వ శతాబ్దం నాటికి అంతరించింది. దేవనాగరి లిపి భారత, నేపాల్ దేశాల్లో వ్యాప్తిలో ఉంది. హిందీ, మరాఠీ, నేపాలీ భాషలను రాయడానికి ఈ లిపినే ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని ఎడమ నుంచి కుడికి రాస్తారు. చిత్ర లిపిని రాత ప్రక్రియకి ముందు కాలానికి సంబంధించిన సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ఒక వరుసలో 4 సంజ్ఞలు/అక్షరాలు చెక్కబడి మొత్తం మీద 132 చిహ్నాలతో కూడి ఉండడం వీటి ప్రత్యేకత. బ్రాహ్మీలిపి ఆధారంగా మన దేశంలో అంకెలు రూపుదిద్దుకొన్నాయి. ఇది మన దగ్గర నుంచి అరబ్బులు వారి దగ్గర నుంచి యూరోపియన్లు నేర్చుకొన్నారు.
- సమాధానం: 4
16. జతపరచండి.
1. అష్టాంగ సంగ్రహం. A. నాగార్జునుడు
2. చికిత్సాసార సంగ్రహం B.మాధవకరుడు
3. రుగినిశ్చ గ్రంథం C. చక్రసాగి దత్తుడు
4. రసరత్నాకరం D. వాగ్భాటుడు
1) 1 -D, 2 - C, 3 - B, 4 - A
2) 1 - A, 2 - B, 3 - C, 4 - D
3) 1 - C, 2 - D, 3 - A, 4 - B
4) 1 - D, 2 - C, 3 - B, 4 - A
- View Answer
- సమాధానం: 1
వివరణ:
1 రసరత్నాకరం - ఆచార్య నాగార్జునుడు రచించాడు. ఇది రసాయన గ్రంథం దీనిలో పాదరసం గురించి ఎక్కువగా వివరించారు.
2 చికిత్సాసార సంగ్రహం - చక్రసాగి దత్తుడు ఈ గ్రంథాన్ని సాధారణ శకం 1060లో రచించాడు. దీనిలో వైద్యులు పాటించవలిసిన విలువలు చెప్పబడ్డాయి.
3 రుగినిశ్చ గ్రంథం - మాధవకరుడు సా.శ. 9వ శతాబ్దంలో రచించాడు. ఇదో వైద్య గ్రంథం.
4 అష్టాంగ సంగ్రహం - వాగ్భాటుడు రచించాడు ఇదీ వైద్య గ్రంథమే.
- సమాధానం: 1
17. ‘తైలోపీడ’ యంత్రాన్ని గురించిన శాసనం ఏ రాష్ట్రంలో ఉంది?
1) మధ్యప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: హిమాచల్ ప్రదేశ్కు చెందిన శాసనం సా. శ. 804 తైలోపీడ యంత్రాన్ని గురించి పెర్కొన్నది. ఇది పత్తి నుంచి గింజను వేరుచేసే జిన్ యంత్రం. ఇందులో అమర్చిన రోలర్స్ ఆధునిక యంత్రానికి ఉపయోగపడ్డాయని జోసఫ్ నీథమ్ పేర్కొన్నాడు.
- సమాధానం: 2
18. ఇటుకలను ఏ మతస్థులు తమ కట్టడాల్లో ఉపయోగించారు?
1) ఇస్లాం
2) హిందూ
3) బౌద్ధులు
4) జైనులు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇస్లాం, హిందూ, జైన మతస్థులు తమ కట్టడాల్లో ఎక్కువగా రాతిని ఉపయోగించారు. బౌద్ధులు మాత్రం ఇటుకలను ఉపయోగించారు. వీరి ఆరామాలను, చైత్యాలను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది.
- సమాధానం: 3
19. విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించింది ఎవరు?
1) కృష్ణదేవరాయలు
2) హరిహరరాయలు
3) లోకమహాదేవి
4) తిరుమలాంబ
- View Answer
- సమాధానం: 3
వివరణ: చాళుక్య రాజైన రెండో విక్రమాదిత్యుడి భార్య లోకమహాదేవి తన భర్త కాంచీపురాన్ని జయించిన సందర్భంగా నిర్మింపజేసిన దేవాలయం. దీనిని గుండా అనే వాస్తు శిల్పి రూపొందించాడు.
- సమాధానం: 3
20. తొలి మధ్యయుగ భారతీయ సమాజంలో ఉప్పు వ్యాపారులను ఏమని పిలిచేవారు?
1) నేమిక వాణిక
2) అయ్యావళి
3) వణికులు
4) పెదాయో
- View Answer
- సమాధానం: 1
వివరణ: తొలి మధ్యయుగ భారతీయ సమాజంలో ఉప్పు వ్యాపారులను నేమిక వాణిక అనే పేరుతో చెలామణి అయ్యేవారు. అయ్యావళి అంటే ప్రాంతీయ వ్యాపారులు. వణికులు అంటే గుజరాత్ వ్యాపారులు. పెదాయో అంటే ధాన్యాన్ని అమ్మేవారు.
- సమాధానం: 1
21. ప్రపంచానికే కేంద్రంగా అరబ్బు భౌగోళికులు పేర్కొన్న నగరం ఏది?
1) ఢిల్లీ
2) ఉజ్జయినీ
3) కచ్
4) కన్యాకుమారి
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారతదేశం ద్వారా అరబ్ భౌగోళికులు ప్రపంచానికి ఒక కేంద్రం ఉందని, దాన్ని ‘అరిన్’ అంటే ఉజ్జయిని అని పేర్కొన్నారు. అప్పటికే ఉజ్జయినిలోఒక ఖగోళ పరిశోధనాలయం ఉన్నట్టు తెలియజేస్తున్నారు. (Hitti, History of the Arabs P.384) ఇదే విషయం టాలమీ రచనలలోనూ కనిపిస్తుంది.
- సమాధానం: 2
22. ‘యుక్తి కల్పతరువు’ అనే రాజనీతి గ్రంథకర్త ఎవరు?
1) బిల్హణుడు
2) భాస్కరాచార్యుడు
3) పరామర భోజుడు
4) పావులూరి మల్లన
- View Answer
- సమాధానం: 3
వివరణ: బిల్హణుడు విక్రమాంకదేవచరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణిలో గ్రహాల చలనాల గురించి విసృ్తతంగా చర్చించాడు. పరామర భోజుడు యుక్తి కల్పతరువు అనే గ్రంథంలో నౌకా నిర్మాణాన్ని గురించి రకరకాల నౌకలను గురించి తెలిపారు. పావులూరి మల్లన గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులో రచించాడు.
- సమాధానం: 3