గంగానది ప్రక్షాళనకు నిరాహార దీక్ష చేసి మరణించిన వారు ఎవరు?
1. విజయనగర రాజుల కాలంలో అత్యంత జనాదరణ పొందిన సంగీత పరికరం?
1) మృదంగం
2) వీణ
3) నాదస్వరం
4) వేణువు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రాచీనకాలం నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత పరికరం వీణ. పిఠాపురం, జగ్గయ్యపేట, బొబ్బిలి ప్రాంతాల్లో నాణ్యమైన వీణలు తయారు చేస్తారు.
- సమాధానం: 2
2. ‘భగవద్గీత’ను మరాఠీ భాషలోకి అనువదించిందెవరు?
1) ఏక్నాథ్
2) నామ్‌దేవ్
3) చండీదాస్
4) జ్ఞానదేవుడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: హిందువుల పవిత్ర మతగ్రంథం భగవద్గీత. ఈగ్రంథాన్ని మొదట సంస్కృతంలో లిఖించారు. సర్.విల్కిన్స్ దీన్ని ఆంగ్లంలోకి అనువదించారు.
- సమాధానం: 1
3. కాకతీయుల కాలంలో కూనవరం దేనికి ప్రసిద్ధిగాంచింది?
1) కలంకారీ పరిశ్రమ
2) బొమ్మల తయారీ
3) గాజుల తయారీ పరిశ్రమ
4) కత్తుల పరిశ్రమ
- View Answer
- సమాధానం: 4
వివరణ: కాకతీయుల కాలంలో వరంగల్ తివాచీల తయారీకి, నిర్మల్ బొమ్మల తయారీకి, చండూరు కంచు గంటల తయారీకి ప్రసిద్ధి. అలాగే కూనవరం కత్తుల పరిశ్రమకు ప్రసిద్ధి.
- సమాధానం: 4
4. ‘ప్రచ్ఛన్నబుద్ధుడు’ అని ఎవరిని అంటారు?
1) మధ్వాచార్యులు
2) రామానుజాచార్యులు
3) వల్లభా చార్యులు
4) ఆదిశంకరా చార్యులు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆదిశంకరా చార్యులు మాయావాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఇది ఆచార్యా నాగార్జునుని శూన్య వాద సిద్ధాంతాన్ని పోలి ఉంది. కాబట్టి ఆది శంకరుని అలా పిలుస్తారు.
- సమాధానం: 4
5. ‘క్వీన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్’ అని ఏ సంగీత పరికరాన్ని అంటారు?
1) వేణువు (ప్లూట్)
2) వయోలిన్(ఫిడేల్)
3) నగారా(ఢంకా)
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
వివరణ: పాశ్చాత్య సంగీత వాయిద్యాలలో వయోలిన్ ‘క్వీన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్’ . వీణ అతి ప్రాచీన తంత్రీ వాయిద్యం. పియానోను ‘కింగ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు.
- సమాధానం: 2
6. భారతదేశంలో నిర్మించిన తొలి పాలరాతి సమాధి ఏది?
1) ఆటల మసీదు
2) హిందోలామహల్
3) హోషంగా సమాధి
4) తాజ్‌మహల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: హోషంగా సమాధి ఎంతో అందమైన, భారత్‌లో నిర్మించిన తొలి పాలరాతి సమాధి. ఢిల్లీ సుల్తానుల కాలంలో నిర్మించారు. హుమాయూన్ సమాధి ఢిల్లీలో ఉంది. ఇది తాజ్ మహల్ నిర్మాణానికి ప్రేరణ. ఇది మొగలులు నిర్మించిన తొలి పాలరాతి నిర్మాణం.
- సమాధానం: 3
7. దశవతార గుహను రాష్ట్ర కూటుల కాలంలో ఎక్కడ శిల్పీకరించారు?
1) మహాబలిపురం
2) ఉజ్జయిని
3) బేలూరు
4) ఎల్లోరా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఎల్లోరాలో రాష్ట్రకూటులు నిర్మించిన దశవతార గుహ కలదు. దశావతార దేవాలయాన్ని గుప్తులు దేవ్‌ఘడ్‌లో నిర్మించారు. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఇలా శిల్పీకరించారు.
- సమాధానం: 4
8. ఎన్ని సంవత్సరాలు పూర్తయిన కట్టడాలకు ప్రాచీన కట్టడ హోదాను భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది?
1) 100 సంవత్సరాలు
2) 200 సంవత్సరాలు
3) 300 సంవత్సరాలు
4) 400 సంవత్సరాలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రాచీన భవనాలను పరిరక్షించే క్రమంలో భాగంగా 100 సంవత్సరాలు నిండిన నిర్మాణాలను భారత ప్రభుత్వం తన పరిరక్షణలోకి తీసుకుని, అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది.
- సమాధానం: 1
9. కద్రి గోపాల్‌నాథ్ అయ్యర్ ఏ సంగీత పరికరం వాయించుటలో దిట్ట?
1) మృదంగం
2) శాక్సాఫోన్
3) సితార్
4) గిటార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: శాక్సాఫోన్ వాయిద్యంలో గోపాల్‌నాథ్ ధిట్ట. విశ్వమోహన్ భట్ గిటార్. పండిట రవిశంకర్ సితార్, యల్లా వెంకటేశ్వరరావు మృదంగం వాయించడంలో కీర్తిగాంచారు.
- సమాధానం: 2
10. తీరదేవాలయాలు ఏ దేవునికి అంకితం?
1) శివుడు
2) విష్ణువు
3) బ్రహ్మ
4) కుమారస్వామి
- View Answer
- సమాధానం: 1
వివరణ: పల్లవుల కాలంలో నిర్మితమైన తీర దేవాలయాలు (hore temples) శివునికి అంకితం. ఈ రాజుల రాజ లాంఛనం నంది. తమిళనాడులో శైవ మతస్తుల ను నాయనారులు అంటారు.
- సమాధానం: 1
11. గంగానది ప్రక్షాళనకు నిరాహార దీక్ష చేసి ఆ సందర్భంలోనే మరణించిన వారు ఎవరు?
1) డి.ఎస్.హుడా
2) చండీ ప్రసాద్ భట్
3) విజయ్ గోఖలే
4) జి.డి. అగర్వాల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కాలుష్యంతో ప్రవహిస్తున్న గంగానది ప్రక్షాళన కోసం 2018 జూన్‌లో నిరాహార దీక్ష చేస్తూ మరణించారు. ‘స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్’ అని కూడా ఈయనను పిలుస్తారు.
- సమాధానం: 4
12. శ్రీకృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో రాజ్యపాలనా బాధ్యతలు చేపట్టాడు?
1) 1509
2) 1512
3) 1518
4) 1519
- View Answer
- సమాధానం: 1
వివరణ: తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు 1509లో పట్టాభిషిక్తుడయ్యాడు. సాహిత్యాన్ని పోషించిన ఈయన ‘భువనవిజయం’ అనే కవుల సమావేశ మందిరాన్ని నిర్మించాడు. ఆంధ్రభోజుడుగా కీర్తిగడించాడు. 1529లో స్వర్గస్తుడయ్యాడు.
- సమాధానం: 1
13. కొండలను తొలిచి గుహలను నిర్మించిన తొలి పల్లవ రాజు ఎవరు?
1) సింహ విష్ణువు
2) మహేంద్ర వర్మ–1
3) నరసింహ వర్మ–1
4) నందివర్మ
- View Answer
- సమాధానం: 2
వివరణ: దక్షిణ భారతదేశంలో గుహాలయాలను నిర్మించిన తొలి పల్లవరాజు మొదటి మహేంద్ర వర్మ. ఆ తదుపరి ఆయన వారసులు కూడా గుహాలయాలు నిర్మించారు. విష్ణుకుండినులు, రాష్ట్రకూట రాజులు ఈ పద్ధతిని విస్త్రృత∙పరిచారు.
- సమాధానం: 2
14. వేలువన విహారమును బౌద్ధ సంఘానికి దానం చేసింది ఎవరు?
1) బింబిసారుడు
2) అజాత శత్రువు
3) ప్రసేనజిత్తు
4) ఉదయనుడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: బింబిసారుడిని బౌద్ధమత గ్రంథాలు బౌద్ధుడని రాసాయి. ఈయన వేలువన విహారాన్ని బౌద్దులకు దానం చేశారు. ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు.
- సమాధానం: 1
15. ‘త్రిసముద్రాధిపతి’ బిరుదాంకితుడెవరు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) శివ శ్రీ శాతకర్ణి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) 3వ పులోమావి
- View Answer
- సమాధానం: 3
వివరణ: మహారాష్ట్ర, అపరాంత(గోవా), మధ్య భారత్‌లను జయించాడు కాబట్టి హర్షుని ఆస్థానకవి బాణుడు ఇతనికి త్రిసముద్రాధిపతి(బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం) అనే బిరుదు ఉంది.
- సమాధానం: 3
16.‘అష్టాంగ సంగ్రహం’ ఏ అంశాలకు సంబంధించినది?
1) ఖగోళ అంశాలు
2) వైద్య సంబంధ అంశాలు
3) గణిత శాస్త్ర అంశాలు
4) సంస్కృత వ్యాకరణ అంశాలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: వాగ్భటుడు రాసిన అష్టాంగ సంగ్రహం అనే గ్రంథం సంస్కృత భాషలో గల వైద్య శాస్త్ర అంశాలు వివరించే గ్రంథం. భారతీయ వైద్యశాస్త్ర చరిత్రను ఈ గ్రంథం విస్త్రృత పరిచాడు.
- సమాధానం: 2
17. ‘బార్డోలీ వీరుడు’ అని ఎవరిని అంటారు?
1) సర్ధార్ అజిత్ సింగ్
2) సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్
3) మంగళ్ పాండే
4) కన్హూర్ జి మెహతా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బార్డోలీ సత్యాగ్రహం గుజరాత్ రాష్ట్రంలో 1928లో జరిగింది. ఈ ఉద్యమం ఫలితంగా ప్రభుత్వం 5.7 శాతం పన్నును మాత్రమే పెంచాలని సూచించింది. ఈ ఉద్యమం సందర్భంగా ‘సర్ధార్’ అనే బిరుదును గాంధీజీ పటేల్‌కు ఇచ్చారు.
- సమాధానం: 2
18. ‘జల్, జంగిల్, జమీన్’ నినాద కర్త ఎవరు?
1) రాంజీ గోండ్
2) కొమురం భీం
3) గాం మల్లుదొర
4) అంబుల్ రెడ్డి
- View Answer
- సమాధానం: 2
వివరణ: నీరు, అడవి, భూమి ప్రకృతి సిద్ధమైనవని, అవి సహజ సిద్ధంగా గోండ్ జాతికి చెందుతాయని ఈ నినాదం ఇచ్చారు. స్వతంత్ర అధికారం కోసం, జాతి విముక్తి కోసం కొమురం భీం పోరాడి, వీరమరణం పొందాడు.
- సమాధానం: 2
19. ‘ప్రిన్స్ ఆఫ్ పెయింటర్స్’ అని ఎవరిని అంటారు?
1) బాబర్
2) జహంగీర్
3) షాజహాన్
4) అక్బర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జహంగీర్ చిత్రకారుడైన మొగల్ పాలకుడు. చిత్రలేఖనాన్ని చూసి ఎవరు ఆ చిత్రాన్ని గీశారో చెప్పుడంలో దిట్ట. బాబర్‡ ఉద్యాన వనాల నిర్మాణాల్లో, షాజహాన్ పాలరాతి నిర్మాణాల్లో, అక్బర్ ‘నగారా’ మోగించడంలో దిట్టలు.
- సమాధానం: 2
20. థామస్ మన్రో ఎక్కడ మరణించారు?
1) ఆదోని
2) ధర్మవరం
3) పత్తికొండ
4) రాప్తాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాయలసీమ ప్రధాన కలెక్టర్ అయిన తర్వాత రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. వివిధ హైందవ దేవా లయాలకు నిధులు మంజూరు చేసాడు. కలరా వ్యాధితో కర్నూలు జిల్లా పత్తికొండలో మరణించాడు.
- సమాధానం: 3
21. చంద్రకాంత్ సోంపుర ఏ రంగంలో దిట్ట?
1) శిల్ప కళారంగం
2) వైద్యరంగం
3) వైమానిక రంగం
4) విద్యుత్ రంగం
- View Answer
- సమాధానం: 1
వివరణ: చంద్రకాంత్ సోంపుర ప్రముఖ శిల్పి. అనేక దేవాలయాలను రూపొందించి హైందవ సంస్కృతి పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన స్వరాష్ట్రం గుజరాత్.
- సమాధానం: 1
22. అర్జునుని తపస్సు శిల్పం ఎక్కడ శిల్పీకరించారు?
1) మథురై
2) కాంచీపురం
3) శ్రావణ బెళగొళ
4) మహాబలిపురం
- View Answer
- సమాధానం: 4
వివరణ: పల్లవుల పాలనా కాలంలో నిర్మించిన అనేక గుహాలయాలు, శిల్పాలు ప్రపంచ ఖ్యాతినార్జించాయి. అటువంటి వాటిలో మహాబలిపురంలోని అర్జునుని తపస్సు శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ శిల్పాన్నే గంగావతరణ శిల్పం అని కూడా అంటారు.
- సమాధానం: 4
23. భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలో ఉంది?
1) ఆదిపర్వం
2) భీష్మ పర్వం
3) సభాపర్వం
4) అరణ్య పర్వం
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహాభారతంలోని మొత్తం 18 పర్వాలలో భీష్మ పర్వం విశిష్టమైంది. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన వివిధ ధృక్కోణాల మేలు కలయిక భగవద్గీత. దీన్ని ఆంగ్లేయుడు సర్ విల్కిన్స్ ఆంగ్లీకరించాడు. ఇది హిందువుల పవిత్ర మత గ్రంథం. అందరూ చదవవలసిన దార్శినిక గ్రంథం.
- సమాధానం: 2
24. కాంగ్రా తేనీరు ఏ రాష్ట్రంలో తయారు చేస్తారు?
1) హిమాచల్‌ప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: కాంగ్రా తేనీరు హిమాచల్ ప్రదేశ్‌లో తయారు చేస్తారు. 1848 నుంచి తేయాకు పెంచుతూ అభివృద్ధి చేశారు. ఈ తేయాకు విశిష్ట సువాసన కలిగి ఉంటుంది. ఔషధ గుణాలు కూడా ఇందులో కలవు.
- సమాధానం: 1
25. డోనా గంగూలీ ఏ నాట్య ప్రక్రియలో కీర్తిగాంచారు?
1) కథక్
2) మోహినీ అట్టం
3) ఒడిస్సీ
4) మణిపురి
- View Answer
- సమాధానం: 3
వివరణ: శాస్త్రీయ నాట్యమైన ఒడిస్సీ నాట్యంలో డోనా గంగూలీ ఆరితేరారు. ఈమె అనేక నాట్య ప్రదర్శనలిచ్చారు. విదేశీయులు కూడా ఈమె నాట్యానికి మంత్ర ముగ్ధులయ్యారు. ఈమె ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అర్థాంగి.
- సమాధానం: 3