ఉత్తర భారతదేశంలో రబీకాలంలో గోధుమ పంటను ప్రభావితం చేసే సముద్రం ఏది?
1. కింది వాటిలో సరైంది ఏది?
a) మినికాయ్ దీవి, మాల్దీవుల మధ్య నుంచి 8ని ఛానల్ వెళుతోంది
b) భారతదేశం 8 దేశాలతో ఉమ్మడి భూ సరిహద్దును కలిగి ఉంది
c) మనదేశ ప్రామాణిక రేఖాంశం 82బీని తూర్పు రేఖాంశం
1) a, b
2) a, c
3) b, c
4) a, b, c
- View Answer
- సమాధానం: 2
2. కింది వాటిలో సరికానిది ఏది?
1) కనుమ అంటే రెండు పర్వతాల మధ్య సహజంగా ఏర్పడిన రహదారి
2) దోబ్/అంతర్వేది అంటే రెండు నదుల మధ్య ప్రాంతం
3) ఓ2/గాడ్విన్ ఆస్టిన్ శిఖరం హిమాద్రి శ్రేణుల్లో ఉంది
4) మనదేశ ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న హిమాలయాలను పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారు.
- View Answer
- సమాధానం: 3
3. కింది వాటిలో సహ్యాద్రి పర్వతాల్లో విస్తరించి ఉన్న కనుమలు ఏవి?
a) బోర్ ఘాట్ కనుమ
b) కైమూర్ కనుమ
c) థాల్ ఘాట్ కనుమ
d) పాల్ ఘాట్ కనుమ
1) a, b
2) a, c
3) a, b, c
4) a, b, c, d
- View Answer
- సమాధానం: 2
4. జతపరచండి.
జాతీయ పార్కులు రాష్ట్రాలు
i) జిమ్ కార్బెట్ a) ఒడిశా
ii) పిన్ వ్యాలీ b) ఉత్తరాఖండ్
iii) కన్హా c) హిమాచల్ ప్రదేశ్
iv) బిత్తర్ కానిగ d) మధ్యప్రదేశ్
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-b, ii-c, iii-d, iv-a
- View Answer
- సమాధానం: 4
5. 2017 స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం శాతం పరంగా దేశంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలు ఏవి?
1) మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్
2) మిజోరాం, మధ్యప్రదేశ్
3) మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్
4) అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 3
6. ప్రతిపాదన (ఎ): నల్లరేగడి నేలలు అనార్థ్ర వ్యవసాయానికి చాలా అనుకూలం
కారణం (ఆర్): ఇవి తేమను నిల్వ చేసుకునే శక్తిని తక్కువగా కలిగి ఉంటాయి
1) (ఎ) (ఆర్)లు సరైనవే. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ) (ఆర్)లు సరైనవే. (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది, కానీ (ఆర్) సరికాదు
4) (ఎ) సరికాదు, కానీ (ఆర్) సరైంది
- View Answer
- సమాధానం: 3
7. ఉత్తర భారతదేశంలో రబీకాలంలో గోధుమ పంటను ప్రభావితం చేసే సముద్రం ఏది?
1) అరేబియా సముద్రం
2) బంగాళాఖాతం
3) హిందూ మహాసముద్రం
4) మధ్యధరా సముద్రం
- View Answer
- సమాధానం: 4
8. జతపరచండి.
నదులు జన్మస్థానాలు
i) తుంగభద్ర a) బాలాఘాట్ పర్వతాలు
ii) మంజీరా b) వరాహ పర్వతాలు
iii) కావేరి c) బ్రహ్మగిరి పర్వతాలు
iv) పెన్నా d) నందిదుర్గ పర్వతాలు
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-b, ii-a, iii-c, iv-d
3) i-c, ii-d, iii-b, iv-a
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 2
9. కింది వాటిలో సరికానిది ఏది?
1) థెయిన్ ప్రాజెక్టు - రావి నది
2) సుంకేశుల ప్రాజెక్టు - కృష్ణానది
3) దూల్హస్తి ప్రాజెక్టు- చీనాబ్
4) ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదన - గోదావరి
- View Answer
- సమాధానం: 2
10. కింది వాటిలో సరికానిది ఏది?
1) మన దేశంలో కర్ణాటక రాష్ట్రాన్ని ‘సుగంధ ద్రవ్యాల తోట’ అని పిలుస్తారు
2) సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది
3) భారత్‌లో పట్టును అత్యధికంగా కర్ణాటక రాష్ర్టం ఉత్పత్తి చేస్తోంది
4) చేపల ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ రాష్ర్టం అగ్ర స్థానంలో ఉంది
- View Answer
- సమాధానం: 1
11. ‘దల్లిరాజ్‌హరా’ ఇనుప ఖనిజ గని ఏ రాష్ర్టంలో ఉంది?
1) జార్ఖండ్
2) చత్తీస్‌గఢ్
3) ఒడిశా
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 2
12. కింది వాటిలో సరైనవి ఏవి?
a) కుడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని అమెరికా సహాయంతో నిర్మిస్తున్నారు
b) జల విద్యుత్‌ను మనదేశం భూటాన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది
c) మనదేశంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రాన్ని 1902లో కావేరి నదిపై శివసముద్రం వద్ద నిర్మించారు
1) a, b
2) b, c
3) a, c
4) a, b, c
- View Answer
- సమాధానం: 2
13. తెలంగాణలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాలు వరుసగా?
1) జనగామ, జగిత్యాల, ఆదిలాబాద్
2) జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్
3) రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జోగులాంబ గద్వాల
4) కొమురంభీం అసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగామ
- View Answer
- సమాధానం: 4
14. జతపరచండి.
జాబితా - 1 జాబితా - 2
i) కందిగల్ గుట్టలు a) వరంగల్ అర్బన్
ii) యల్లండ్లపాడుగుట్టలు b) ఖమ్మం
iii) షాబాద్ గుట్టలు c) మహబూబ్‌నగర్
iv) నందగిరి గుట్టలు d) నల్లగొండ
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-d, ii-a, iii-b, iv-c
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 3
15. జోగులంబ గద్వాల జిల్లా ఏయే రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటోంది?
1) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక, మహారాష్ర్ట
3) ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్
4) మహారాష్ర్ట, చత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 1
16. కింది వాటిలో సరైంది ఏది?
a) మొత్తం పంట విస్తీర్ణానికి, నికర సాగు విస్తీర్ణానికి మధ్య నిష్పత్తిని పంట సాంద్రత అంటారు
b) 2016-17 సంవత్సరంలో రాష్ర్ట సగటు సాంద్రత సుమారు 1.25గా ఉంది
c) అత్యధిక పంట సాంద్రత కరీంనగర్లో ఉంది
1) a, b
2) b, c
3) a, c
4) a, b, c
- View Answer
- సమాధానం: 1
17. జతపరచండి.
జాబితా - 1
i) దేవాదుల ఎత్తిపోతల పథకం
ii) కంతనపల్లి ఎత్తిపోతల పథకం
iii) కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
iv) ఎల్లంపల్లి ప్రాజెక్టు
జాబితా - 2
a) జె. చొక్కారావు ఎత్తిపోతల పథకం
b) పి.వి. నరసింహారావు ఎత్తిపోతల పథకం
c) మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం
d) శ్రీపాదసాగర్ ప్రాజెక్టు
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-b, ii-c, iii-d, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 4