ప్రాజెక్టు టైగర్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
1. కింది వాటిలో సరికానిది ఏది?
1) సిక్కిం రాష్ట్రం నేపాల్, భూటాన్, చైనా దేశాలతో భూసరిహద్దును కలిగి ఉంది
2) పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో భూసరిహద్దును కలిగి ఉంది
3) అసోం రాష్ట్రం బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలతో భూసరిహద్దును కలిగి ఉంది
4) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భూటాన్, చైనా, మయన్మార్ దేశాలతో భూసరిహద్దును కలిగి ఉంది
- View Answer
- సమాధానం: 3
2. కింది వాటిలో సరైంది ఏది?
a) హిమాద్రి పర్వత శ్రేణి సగటు ఎత్తు 6100 మీ.
b) మహాభారత్ పర్వత శ్రేణి నేపాల్‌లో విస్తరించి ఉంది
c) హిమాచల్, శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న సన్నని సమదైర్ఘ్య లోయలను ‘చోస్’లు అని పిలుస్తారు
1) a, b
2) a, c
3) b, c
4) a, b, c
- View Answer
- సమాధానం: 1
3. జతపరచండి.
కనుమలు ప్రదేశాలు
i) బొమ్మిడిల్లా a) హిమాచల్ ప్రదేశ్
ii) జిప్ లా b)జమ్ము-కశ్మీర్
iii) షిప్కి లా c) అరుణాచల్ ప్రదేశ్
iv) బనిహల్ d) సిక్కిం
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-c, iii-a, iv-b
4) i-c, ii-b, iii-d, iv-a
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో సరికానిది ఏది?
1) లానినో ఒక శీతల ప్రవాహం
2) ఇది హిందూ మహా సముద్రంలో ఏర్పడుతుంది
3) ఎల్‌నినో వల్ల భారత్‌లో కరువులు ఏర్పడుతాయి
4) భారత్‌లో శీతాకాలంలో అత్యంత శీతలంగా ఉండే ప్రాంతం - ద్రాస్
- View Answer
- సమాధానం: 2
5. ప్రాజెక్టు టైగర్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1972
2) 1992
3) 1991
4) 1973
- View Answer
- సమాధానం: 4
6.స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ - 2017 ప్రకారం అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలు ఏవి?
1) పంజాబ్, మిజోరాం
2) హరియాణా, మిజోరాం
3) పంజాబ్, హిమాచల్ ప్రదేశ్
4) హరియాణా, పంజాబ్
- View Answer
- సమాధానం: 4
7. జతపరచండి.
జాబితా-i
i) ఎర్ర మృత్తికలు
ii) నల్లరేగడి మృత్తికలు
iii)ఒండలి మృత్తికలు
iv) లాటరైట్ మృత్తికలు
జాబితా-ii
a)అత్యంత సారవంతమైనవి
b) అతి తక్కువ సారవంతమైనవి
c) సారవంతమైనవి
d) తక్కువ సారవంతమైనవి
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-c, iii-a, iv-b
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 3
8. కింది వాటిలో సరైంది ఏది?
a) సట్లెజ్ నది షిప్కి లా కనుమ ద్వారా జమ్ము-కశ్మీర్లోకి ప్రవేశిస్తుంది
b) బ్రహ్మపుత్ర నది భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది
c) జీలం నది శ్రీనగర్ వద్ద ఊలార్ సరస్సును ఏర్పరస్తుంది
1) a, b
2) a, c
3) b, c
4) a, b, c
- View Answer
- సమాధానం: 3
9. ప్రతిపాదన: (ఎ) దేశంలోనే అతిపొడవైన ప్రాజెక్టు హీరాకుడ్ ప్రాజెక్టు.
కారణం (ఆర్): దీని పొడవు సుమారు 3801 మీ.
1) (ఎ), (ఆర్) సరైనవే, (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్)లు సరైనవే, (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది, కానీ (ఆర్) సరికాదు
4) (ఎ) సరికాదు, కానీ (ఆర్) సరైంది
- View Answer
- సమాధానం: 3
10. కింది వాటిలో సరికానిది ఏది?
1) భారత్‌లో తేయాకును తొలిసారిగా బాబుబుడాన్ కొండల్లో సాగు చేశారు
2) దేశంలో హరిత విప్లవం ద్వారా అధిక ప్రయోజనం పొందిన పంట - గోధుమ
3) దేశంలో కుంకుమ పువ్వు జమ్ము- కశ్మీర్లో అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది
4) పశ్చిమ బెంగాల్ జనుమును అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది.
- View Answer
- సమాధానం: 1
11. కింది వాటిలో సరికానిది ఏది?
1) కోయంబత్తూర్‌ను ‘మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని పిలుస్తారు
2) భారత్‌లో తొలి ఇనుము-ఉక్కు పరిశ్రమను ‘పోర్టోనోవా’ వద్ద ఏర్పాటు చేశారు.
3) 1907లో సక్చి వద్ద జంషెడ్జీ టాటా ‘టిస్కో’ను ఏర్పాటు చేశారు
4) 1937లో ‘అల్యూమీనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ను దామన్ జోడి వద్ద ఏర్పాటు చేశారు
- View Answer
- సమాధానం: 4
12.జతపరచండి.
అణు విద్యుత్ కేంద్రాలు రాష్ట్రాలు
i) కాక్రపార a) ఉత్తరప్రదేశ్
ii) కైగా b)రాజస్థాన్
iii) కోటా c) కర్ణాటక
iv) నరోరా d) గుజరాత్
1) i-c, ii-b, iii-d, iv-a
2) i-d, ii-a, iii-b, iv-c
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 3
13. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి 200 నాటికల్ మైళ్లు
బి) కచ్ఛటప దీవులు భారత్, శ్రీలంక మధ్య విస్తరించి ఉన్నాయి
సి) భారత్ 37ని6 నుంచి 68ని7 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
14. కింది వాటిని జతపరచండి.
జాబితాI
i) బిస్త్ దోబ్
ii) రేచన దోబ్
iii) ఛాజ్ దోబ్
iv) బారి దోబ్
జాబితాII
a) చీనాబ్-జీలం
b)రావి - చీనాబ్
c) బియాస్ - రావి
d) బియాస్ - సట్లెజ్
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-c, ii-d, iii-b, iv-a
3) i-d, ii-b, iii-a, iv-c
4) i-c, ii-a, iii-b, iv-d
- View Answer
- సమాధానం: 3
15. కింది వాటిలో సరికానిది ఏది
1) ఇలైమలై కొండలను కార్డమమ్ కొండలు అని పిలుస్తారు
2) ఫళని కొండలు కేరళ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి
3) ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తయిన శిఖరం అనైముడి
4) గంగా - సింధూ మైదానం ప్లీస్టోసీన్ కాలం నుంచి నేటి వరకు ఏర్పడుతోంది
- View Answer
- సమాధానం: 2
16. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) నల్లరేగడి నేలలను ఉష్ణమండల చెర్నోజెమ్ నేలలు అని కూడా పిలుస్తారు
బి) బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన నేలలను లాటరైట్ నేలలు అని పిలుస్తారు
సి) గ్రానైట్, స్ఫటికాకార రూపాంతర శిలలు శైథిల్యం చెందడం వల్ల ఎర్ర మృత్తికలు ఏర్పడతాయి
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో సరికాని జత ఏది?
1) కజిరంగా జాతీయ పార్కు - అసోం
2) రాజాజీ జాతీయ పార్కు - ఉత్తరాఖండ్
3) సరిస్కా జాతీయ పార్కు - రాజస్థాన్
4) దచిగామ్ జాతీయ పార్కు - ఉతరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
18. రోజ్‌వుడ్ వృక్షం ఏ అరణ్యాల్లో పెరుగుతుంది?
1) ఆకురాల్చే అరణ్యాలు
2) సతత హరిత అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) చిట్టడవులు
- View Answer
- సమాధానం: 2
19. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఎల్‌నినో అనేది ఒక శీతల ప్రవాహం
2) ఇది ఫసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంది
3) భారతదేశ సంవత్సర సగటు వర్షపాతం 117 సెం.మీ.
4) లానినో వల్ల భారత్‌లో వరదలు సంభవిస్తాయి
- View Answer
- సమాధానం: 1
20. కిందివాటిలో సరైంది ఏది?
ప్రతిపాదన(A): బ్రహ్మపుత్ర నదిని ‘రెడ్ రివర్’ అని పిలుస్తారు
కారణం(R): ఇది అసోం లోయలోని ఎర్ర నేలల గుండా ప్రవహిస్తుంది.
1) A, Rలు సరైనవి, Aకు Rసరైన వివరణ
2) A, Rలు సరైనవి, Aకు Rసరైన వివరణ కాదు
3) Aసరైంది, Rసరైంది కాదు
4) Aసరైంది కాదు, Rసరైంది
- View Answer
- సమాధానం: 1
21. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఫరక్క ప్రాజెక్టు ‘కాండ్లా’ ఓడరేవును రక్షించుకోవడం కోసం నిర్మించారు
బి) భారత్, నేపాల్‌తో మహంకాళి ఒప్పందాన్ని చేసుకుంది
సి) ఇందిరా సాగర్ ప్రాజెక్టును నర్మదా నదిపై నిర్మించారు
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3