నేపాల్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1. కింది వాటిని జతపర చండి?
జాబితా-I జాబితా-II
i) మాక్డోక్డింపెప్ లోయ a) పశ్చిమ బెంగాల్
ii) నుబ్రాలోయ b) మేఘాలయ
iii) కులులోయ c) జమ్మూ కశ్మీర్
iv) కాలింపాంగ్ d) హిమాచల్ ప్రదేశ్
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-b, ii-c, iii-d, iv-a
4) i-d, ii-b, iii-a, iv-c
- View Answer
- సమాధానం: 3
2. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
i) కచార్ కొండలు
ii) డాప్లా కొండలు
iii) లుషాయి కొండలు
iv) జయంతియా కొండలు
జాబితాII
a) మేఘాలయ
b) మిజోరాం
c) అరుణాచల్ ప్రదేశ్
d) అసోం
1) i-a, ii-c, iii-d, iv-b
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-c, ii-a, iii-d, iv-b
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 4
3. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జస్కార్ పర్వత శ్రేణి, కారకోరం పర్వత శ్రేణికి ఉత్తరంగా విస్తరించి ఉంది.
బి) లడఖ్, జస్కార్ శ్రేణుల మధ్య సింధూనది ప్రవహిస్తోంది.
సి) కారకోరం పర్వతశ్రేణి ట్రాన్స హిమాలయాల్లో ఒక భాగం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో సరికానిది ఏది?
1) ‘కనుమ’ అంటే రెండు కొండల మధ్య ఏర్పడే సహజ రహదారి
2) అంతర్వేది అంటే రెండు నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతం
3) అనేక నదులకు జన్మస్థానమైన ‘మానస సరోవరం’ హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది.
4) ‘డూన్లు’ అంటే హిమాచల్, శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న సన్నని సమధైర్ఘ్య లోయలు
- View Answer
- సమాధానం: 3
5. నేపాల్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) కాళీ , తీస్తా నదులు
2) తీస్తా, సట్లెజ్ నదులు
3) సట్లెజ్, కాళీ నదులు
4) తీస్తా, బ్రహ్మపుత్ర నదులు
- View Answer
- సమాధానం: 1
6. కింది వాటిలో సరికానిది ఏది?
1) హిమాలయాలు అతితరుణ ముడత పర్వతాలు
2) ఇవి కేంబ్రియన్ మహాయుగంలో ఏర్పడ్డాయి.
3) ఇవి ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణులు
4) ఇవి సుమారు 5లక్షల చ.కి.మీ.ల వైశాల్యం కలిగి ఉన్నాయి.
- View Answer
- సమాధానం: 2
7. కింది వాటిలో సరికాని జత ఏది?
1) నామ్చాబర్వా- అరుణాచల్ ప్రదేశ్
2) అన్నపూర్ణ - ఉత్తరాఖండ్
3) నంగప్రభాత్ - జమ్మూ కశ్మీర్
4) మకాలు - నేపాల్
- View Answer
- సమాధానం: 2
8. కిందివాటిలో సరైంది ఏది?
ఎ) శివాలిక్ పర్వత శ్రేణులు గ్రేటర్ హిమాలయాలకు దక్షిణంగా విస్తరించి ఉన్నాయి.
బి) లెస్సర్ హిమాలయాలు బాహ్య హిమాలయాలకు ఉత్తరంగా విస్తరించి ఉన్నాయి.
సి) శివాలిక్ హిమాలయాలు మయోసిన్ యుగంలో ఏర్పడ్డాయి.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) బి, సి
- View Answer
- సమాధానం: 2
9. జతపరచండి.
జాబితా-I
i) కైలాస కొండ లు
ii) సులేమాన్ పర్వతాలు
iii) కున్లున్ పర్వతాలు
iv) హిందుకుష్ పర్వతాలు
జాబితా-II
a) ఆఫ్ఘనిస్తాన్
b) చైనా
c) పాకిస్తాన్
d) టిబెట్
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-d, ii-a, iii-b, iv-c
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-b, ii-c, iii-d, iv-a
- View Answer
- సమాధానం: 3
10. ‘ఆసియా ఖండానికి వెన్నెముక’ అని ఏ పర్వత శ్రేణిని పిలుస్తారు?
1) లడఖ్ శ్రేణి
2) జస్కార్ శ్రేణి
3) కైలాస కొండలు
4) కారకోరం పర్వతశ్రేణి
- View Answer
- సమాధానం: 4
11. కింది వాటిలో హిమాలయ పర్వత శ్రేణిలో లేని శిఖరం ఏది ?
1) కాంచన గంగా
2) గాడ్విన్ ఆస్టిన్
3) మకాలు
4) ధవ ళగిరి
- View Answer
- సమాధానం: 2
12. కింది వాటిలో సరికానిది ఏది?
1) ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని బనిహల్ కనుమను పిలుస్తారు
2) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ‘సియాచిన్’
3) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో శిఖరం కాంచనగంగ
4) భారతదేశంలో ఎత్తైన కనుమ ఖార్దుంగ్లా కనుమ
- View Answer
- సమాధానం: 3
13. జతపరచండి.
జాబితా-I
i) నిథులా కనుమ
ii) షిప్కిలా కనుమ
iii) జోజిలా
iv) నాథులా
జాబితా-II
a) సిక్కిం
b) ఉత్తరాఖండ్
c) హిమాచల్ ప్రదేశ్
d) జమ్మూకశ్మీర్
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 2
14. షిప్కిలా కనుమ ద్వారా భారతదేశంలో ప్రవేశించే నది ఏది?
1) సింధూనది
2) జీలం
3) బ్రహ్మపుత్ర
4) సట్లెజ్
- View Answer
- సమాధానం: 4
15. శివాలిక్ పర్వత శ్రేణులకు సంబంధించి సరైంది ఏది?
ఎ) ఇవి దిగువ ప్లిస్టోసీన్ యుగంలో ఏర్పడ్డాయి.
బి) ఇవి ఇసుక, గ్రావెల్ కంగ్లా మరేటి వంటి శిలలతో ఏర్పడ్డాయి.
సి) ఈ పర్వత శ్రేణుల్లో శృంగాకారపు అడవులు విస్తరించి ఉన్నాయి.
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
16. హిమాచల్ పర్వత శ్రేణులకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ఇవి వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్థి చెందాయి.
బి) ఇవి గ్రానైట్, నీస్ వంటి శిలలతో ఏర్పడ్డాయి.
సి) ఇవి సుమారు 14 మిలియన్ సంవత్సరాల కాలంలో ఏర్పడ్డాయి.
డి) ఇవి హిమాద్రి శ్రేణులకు ఉత్తరంగా విస్తరించి ఉన్నాయి.
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 1
17. గంగా - సింధు మైదానం ఏయే దేశాల్లో విస్తరించి ఉంది?
1) భారత్, బంగ్లాదేశ్ , మయన్మార్
2) భారత్, బంగ్లాదేశ్ , పాకిస్తాన్
3) భారత్, నేపాల్ , పాకిస్తాన్
4) భారత్, పాకిస్తాన్ , చైనా
- View Answer
- సమాధానం: 2
18. చోస్ అంటే ఏమిటి?
1) చిత్తడి ప్రదేశం
2) నీటి గుంటలు
3) బురద దిబ్బలు
4) ఇసుక దిబ్బలు
- View Answer
- సమాధానం: 2
19. జతపరచండి.
జాబితా-I
i) బారిదోబ్
ii) ఛాజ్
iii) రేచన
iv) బిస్త్
జాబితా-II
a) బియాస్- రావి నదుల మధ్య
b) చీనాబ్- జీలం నదుల మధ్య
c) రావి- చీనాబ్ నదుల మధ్య
d) బియాస్- సట్లెజ్ నదుల మధ్య
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-c, ii-d, iii-b, iv-a
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 4
20. కింది వాటిలో సరికానిది ఏది?
1) త్రియాన్ అంటే కదిలే ఇసుక దిబ్బలు
2) రన్స అంటే ఉప్పునీటి కయ్యలు
3) రోహి అంటే సారవంతంకాని భూములు
4) కోల్స్ అంటే బురద దిబ్బలు
- View Answer
- సమాధానం: 3
21. ప్రస్తుతం ఉన్న హిమాలయాలు ఏ ఫలకలు ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డాయి?
1) ఆస్ట్రేలియా ఫలక, ఉత్తర అమెరికా ఫలక
2) యురేషియా ఫలక, ఆఫ్రికా ఫలక
3) యురేషియా ఫలక, ద్వీపకల్ప ఫలక
4) ఆస్ట్రేలియా ఫలక, ద్వీపకల్ప ఫలక
- View Answer
- సమాధానం: 3
22. ‘కాయల్స్’ ప్రధానంగా ఏ తీరంలో కనిపిస్తాయి?
1) మలబారు తీరం
2) కోరమండల్ తీరం
3) కొంకణ్ తీరం
4) వంగ తీరం
- View Answer
- సమాధానం: 1
23.జతపరచండి.
జాబితా-I
i) చిల్కా సరస్సు
ii) కొల్లేరు సరస్సు
iii) అష్టముడి సరస్సు
iv) వెంబనాడ్ సరస్సు
జాబితా-II
a) కేరళ మైదానం
b) మలబార్ తీరం
c) సర్కార్ తీరం
d) ఉత్కళ తీరం
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-d, ii-a, iii-b, iv-c
3) i-b, ii-a, iii-d, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 4
24. కిందివాటిలో పశ్చిమ కనుమలకు చెందనివి ఏవి?
1) గాలి కొండలు
2) ఫళని కొండలు
3) కార్డమమ్ కొండలు
4) ఇలైమలై కొండలు
- View Answer
- సమాధానం: 1
25. కింది వాటిలో సరికాని జత ఏది?
1) దూప్ఘర్ శిఖరం-సాత్పూరా పర్వతాలు
2) అమరకంటక్ శిఖరం-వింధ్యాపర్వతాలు
3) గురుశిఖర్- నీలగిరి పర్వతాలు
4) అనైముడి - పశ్చిమ కనుమలు
- View Answer
- సమాధానం: 3
26. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ద్వీపకల్ప పీఠభూమి ప్రాక్- కేంబ్రియన్ కాలంలో ఏర్పడింది.
బి) ఇది సుమారు 16లక్షల చ.కి.మీ విస్తరించి ఉంది.
సి) ఇది భారతదేశంలో కెల్లా అతిపెద్ద భూస్వరూపం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
27. జతపరచండి.
జాబితా-I
i) భోరట్ పీఠభూమి
ii) కథియవార్ పీఠభూమి
iii) భాఘల్ఖండ్ పీఠభూమి
iv) బస్తర్ పీఠభూమి
జాబితా-II
a) గుజరాత్
b) రాజస్తాన్
c) చత్తీస్గడ్
d) మధ్యప్రదేశ్
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-b, ii-a, iii-c, iv-d
3) i-d, ii-a, iii-c, iv-b
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 4
28. మాల్వా పీఠభూమిని, దక్కన్ పీఠభూమిని వేరుచేసే నది ఏది?
1) మహానది
2) తపతి
3) నర్మద
4) గోదావరి
- View Answer
- సమాధానం: 3
29. కింది వాటిలో సరికానిది ఏది?
1) మాల్వా పీఠభూమికి ఈశాన్యంగా రాజమహల్ కొండలు సరిహద్దుగా ఉన్నాయి.
2) వింధ్యాపర్వతాలు, మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి.
3) కర్చి అంగ్లాంగ్ పీఠభూమి మేఘాలయ లో ఉంది.
4) పరుష్నాథ్ శిఖరం అండమాన్ దీవుల్లో విస్తరించి ఉంది.
- View Answer
- సమాధానం: 4
30. లావా పీఠభూమికి ఒక ఉదహరణ?
1) మహారాష్ట్ర పీఠభూమి
2) చోటా నాగపూర్ పీఠభూమి
3) షిల్లాంగ్
4) బుందేల్ఖండ్
- View Answer
- సమాధానం: 1
31. సాత్పూరా పర్వత శ్రేణులు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) సోన్, నర్మదా
2) నర్మదా, గోదావరి
3) గోదావరి, తపతి
4) తపతి, నర్మదా
32. జతపరచండి.
జాబితా-I
i) రాజ్పిప్లా కొండలు
ii) మహాదేవ కొండలు
iii) జవధి
iv) అన్నామలై
జాబితా-II
a) కేరళ
b) తమిళనాడు
c) మహారాష్ట్ర
d) మధ్యప్రదేశ్
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-c, ii-d, iii-b, iv-a
3) i-b, ii-c, iii-d, iv-a
4) i-b, ii-d, iii-c, iv-a
- View Answer
- సమాధానం: 2
33. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ద్వీపకల్ప పీఠభూమిలో రెండో ఎత్తైన శిఖరం అనైముడి
బి) నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట శిఖరం
సి) వేసవి విడిది కేంద్రమైన ఉదక మండలం నీలగిరి పర్వతాల్లో ఉంది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
34. ‘ఏనుగు ఎల్లమ్మ కొండలు’ ఏ పర్వత శ్రేణుల్లో భాగంగా విస్తరించి ఉన్నాయి?
1) పశ్చిమ కనుమలు
2) వింధ్యా పర్వతాలు
3) తూర్పు కనుమలు
4) ఆరావళి పర్వతాలు
- View Answer
- సమాధానం: 3
35. కింది వాటిని దక్షిణం నుంచి ఉత్తరానికి అమర్చండి?
ఎ) పాల్ఘాట్
బి) బోర్ఘాట్
సి) థాల్ఘాట్
1) బి, సి, ఎ
2) బి, ఎ, సి
3) ఎ, బి, సి
4) సి, ఎ, బి
- View Answer
- సమాధానం: 3
36. జతపరచండి.
జాబితా-I
i) మహేంద్రగిరి కొండలు
ii) సహ్యాద్రి పర్వతాలు
iii) షెవరాయ్ పర్వతాలు
iv) యాలకుల పర్వతాలు
జాబితా-II
a) ఒడిశా
b) మహారాష్ట్ర
c) తమిళనాడు
d) కేరళ
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-d, ii-a, iii-c, iv-b
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 4
37. కింది వాటిలో సరికానిది ఏది?
1) పశ్చిమ కనుమలు సుమారు 1600 కి.మీ.ల పొడవున విస్తరించి ఉన్నాయి.
2) భారతదేశంలో కెల్లా అతిపెద్ద భూస్వరూపం గంగా సింధూ మైదానం
3) ద్వీపకల్ప పీఠభూమి వాలు తూర్పు దిశగా వాలి ఉంది
4) ద్వీపకల్ప పీఠభూమి దేశంలో కెల్లా అతిపురాతనమైన భూస్వరూపం
- View Answer
- సమాధానం: 2
38. అరకాన్యోమా పర్వతాలు ఏ దేశంలో విస్తరించి ఉన్నాయి?
1) భారత్
2) పాకిస్తాన్
3) భూటాన్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 4
39. కింది వాటిని ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి?
1) సాత్పురా పర్వతాలు, వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు, నీలగిరి పర్వతాలు
2) వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, ఆరావళి పర్వతాలు, నీలగిరి పర్వతాలు
3) ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, నీలగిరి పర్వతాలు
4) నీలగిరి పర్వతాలు, సాత్పుర పర్వతాలు, వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు
- View Answer
- సమాధానం: 3
40. కింది వాటిలో సరికాని జత ఏది?
1) జిందగాడ -పశ్చిమ కనుమలు
2) జోగ్ జలపాతం- బాబూబుడాన్ కొండలు
3) కలహట్టి జలపాతం- నీలగిరి పర్వతాలు
4) కొడై కెనాల్ - ఫళని కొండలు
- View Answer
- సమాధానం: 1
41. మనదేశంలో భౌగోళికంగా గంగా- సింధూ మైదానం ఎక్కడ విస్తరించి ఉంది?
1) హిమాచల్ పర్వతాలకు ఉత్తరంగా
2) శివాలిక్ పర్వతాలకు దక్షిణంగా
3) ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణంగా
4) హిమాద్రి శ్రేణులకు ఉత్తరంగా
- View Answer
- సమాధానం: 2