‘మౌసమ్’ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
1. ‘మౌసమ్’ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
1) ఇంగ్లిష్
2) అరబిక్
3) జపనీస్
4) ఫ్రెంచ్
- View Answer
- సమాధానం: 2
2. ‘మౌసమ్’ అంటే..?
1) రుతువు
2) తుఫాను
3) సముద్రం
4) భూమి
- View Answer
- సమాధానం: 1
3. రుతుపవన శీతోష్ణస్థితికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఇంచుమించు పొడిగా ఉంటుంది
2) ఈ ప్రాంతంలో వేసవి చివరి భాగంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది
3) భారత్, చైనా, బంగ్లాదేశ్, థాయ్లాండ్ తదితర దేశాలు రుతుపవన శీతోష్ణస్థితికి చెందినవి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
4. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న ప్రాంతం ఏది?
1) చిరపుంజి
2) మాసిన్రామ్
3) ైటైపీ
4) హనోయ్
- View Answer
- సమాధానం: 2
5. ‘మాసిన్రామ్’లో ఎన్ని సెం.మీ. వర్షపాతం నమోదవుతుంది?
1) 1200
2) 800
3) 500
4) 300
- View Answer
- సమాధానం: 1
6. కింది వాటిలో రుతుపవన మండలంలోని నిర్దిష్ట కాలం?
1) శీతాకాలం
2) వేసవికాలం
3) వర్షాకాలం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:4
7. రుతుపవన శీతోష్ణస్థితి మండలంలో అటవీ సంపదకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) వీటిని ‘రుతుపవన అడవులు’ అని కూడా అంటారు
2) ఈ మండలంలో దట్టమైన సతత హరిత అడవులున్నాయి
3) ఈ అడవుల్లో వెదరు, సాల్, లక్క, జిగురు మొదలైన చెట్లు పెరుగుతాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
8. రుతుపవన శీతోష్ణస్థితి మండలంలో జనాభాకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత ఉన్న ద్వీపం ‘జావా’
2) ప్రపంచంలో బివ వంతు జనాభా ఇక్కడే ఉంటుంది
3) ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న బంగ్లాదేశ్ ఈ మండలంలో ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
9. రుతుపవన శీతోష్ణస్థితి మండలంలో వ్యవసాయానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ మండలంలో వరి, చెరుకు, జనుము తదితర ప్రధాన పంటలు పండుతాయి
2) తీర ప్రాంతాలు కొబ్బరి తోటలకు అనుకూలంగా ఉంటాయి
3) కొండ ప్రాంతాలు తేయాకు, కాఫీ తోటలకు ప్రసిద్ధి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
10. రుతుపవన శీతోష్ణస్థితి మండలంలో ఖనిజాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ ప్రాంతంలో మైకా, మాంగనీస్, టంగ్స్టన్ మొదలైనవి అత్యధికంగా లభిస్తాయి
2) ఇనుము, టంగ్స్టన్ మొదలైనవి తక్కువగా లభిస్తాయి
3) పెట్రోలియం, బొగ్గు మొదలైన ఇంధన వనరులు లభిస్తాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
11. రష్యా భాషలో ‘టైగా’ అంటే..?
1) శృంగాకార అడవులు
2) ఉపనదులు
3) నదులు
4) భూమి
- View Answer
- సమాధానం: 1
12. ఆఫ్రికా ఖండంలో లవంగాలు ఎక్కువగా పండే ప్రాంతం ఏది?
1) జాంజిబార్
2) కిగోమా
3) మారా
4) డుడుమా
- View Answer
- సమాధానం: 1
13. ఉపధృవ మండలంలో శీతోష్ణస్థితికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ప్రపంచంలోకెల్లా అత్యంత శీతల ప్రదేశాల్లో ఈ మండలం కూడా ఒకటి
2) సైబీరియాలోని ‘ఓమికన్’లో అత్యల్పంగా -78ని సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది
3) వేసవి చివరి భాగంలో మాత్రమే వర్షపాతం, పశ్చిమ పవనాలు బలంగా వీస్తాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
14. ఉపధృవ మండలంలో ‘వృక్ష సంపద’కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ ప్రాంతంలో ఫైన్, ఫిర్, లార్బ, స్ఫ్రూ మొదలైన వృక్షాలు పెరుగుతాయి
2) ఈ మండలంలోని అడవులు ఒక తీరం నుంచి మరో తీరం వరకు వ్యాపించి ఉన్నాయి
3) తక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో అతి విశాలమైన శృంగాకార అడవులు ఎక్కువగా పెరుగుతాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
15. ఉపధృవ మండలంలో జంతు సంపదకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ మండలంలో ప్రధానమైన పక్షులు వడ్రంగి పిట్ట, గ్రవుస్, గ్రాస్బిక్
2) ఇక్కడి జంతువులు చలిని తట్టుకోవడానికి దట్టమైన వెంట్రుకలను కలిగి ఉంటాయి
3) ఇక్కడ నివసించే ప్రధాన జంతువులు లింక్స్, బీవర్, వీజెల్, మూస్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
16.ఉపధృవ మండలంలో వ్యవసాయానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ ప్రాంతం వ్యవసాయానికి చాలా తక్కువగా ఉపయోగపడుతుంది
2) ఈ మండలంలో కర్ర గుజ్జు ఉత్పత్తికి చాలా ప్రాధాన్యం ఉంది
3) వేసవిలో బఠానీ, క్యాబేజి, ముల్లంగి తదితర కూరగాయలను పండిస్తారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
17. ఉపధృవ మండలంలోని ఖనిజాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ప్రపంచంలో అతి విశిష్టమైన ఖనిజ నిక్షేపాలు స్వీడన్ దేశంలో ఉన్నాయి
2) ‘లంబర్ జాక్స్’ అనే సాంకేతిక నిపుణులైన తెల్లవారు ఇక్కడ ఉన్నారు
3) ప్రపంచంలోకెల్లా లోతైన మంచినీటి సరస్సు ‘బైకాల్’ ఈ మండలంలోనే ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
18. భూమధ్యరేఖకు ఇరువైపులా 70ని కంటే ఎక్కువ ఉన్న అక్షాంశాల ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1) మధ్యదరా శీతోష్ణస్థితి మండలం
2) రుతుపవన శీతోష్ణస్థితి మండలం
3) సమ శీతోష్ణస్థితి మండలం
4) టండ్రా మండలం
- View Answer
- సమాధానం: 4
19. కింది వాటిలో టండ్రా మండలంలో ఉత్తరార్ధ గోళంలోని ప్రాంతాలు ఏవి?
1) ఐస్లాండ్
2) అలస్కా
3) సైబీరియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
20. టండ్రా మండలంలో శీతోష్ణస్థితికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) మూడు నెలలు వేసవికాలం ఉంటుంది
2) తొమ్మిది నెలలు చల్లగా ఉంటుంది
3) ఉష్ణోగ్రతృ 45°C వరకు ఉంటుంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
21. టండ్రా మండలంలోని జంతు సంపదకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) టండ్రావాసులకు బహుళార్థ జంతువు ‘ధృవపు జింక’
2) ధృవపు జింక నుంచి మాంసం, చర్మం, పాలు లభిస్తాయి
3) టండ్రా తీర ప్రాంతంలో సీల్స్, తిమింగలాలు, ధృవపు ఎలుగుబంట్లు, వాల్స్ ్రజంతువులు ఎక్కువగా ఉన్నాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
22. ఎస్కిమోలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఎస్కిమోలు కెనడా ప్రాంతంలో నివసిస్తారు
2) వీరు తమ ఇళ్లను జంతువుల తోళ్లు, మంచుతో నిర్మించుకుంటారు
3) తీర ప్రాంతాల్లోని చేపలను పట్టుకుని జీవనం సాగిస్తారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
23. ద్రాక్ష తోటల సాగును ఏమని పిలుస్తారు?
1) విటి కల్చర్
2) గ్రీన్ కల్చర్
3) యెల్లో కల్చర్
4) వైట్ కల్చర్
- View Answer
- సమాధానం: 1
24. టండ్రా మండలంలో పక్షులు, పూల మొక్కలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ ప్రాంతంలో వివిధ రకాల పక్షులు గుంపులుగా జీవిస్తాయి
2) గుంపులుగా జీవించే ప్రాంతాలను ‘రూకరీ’ అని పిలుస్తారు
3) పాపిలు, లిల్లీలు, వయోలెట్లు అనే పూల మొక్కలు పెరుగుతాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
25. టండ్రా ప్రాంతంలో వృక్ష సంపదకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ ప్రాంతంతో పెడ్జిలు, లిచ్చన్స, మోసన్ అనే నాచు మొక్కలు పెరుగుతాయి
2) భూమిని కప్పి ఉంచే మంచు పొర మీద సూర్యకాంతి పడి పరావర్తనం చెందడం వల్ల కొన్ని వృక్షాలు ఎరుపు రంగు.. ఆకుపచ్చగా కనిపిస్తాయి
3) ఈ ఆకుపచ్చ, ఎరుపు రంగు తెరను ఉత్తరార్ధ గోళంలో ‘అరోరా బోరియాలిస్’ అని, దక్షిణార్ధ గోళంలో ‘అరోరా ఆస్ట్రాలియస్’ అని పిలుస్తారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
26. ‘ఇగ్లూలు’ అంటే..?
1) మంచుతో కట్టిన ఇళ్లు
2) ఇసుకతో కట్టిన ఇళ్లు
3) రాళ్లతో కట్టిన ఇళ్లు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
27. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన నది ఏది?
1) ఆమూర్
2) సాల్విన్
3) బ్రహ్మపుత్ర
4) యాంగ్ జి
- View Answer
- సమాధానం: 4
28.‘ప్రపంచ పైకప్పు’ అని దేన్ని పిలుస్తారు?
1) పామిర్ పీఠభూమి
2) మంగోలియా పీఠభూమి
3) ఇరాన్ పీఠభూమి
4) దక్కన్ పీఠభూమి
- View Answer
- సమాధానం: 1
29. కింది వాటిలో సహారా ఎడారిలో ఆదిమ జాతులు ఏవి?
1) బిడౌన్లు
2) టారేగులు
3) హటింటోలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. ‘మసాయి’ జాతి ముఖ్య జీవనాధారం?
1) పశుపోషణ
2) కుమ్మరి
3) వేటాడటం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
31. ఆసియాలో అత్యధిక జనాభా ఉన్న నగరం ఏది?
1) న్యూఢిల్లీ
2) సింగపూర్
3) టోక్యో
4) ముంబై
- View Answer
- సమాధానం: 3
32. ‘హిమాలయ రాజ్యం’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) భూటాన్
2) నేపాల్
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 2
33. ‘యురేషియా’ అనే పదానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఆఫ్రికా ద్వీపంతో కలిపి ఆసియా ఖండాన్ని ‘యురేషియా’ అని పిలుస్తారు
2) ఐరోపా ద్వీపకల్పంతో కలిపి ఆసియా ఖండాన్ని ‘యురేషియా’ అని పిలుస్తారు
3) ఆస్ట్రేలియా ద్వీపంతో కలిపి ఆసియా ఖండాన్ని ‘యురేషియా’ అని పిలుస్తారు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
34. ఆసియా ఖండంలో ఎత్తై జలపాతం ఏది?
1) జోగ్
2) టుగేల
3) గావర్ని
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
35. ఆసియా ఖండానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది
2) దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది
3) తూర్పున పసిఫిక్ మహాసముద్రం ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
36. కింది వాటిలో ఆసియా ఖండంలో నివసించే ఆదిమ జాతి ఏది?
1) సకీయ్
2) యాకుట్
3) లాపేలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
37. హిందూ మహసముద్రంలోని ‘అశ్రు బిందువు’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) భారత్
2) శ్రీలంక
3) మయన్మార్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
38. ఆఫ్రికా ఖండానికి సంబంధింది కింది వాటిలో సరైంది ఏది?
1) ఇది ప్రపంచంలో రెండో పెద్ద ఖండం
2) దీని ద్వారా మకర, కర్కట, భూమధ్యరేఖలు వెళ్తున్నాయి
3) ఇది ప్రపంచ భూభాగంలో 20% ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
39. ఆఫ్రికా ఖండానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) తూర్పున హిందూ మహాసముద్రం సరిహద్దుగా ఉంది
2) పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం సరిహద్దుగా ఉంది
3) ఉత్తరాన మధ్యదరా సముద్రం ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
40. కింది వాటిలో ఆఫ్రికా ఖండానికి చెందిన పర్వతం ఏది?
1) అట్లాస్
2) కిలిమంజారో
3) డ్రాకెన్సబర్గ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
41. ఆఫ్రికాలో ఎత్తై శిఖరం ఏది?
1) కిలిమంజారో
2) అట్లాస్
3) మిటుంబా
4) డ్రాకెన్సబర్గ్
- View Answer
- సమాధానం: 1
42. ప్రపంచంలోనే వేరుశనగ, ఫామ్ ఆయిల్ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఏది?
1) సుడాన్
2) నైజీరియా
3) సోమాలియా
4) ఘనా
- View Answer
- సమాధానం: 1
43. ‘చీకటి ఖండం’ అని దేన్ని పిలుస్తారు?
1) దక్షిణ అమెరికా
2) యూరప్
3) ఆఫ్రికా
4) ఉత్తర అమెరికా
- View Answer
- సమాధానం:3
44. ఆఫ్రికా ఖండంలో అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన దేశం ఏది?
1) దక్షిణాఫ్రికా
2) మొరాకో
3) కెన్యా
4) ఘనా
- View Answer
- సమాధానం: 2
45. జతపరచండి.
ప్రధాన పంటలు ఉత్పత్తి చేస్తున్న దేశం
i) తేయాకు a) కెన్యా
ii) కొబ్బరి b) టాంజానియా
iii) పత్తి c) ఈజిప్ట్
iv) ఖర్జూర d) నైజీరియా
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 1
46. సూయజ్ కాలువను ఏ సంవత్సరంలో తవ్వించారు?
1) 1769
2) 1869
3) 1889
4) 1789
- View Answer
- సమాధానం: 2
47. సూయజ్ కాలువ పొడవు సుమారు ఎన్ని కిలోమీటర్లు?
1) 145
2) 193
3) 178
4) 160
- View Answer
- సమాధానం: 2