ఖండాలు - సమాచారం
1. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద హిమనీనదాలైన ‘లాంబార్డ్’, ‘బియార్డ్ మోర్’ ఏ ఖండంలో ఉన్నాయి?
1) ఆసియా
2) అంటార్కిటికా
3) ఉత్తర అమెరికా
4) యూరప్
- View Answer
- సమాధానం: 2
2. అంటార్కిటికా ఖండానికి సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) ఈ ఖండంలో అతి ఎత్తై శిఖరం ‘విన్సన్ మాసిఫ్’
2) ఈ ఖండంలో 98 శాతం ప్రాంతం మంచుతో కప్పి ఉంది
3) ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తుగా ఉన్న ఖండం
4) ఇది ప్రపంచంలోని ఖండాలన్నింటిలో అతి చిన్న ఖండం
- View Answer
- సమాధానం: 4
3. యూరప్ ఖండంలో కెల్లా రెండో పొడవైన నది ఏది?
1) ఓల్గా
2) డాన్యూబ్
3) ఎల్బే
4) పో
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో ‘జర్మనీ’ ద్వారా ప్రవహించని నది ఏది?
1) పో
2) రైన్
3) ఎల్బ్
4) ఓడర్
- View Answer
- సమాధానం: 1
5. ఆస్ట్రేలియా రాజధాని నగరం ‘కాన్బెర్రా’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) క్వీన్స్ లాండ్
2) పశ్చిమ ఆస్ట్రేలియా
3) దక్షిణ ఆస్ట్రేలియా
4) న్యూ సౌత్‌వేల్స్
- View Answer
- సమాధానం: 4
6. కింది వాటిలో దేన్ని ‘నగర ఖండం’గా పేర్కొంటారు?
1) యూరప్
2) ఉత్తర అమెరికా
3) ఆస్ట్రేలియా
4) ఆఫ్రికా
- View Answer
- సమాధానం: 3
7. ఆస్ట్రేలియా, టాస్మానియాను వేరు చేస్తున్న జలసంధి ఏది?
1) కుక్
2) బాస్
3) టోరస్
4) బేరింగ్
- View Answer
- సమాధానం: 3
8. జతపరచండి.
జాబితా - I | జాబితా - II |
ఎ) వేయి సరస్సుల దేశం | i) స్టాక్ హోమ్ |
బి) సప్త పర్వతాల దేశం | ii) స్కాట్లాండ్ |
సి) ఉత్తర ప్రాంతపు వెనీస్ | iii) ఫిన్లాండ్ |
డి) రొట్టెల దేశం | iv) రోమ్ |
ఎ | బి | సి | డి | |
1) | iv | ii | iii | i |
2) | iii | i | iv | ii |
3) | ii | iii | i | iv |
4) | iii | iv | i | ii |
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిలో ఉత్తర అమెరికా ఖండంలోని ‘గ్రేట్ లేక్స్’కు సంబంధించని సరస్సు ఏది?
1) హురాన్
2) సుపీరియర్
3) మీడ్ సరస్సు
4) మిచిగాన్ సరస్సు
- View Answer
- సమాధానం: 3
10. కింది వాటిలో ఏ ఎడారి మేలి రకం నైట్రేట్లకు ప్రసిద్ధి?
1) సహారా
2) థార్
3) కలహారి
4) అటకామా
- View Answer
- సమాధానం: 4
11. ‘మెస్టిజో’ జాతి ప్రజలు ఏ ఖండంలో నివసిస్తున్నారు?
1) అంటార్కిటికా
2) దక్షిణ అమెరికా
3) యూరప్
4) ఉత్తర అమెరికా
- View Answer
- సమాధానం: 2
12. కలహారి ఎడారి ఆఫ్రికా ఖండంలోని ఏ భాగంలో ఉంది?
1) ఆగ్నేయం
2) ఈశాన్యం
3) దక్షిణం
4) నైరుతి
- View Answer
- సమాధానం: 4
13. ఖండాలు - ఎత్తై శిఖరాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఐరోపా - మెకిన్లీ
2) అంటార్కిటికా- విన్సన్ మాసిఫ్
3) ఆఫ్రికా - కిలిమంజారో
4) దక్షిణ అమెరికా - అకాన్ కాగ్వా
- View Answer
- సమాధానం: 1
14.ఫిన్లాండ్, ఎస్తోనియాను వేరుచేస్తున్న సింధుశాఖ ఏది?
1) రిగా సింధుశాఖ
2) ఫిన్లాండ్ సింధుశాఖ
3) బోత్నియా సింధు శాఖ
4) బిస్క్ అఖాతం
- View Answer
- సమాధానం: 2
15. ‘లవంగాల దీవి’ అని దేన్ని పిలుస్తారు?
1) టాంజానియా
2) ట్యునీసియా
3) జాంజిబార్
4) జైరో
- View Answer
- సమాధానం: 3
16. బంగారం గనులకు ప్రసిద్ధి చెందిన ‘జోహన్సబర్గ్’ ఎక్కడ ఉంది?
1) ఆస్ట్రేలియా
2) పశ్చిమ ఆఫ్రికా
3) ఆగ్నేయ ఆసియా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 4
17. అంటార్కిటికా ఖండంలో ఏ రోజున సూర్యోదయం జరుగుతుంది?
1) జూలై 4
2) మార్చి 21
3) డిసెంబర్ 22
4) సెప్టెంబర్ 23
- View Answer
- సమాధానం: 4
18. అంటార్కిటికా ఖండంలో వీచే అతి తీవ్రమైన, దట్టమైన చలి పవనాలను ఏమని పిలుస్తారు?
1) మిస్ట్రల్
2) కెటబాటిక్
3) లూ
4) ఫోన్
- View Answer
- సమాధానం: 2
19. ‘అరోరా ఆస్ట్రాలసిస్’ ఏ ఖండంలో ఏర్పడతాయి?
1) దక్షిణ అమెరికా
2) ఆసియా
3) యూరప్
4) అంటార్కిటికా
- View Answer
- సమాధానం: 4
20. ఎడారులు లేని ఏకైక ఖండం ఏది?
1) యూరప్
2) దక్షిణ అమెరికా
3) ఉత్తర అమెరికా
4) ఆసియా
- View Answer
- సమాధానం: 1
21. కింద పేర్కొన్న ఏయే దేశాలను కలిపి ‘గ్రేట్ బ్రిటన్’ అంటారు?
1) ఇంగ్లండ్, నార్వే, వేల్స్
2) ఇంగ్లండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్
3) ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్
4) వేల్స్, ఇంగ్లండ్, ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 3
ఆసియా ఖండంలోని పర్వతాలు
ఆసియా ఖండంలోని భూ విస్తీర్ణంలో 20 శాతం పర్వతాలు ఉన్నాయి.
ఆసియా ఖండాన్ని ‘పర్వతాలకు పుట్టినిల్లు’గా పేర్కొంటారు.
ఈ ఖండంలోని నేపాల్ దేశాన్ని ‘హిమాలయాల రాజ్యం’ అని పిలుస్తారు.
పర్వతాలు | ప్రదేశం |
హిమాలయాలు | భారతదేశం |
టియాన్షాన్ | చైనా |
హిందూకుష్ | అఫ్గానిస్తాన్ |
కార్డమమ్ | కంబోడియా |
ఆల్టామ్ | రష్యా |
యాబ్లోనోలి | రష్యా |
కున్లున్: పామీర్ పీఠభూమిలో ప్రారంభమై టిబెట్ పీఠభూమి వరకు విస్తరించి ఉన్నాయి.
అరకాన్ యోమ: ఇవి మయన్మార్ నుంచి ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్నాయి.
సులేమాన్: అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్నాయి.
ఎల్బర్జ: ఇరాన్‌కు ఉత్తరాన విస్తరించి ఉన్నాయి.
జాగ్రొస్: ఇరాన్‌కు పశ్చిమాన ఉన్న ముడుత పర్వతాలు.
ఆఫ్రికా ఖండంలోని పర్వతాలు
అట్లాస్ పర్వతాలు: ఆఫ్రికా ఖండానికి వాయవ్య భాగంలో ఉన్న మొరాకో, అల్జీరియా మధ్య విస్తరించి ఉన్నాయి.
డ్రాకెన్స్ బర్గ్ పర్వతాలు: ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికాలో ఉన్న ముడుత పర్వతాలు.
కిలిమంజారో పర్వతాలు: ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉన్న అగ్ని పర్వతం. ఇది ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తై పర్వత శిఖరం.
ఆస్ట్రేలియా ఖండంలోని పర్వతాలు
1. గ్రేట్ డివైడింగ్ రేంజ్: ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఖనిజ సంపదకు ప్రసిద్ధి.
2. డార్లింగ్ పర్వతాలు: పశ్చిమ ఆస్ట్రేలియాలో నైరుతి భాగాన ఉన్న పర్వతాలు. ఇక్కడ ఇనుప ఖనిజ సంపద అపారంగా ఉంది.
3. బ్లూ మౌంటెన్స్: ఆస్ట్రేలియాలోని ‘న్యూ సౌత్‌వేల్స్’లో ఉన్న ముడుత పర్వతాలు.
4. తాస్మన్ పర్వతాలు: న్యూజిలాండ్ దక్షిణ దీవికి ఉత్తర చివరన ఉన్నాయి.
యూరప్ (ఐరోపా) ఖండంలోని పర్వతాలు
కాకసస్ పర్వతాలు: ఆసియా, ఐరోపాను విభజించే ముడుత పర్వతాలు. ఇవి జార్జియా, అజర్ బైజాన్‌లో విస్తరించి ఉన్నాయి.
యూరల్ పర్వతాలు: ఇవి రష్యా భూ భాగంలో ఉన్నాయి. ఇవి యూరప్‌ను ఆసియా నుంచి వేరు చేస్తున్నాయి.
కాంటాబరైల్ పర్వతాలు: ఇవి స్పెయిన్‌లో ఉన్న పురాతన ముడుత పర్వతాలు.
అపనైన్ పర్వతాలు: ఇవి ఇటలీలో ఉన్న ముడుత పర్వతాలు. ఇవి సున్నపురాయికి ప్రసిద్ధి.
డినారిక్ పర్వతాలు: యుగోస్లేవియాలో ఉన్నాయి.
కార్పేతియన్ పర్వతాలు: పోలెండ్, రుమేనియా దేశాల్లో విస్తరించి ఉన్నాయి.
బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు: జర్మనీ దేశంలో ఉన్న ఖండ పర్వతాలు.
వాస్జెస్ పర్వతాలు: ఇవి ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో విస్తరించి ఉన్నాయి.
ఆల్ఫ్స్ పర్వతాలు: ఇవి జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, స్విట్జర్లాండ్‌లో విస్తరించి ఉన్నాయి. యూరప్ ఖండంలో ఎత్తై శిఖరమైన ‘బ్లాంక్ శిఖరం’ ఈ పర్వత శ్రేణిలోనే ఉంది.
పిరెనీస్ పర్వతాలు: ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య సరిహద్దుగా ఉన్నాయి.
కొలెన్ పర్వతాలు: నార్వే, స్వీడన్ సరిహద్దులో ఉన్నాయి.
జురా పర్వతాలు: ఫ్రాన్స్ దేశంలో విస్తరించి ఉన్నాయి.
సియోర్రా నెవడా పర్వతాలు: ఇటలీలో ఉన్నాయి.
వెసూవియస్: ఇటలీలో విస్తరించి ఉన్నాయి.
ఎట్నా పర్వతాలు: సిసిలీ ద్వీపకల్పంలో విస్తరించి ఉన్నాయి.
పెనిన్స్ పర్వతాలు: సెంట్రల్ ఇంగ్లండ్‌లో విస్తరించి ఉన్నాయి.
సెవెన్నెస్ పర్వతాలు: ఫ్రాన్స్ లో విస్తరించి ఉన్నాయి.
పిన్డస్ పర్వతాలు: గ్రీస్ దేశంలో ఉన్న సున్నపురాతి పర్వతాలు.
తారస్ పర్వతాలు: టర్కీకి దక్షిణాన విస్తరించి ఉన్నాయి.
గడ్డిభూమి | ఖండం/ దేశం |
ప్రయరీలు | ఉత్తర అమెరికా |
పంపాలు | దక్షిణ అమెరికా |
వెల్డులు | దక్షిణాఫ్రికా |
స్టెప్పీలు | యురేషియా |
డౌన్స్ | ఆస్ట్రేలియా |
లానోలు | వెనిజులా, గయానా |
కాంపాలు | బ్రెజిల్ (ద.అ.) |
సవన్నాలు | మధ్య ఆఫ్రికా |
గతంలో అడిగిన ప్రశ్నలు
1. రెండు దంతాలు ఉండే సీల్ లాంటి సముద్ర జీవి ‘వాల్స్’ర సహజ నివాస ప్రాంతం ఏది? (Group-I, 2004)
1) అంటార్కిటికా
2) పసిఫిక్ మహాసముద్రం
3) బేరింగ్ సంధి
4) ఆర్కిటిక్ ప్రాంతం
- View Answer
- సమాధానం: 4
2. ఆస్ట్రేలియాలో అత్యంత పొడవైన నది? (Polytechnic Lecturers-2013)
1) రైన్
2) ముర్రే
3) డాన్యూబ్
4) డార్లింగ్
- View Answer
- సమాధానం: 2
3. ‘శాశ్వత నగరం (ఎటర్నల్ సిటీ)’ అని దేన్ని పిలుస్తారు? (Polytechnic Lecturers-2012)
1) చికాగో
2) రోమ్
3) కైరో
4) జెరూసలెం
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో అంతర్జాతీయంగా పొడవైన నది ఏది? (Group-IV, 1985)
1) ఓల్గా
2) రైన్
3) నైలు
4) డాన్యూబ్
- View Answer
- సమాధానం: 3
5. కింద పేర్కొన్న ఏయే ఓడరేవుల మధ్య దూరాన్ని పనామా కాలువ అత్యధికంగా తగ్గించింది? (F.R.O.-2012)
1) లివర్ పూల్, షాంఘై
2) న్యూయార్క్, హోనలులు
3) లివర్ పూల్, సిడ్నీ
4) న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో
- View Answer
- సమాధానం: 4
6. అతి ముఖ్యమైన యురేనియం గనులు ఉండే ప్రదేశం ఏది? (Group-I, 2012)
1) యూరల్స్
2) న్యూమెక్సికో
3) కటంగా
4) మెసాబీ రేంజి
- View Answer
- సమాధానం: 2
7. ప్రపంచంలో అత్యంత పెద్ద నౌకాయాన కాలువ? (Deputy Surveyors-2012)
1) పనామా
2) కీల్
3) సూయజ్
4) సూ కాలువ
- View Answer
- సమాధానం: 1
8. అపలేచియన్ పర్వత శ్రేణి ఎక్కడ ఉంది? (Senior Entomologist-2012)
1) ఉత్తర అమెరికా
2) దక్షిణ అమెరికా
3) ఆస్ట్రేలియా
4) ఆఫ్రికా
- View Answer
- సమాధానం: 1
9. ప్రపంచంలో అత్యంత ఎత్తై నౌకాయాన యోగ్య సరస్సు ఏది? (A.P. Municipal Jr. Accounts Officers-2012)
1) టిటికాకా (సౌత్ అమెరికా)
2) విక్టోరియా (ఆఫ్రికా)
3) మిచిగాన్ (నార్త్ అమెరికా)
4) టోరెన్స్ (ఆస్ట్రేలియా)
- View Answer
- సమాధానం: 4
10. కెనడా తీరంలోని ఏ తీరంలో ప్రపంచంలో అతి ఎత్తై అలలు ఉంటాయి? (A.P. M.Jr.A.O-2012)
1) జేమ్స్ బే
2) ఉంగవా బే
3) ఫండీ బే
4) హడ్సన్ బే
- View Answer
- సమాధానం: 3
11.రోమ్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? (Senior Entomologist-2012)
1) టైబర్
2) ఓల్గా
3) డార్లింగ్
4) స్వాన్
- View Answer
- సమాధానం: 1