భూగోళశాస్త్రం-విశ్వం
1. భూగోళశాస్త్ర పితామహుడు ఎవరు?
- View Answer
- సమాధానం: హెకోటియస్
2. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, సౌర వ్యవస్థ, గ్రహాలు వంటి వాటి మధ్య వ్యాపించిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: విశ్వం
3. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: కాస్మాలజీ
4. ఖగోళ అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: ఆస్ట్రానమీ
5. జ్యోతిష్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
- View Answer
- సమాధానం: ఆస్ట్రాలజీ
6. తొలి విశ్వ సిద్ధాంతం ఏది?
- View Answer
- సమాధానం: భూకేంద్రక సిద్ధాంతం
7. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు?
- View Answer
- సమాధానం: క్లాడియస్ టాలమీ (క్రీ.శ. 140, అలెగ్జాండ్రియా)
8. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
- View Answer
- సమాధానం: నికోలస్ కోపర్నికస్ ( క్రీ.శ. 1543, పోలండ్ దేశం)
9. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని మొదటిసారిగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
- View Answer
- సమాధానం: జోహన్నస్ కెప్లర్
10. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
- View Answer
- సమాధానం: అబ్బె జార్జెస్ లిమేటర్(బెల్జియం)
11. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
- View Answer
- సమాధానం: అబ్బె జార్జెస్ లిమేటర్
12. డోలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
- View Answer
- సమాధానం: అలెన్ శాండెజ్
13. రష్యా దేశపు అంతరిక్ష నావికులను ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: కాస్మోనాట్స్
14. చైనా దేశపు అంతరిక్ష నావికులను ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: టైకోనాట్స్
15. ఆస్ట్రోనాట్స్ అనగా ఎవరు?
- View Answer
- సమాధానం: అమెరికా అంతరిక్ష నావికులు
16.గెలాక్సీ అనగా నేమి?
- View Answer
- సమాధానం: కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘గెలాక్సీ’ లేదా నక్షత్ర మండలం అంటారు.
17. సౌరకుటుంబం ఉన్న గెలాక్సీ పేరు ఏది?
- View Answer
- సమాధానం: పాలపుంత (లేదా) ఆకాశగంగ
18. పాలపుంతకు అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది?
- View Answer
- సమాధానం: ఆండ్రోమెడా
19. విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ ఏది?
- View Answer
- సమాధానం: హైడ్రా
20. హిబ్రూలు పాలపుంతను ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: కాంతి నది
21. పాలపుంతను ఎస్కిమోలు ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: తెల్లని భస్మ రహదారి
22. విశ్వంలో నక్షత్రాలకు జన్మస్థానం ఏది?
- View Answer
- సమాధానం: నిహారిక (లేదా) నెబ్యులా
23. నక్షత్ర మండలంలోని దుమ్ము, ధూళి వాయువుల సమూహాన్ని ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: నిహారిక (లేదా) నెబ్యులా
24. ఒక నక్షత్రం ఏర్పడటానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత?
- View Answer
- సమాధానం: 10 మిలియన్ల డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత
25. నక్షత్రాలలో శక్తి జనించడానికి కారణమైన చర్య ఏది?
- View Answer
- సమాధానం: కేంద్రక సంలీనం (లేదా) అణు సంఘటనం
26. నక్షత్రాలలో గల ప్రధానమైన వాయువు ఏది?
- View Answer
- సమాధానం: హైడ్రోజన్
27. జియోగ్రఫీ అనే పదాన్ని మొట్ట మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు?
- View Answer
- సమాధానం: ఎరిస్టోస్థనిస్
28. భూమి ఆకారం, పరిమాణం, భ్రమణం, కాల మండలాలుగా అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: కార్టోగ్రఫీ
29. గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
- View Answer
- సమాధానం: మౌల్టన్, చాంబర్లిన్
30. ద్వినక్షత్ర పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
- View Answer
- సమాధానం: రస్సెల్, లిటిల్టన్
31. సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?
- View Answer
- సమాధానం: ప్రాక్షిమా సెంచూరి
32. విశ్వంలో అతిపెద్ద కాంతివంతమైన నక్షత్రం ఏది?
- View Answer
- సమాధానం: సిరియాస్(డాగ్స్టార్)
33. మహా విస్ఫోటన సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాన్ని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం
34. కృష్ణ బిలాల మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు?
- View Answer
- సమాధానం: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
35. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగాన్ని 2008, సెప్టెంబర్ 10న ఏ ప్రాంతంలో జరిపారు?
- View Answer
- సమాధానం: స్విట్జర్లాండ్,ఫ్రాన్స్ సరిహద్దులోని బెర్న్ అనే ప్రాంతం
36. పాలపుంతను చైనీయులు ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: ఖగోళన ది
37. పాలపుంతను గ్రీకులు ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: స్వర్గ సౌధానికి మార్గం
38. ఆకాశం నీలంరంగులో కన్పించడానికి కారణం ఏమిటి?
- View Answer
- సమాధానం: కాంతి పరిక్షేపణం
39. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం ఏమిటి?
- View Answer
- సమాధానం: కాంతి విక్షేపణం
40. నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తూ ఉండడానికి కారణం ఏది?
- View Answer
- సమాధానం: కాంతి వక్రీభవనం
41. కాంతి వక్రీభవనం
- View Answer
- సమాధానం: సుమారు 5 బిలియన్ సంవత్సరాలు
42. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత?
- View Answer
- సమాధానం: 8.2 నిమిషాలు
43. సూర్యుడిలో ఎక్కువగా ఉండే జడవాయువు లేదా రెండవ మూలకం ఏది?
- View Answer
- సమాధానం: హీలియం
44. వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది?
- View Answer
- సమాధానం: నైట్రోజన్
45. వాతావరణంలో ఎక్కువగా ఉండే జడవాయువు ఏది?
- View Answer
- సమాధానం: ఆర్గాన్
46. సూర్యుడిలోని మూలకాలన్నింటినీ సూచించే రేఖలను ఏమంటారు?
- View Answer
- సమాధానం:ప్రాన్‌హోపర్ రేఖలు
47. సూర్యుడి ఉపరితలాన్ని ఎన్ని మండలాలుగా విభజించవచ్చు? అవి ఏవి?
- View Answer
- సమాధానం: 3 మండలాలు. అవి
1. కాంతి మండలం (ఫొటో స్ఫియర్)
2. వరుణావరణం (క్రోమో స్ఫియర్)
3. కరోనా
- సమాధానం: 3 మండలాలు. అవి
48. సూర్యుడి ఉపరితంలపై కన్పించే నల్లటి మచ్చలను ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: సూర్యాంకాలు (సన్‌స్పాట్స్)
49. సూర్యాంకాలు ఉండే మండలం ఏది?
- View Answer
- సమాధానం: కాంతి మండలం.
50. సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో కనిపించే మండలం ఏది?
- View Answer
- సమాధానం: వరుణావరణం
51. సూర్య గ్రహణ సమయంలో మాత్రమే కనిపించే మండలం ఏది?
- View Answer
- సమాధానం: కరోనా
52. సూర్యుడిలో కనిపించే ప్రకాశవంతమైన మండలం ఏది?
- View Answer
- సమాధానం: కాంతి మండలం
53. కాంతి మండలంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత?
- View Answer
- సమాధానం: 6000° C
54. వరుణావరణంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత?
- View Answer
- సమాధానం: 32,400° C
55. సూర్యుడిలో అత్యంత వేడిగా ఉండే మండలం ఏది?
- View Answer
- సమాధానం: కరోనా
56. సూర్యుడి లోపల అత్యంత చల్లగా ఉండే ప్రాంతం ఏది?
- View Answer
- సమాధానం: సూర్యాంకాలు
57. సూర్యుడి ఆత్మభ్రమణ కాలం ఎంత?
- View Answer
- సమాధానం: 25 రోజుల 9 గంటల 7 నిమిషాలు
58. సూర్యుడి పరిభ్రమణ కాలం ఎంత?
- View Answer
- సమాధానం: 250 మిలియన్ సంవత్సరాలు
59. ఒక కాస్మిక్ సంవ త్సరం విలువ ఎంత?
- View Answer
- సమాధానం: 250 మిలియన్ సంవత్సరాలు
60. సమానమైన సూర్యకాంతి గల ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
- View Answer
- సమాధానం: ఐసోహిల్స్
61. సూర్యుడిలోని ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించే పరికరం ఏది?
- View Answer
- సమాధానం: పైరో మీటర్
62. సూర్యుడి మధ్యలో (కేంద్రంలో) ఉండే ఉష్ణోగ్రత ఎంత?
- View Answer
- సమాధానం: 1,00,000° C
63. నక్షత్రాల వయస్సును ఏ పరికరంతో కొలుస్తారు?
- View Answer
- సమాధానం: కాస్మోక్రోనో మీటర్
64. కాంతి సెకనుకు 3 లక్షల కి.మీ.ల వేగంతో ఒక సంవత్సర కాలంలో ప్రయాణం చేసిన దూరాన్ని ఏమంటారు?
- View Answer
- సమాధానం: కాంతి సంవత్సరం
65. పాలపుంత ఏ ఆకారంలో ఉంటుంది?
- View Answer
- సమాధానం: అండాకారం (దీర్ఘవృత్తాకారం)
66. 1961, ఏప్రిల్ 21న అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యోమగామి ఎవరు?
- View Answer
- సమాధానం: యూరీ గగారిన్
67. సూర్యునికి, భూమికి మధ్యగల దూరాన్ని ఏమంటారు?
- View Answer
- సమాధానం: ఆస్ట్రనామికల్ యూనిట్
68. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ ఎంత దూరం ఉంటుంది?
- View Answer
- సమాధానం: 49.5 మిలియన్ కి.మీ.లు
69. మన దృష్టికి ఒక ఊహా చిత్రాన్ని ఏర్పరచే నక్షత్రాల గుంపును ఏమంటారు?
- View Answer
- సమాధానం: నక్షత్రరాశి
70. అకస్మాత్తుగా కాంతివంతమయ్యే నక్షత్రాలను ఏమని అంటారు?
- View Answer
- సమాధానం: నవ్యతారలు
71. బ్లాక్ హోల్ అనగా నేమి?
- View Answer
- సమాధానం: అంతరించిపోతున్న నక్షత్రం
72. నక్షత్రంలో అణు సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత పదార్థమంతా కేంద్రం దిశగా ఆకర్షితమై ఏర్పడిన ఖగోళ వస్తువును ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: కృష్ణబిలం
73. సాధారణంగా గెలాక్సీల మధ్య దూరం కొలిచేందుకు ఉపయోగించే యూనిట్ ఏది?
- View Answer
- సమాధానం: పార్సెక్
74. పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం?
- View Answer
- సమాధానం: 3.26 కాంతి సంవత్సరాలు
75. కొన్ని గెలాక్సీల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: క్లస్టర్
76. ఉత్తరార్ధగోళంలో ఏర్పడే రంగుల చారలను ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: అరోరా బొరియాలిస్
77. దక్షిణార్ధగోళంలో ఏర్పడే రంగుల రంగుల చారలను ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం:అరోరా ఆస్ట్రాలిస్
78. తోకచుక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
- View Answer
- సమాధానం: కామ్ డీ భూఫాన్
79.నెబ్యులార్ పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
- View Answer
- సమాధానం: మార్క్యిస్ డీ లాప్లాస్
80. సౌర బాంధవులు అని వేటిని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: తోక చుక్కలు
-
81. షూటింగ్ స్టార్స్ అని వేటిని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: ఉల్కలు
-
82. బాహ్య పొరలను ఆక్రమించుకునే క్రమంలో పేలినట్లుగా కనబడే నక్షత్రాలు ఏవి?
- View Answer
- సమాధానం: తాత్కాలిక నక్షత్రాలు
-
83. విశ్వంలో అత్యధిక సాంద్రత కలిగిన ఖగోళ వస్తువులు ఏవి?
- View Answer
- సమాధానం: బ్లాక్ హోల్స్
-