భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది?
1.కింది వాటిలో విస్తీర్ణపరంగా భారతదేశం కంటే పెద్దదైన దేశం ఏది?
1) బ్రెజిల్
2) దక్షిణాఫ్రికా
3) ఫ్రాన్స్
4) కజికిస్తాన్
- View Answer
- సమాధానం: 1
2. భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది?
1) పాకిస్తాన్
2) నేపాల్
3) బంగ్లాదేశ్
4) చైనా
- View Answer
- సమాధానం: 3
3.భారతదేశంతో అతి తక్కువ పొడవైన సరిహద్దు ఉన్న దేశం ఏది?
1) మయన్మార్
2) నేపాల్
3) భూటాన్
4) అఫ్గానిస్తాన్
- View Answer
- సమాధానం: 4
4. కింది వాటిలో ఏ రాష్ట్రం ద్వారా కర్కటరేఖ వెళ్లదు?
1) రాజస్థాన్
2) ఛత్తీస్‌గఢ్
3) ఒడిశా
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 3
5.కింది వాటిలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?
1) మేఘాలయ
2) త్రిపుర
3) పశ్చిమ బెంగాల్
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 4
6. భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన ‘ఇందిరా పాయింట్’ ఎక్కడ ఉంది?
1) కేరళ
2) లక్షదీవులు
3) గ్రేట్ నికోబార్
4) లిటిల్ నికోబార్
- View Answer
- సమాధానం: 3
7. ‘ర్యాడ్‌క్లిఫ్ రేఖ’ భారత్, కింద పేర్కొన్న ఏ దేశాల మధ్య సరిహద్దు ఒప్పందరేఖగా ఉంది?
1) చైనా
2) బంగ్లాదేశ్
3) పాకిస్తాన్
4) 2, 3
- View Answer
- సమాధానం: 4
8. దేశంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
1) ఢిల్లీ
2) చండీగఢ్
3) లక్షదీవులు
4) అండమాన్ - నికోబార్ దీవులు
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిలో అతి పురాతన భూ అభినితి (Geo syncline) ఏది?
1) సాత్పురా భూ అభినితి
2) తూర్పు కనుమల అభినితి
3) థార్వార్ భూ అభినితి
4) ఢిల్లీ భూ అభినితి
- View Answer
- సమాధానం: 3
10. హిమాలయ పాద ప్రాంతాలను ఏ పేరుతో పిలుస్తారు?
1) హిమాద్రి
2) హిమాచల్
3) శివాలిక్స్
4) ట్రాన్స - హిమాలయాలు
- View Answer
- సమాధానం: 3
11. ‘షెవరాయ్’ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) ఒడిశా
2) కర్ణాటక
3) తమిళనాడు
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
12. కింది వాటిలో తూర్పు, పశ్చిమ కనుమలను కలిపే పర్వతశ్రేణి ఏది?
1) యాలక కొండలు
2) పళని కొండలు
3) అన్నామలై కొండలు
4) నీలగిరి కొండలు
- View Answer
- సమాధానం: 4
13. ‘నీలి పర్వత శిఖరం’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) మణిపూర్
2) త్రిపుర
3) మిజోరాం
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 1
14. ‘కాయల్స్’ అంటే..?
1) కర్ణాటకలోని మైదాన ప్రాంతాలు
2) గుజరాత్‌లోని చిత్తడి నేలలు
3) కేరళలోని పృష్ట జలాలు - లాగూన్లు
4) హిమాద్రిలోని కనుమలు
- View Answer
- సమాధానం: 3
15. లక్షదీవుల్లో దక్షిణ చివర ఉన్న దీవి ఏది?
1) అమినీ
2) వీలర్
3) మినికాయ్
4) కన్ననూర్
- View Answer
- సమాధానం: 3
16. ‘మౌంట్ అబు’ వేసవి విడిది ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాఖండ్
2) మధ్యప్రదేశ్
3) రాజస్థాన్
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 3
17. కింది వాటిలో పూర్వావర్తిత నది కానిది ఏది?
1) సింధూ
2) గంగా
3) బ్రహ్మపుత్ర
4) అరణ్
- View Answer
- సమాధానం: 2
18. కింది వాటిలో బద్దెలతో అల్లిన తడిక రూప (టైలిస్) ప్రతిరూపాన్ని కలిగి ఉన్న నదీ వ్యవస్థ ఏది?
1) హిమాలయ నదీ వ్యవస్థ
2) ద్వీపకల్ప నదీ వ్యవస్థ
3) అంతర్భూభాగ నదీ వ్యవస్థ
4) ఎక్సోటిక్ నదీ వ్యవస్థ
- View Answer
- సమాధానం: 2
19. ‘చంబల్’ కింది వాటిలో దేని ఉపనది?
1) గంగా
2) యమున
3) సింధూ
4) నర్మద
- View Answer
- సమాధానం: 2
20.కింది వాటిలో భారతదేశంలో జన్మించని సింధూ ఉపనది ఏది?
1) బియాస్
2) రావి
3) చీనాబ్
4) సట్లెజ్
- View Answer
- సమాధానం:4
21.కింది వాటిలో ఉత్తర దిశలో ప్రవహించి గంగానదితో కుడివైపు నుంచి కలిసే ఉపనది ఏది?
1) గండక్
2) రామ్‌గంగా
3) సోన్
4) కోసి
- View Answer
- సమాధానం: 3
22. కింది వాటిలో ఒకే భౌగోళిక ప్రాంతంలో జన్మించి ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో ప్రవహించే నదుల జత ఏది?
1) సింధూ - గంగా
2) నర్మద - తపతి
3) తపతి - గోదావరి
4) నర్మద - సోన్
- View Answer
- సమాధానం: 4
23. నదులు - ఉపనదులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) రామ్‌గంగా - గంగా
2) వెన్‌గంగా - గోదావరి
3) పెన్‌గంగా - కావేరి
4) దూద్‌గంగా - కృష్ణ
- View Answer
- సమాధానం:3
24. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది?
1) ఆదిలాబాద్
2) నిజామాబాద్
3) కరీంనగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 2
25. ‘భువన ధార’ జలపాతం ఏ నదిపై ఉంది?
1) తపతి
2) గోదావరి
3) నర్మద
4) కృష్ణ
- View Answer
- సమాధానం: 3
26. ‘ఊలర్’ సరస్సు ద్వారా ప్రవహించే నది?
1) జీలమ్
2) చీనాబ్
3) రావి
4) బియాస్
- View Answer
- సమాధానం: 1
27.‘ఎరుపు నది’ అని దేన్ని పిలుస్తారు?
1) సింధూ
2) గంగా
3) బ్రహ్మపుత్ర
4) మహానది
- View Answer
- సమాధానం: 3
28. కింది వాటిలో ‘రాణ్ ఆఫ్ కచ్’ ప్రాంతంతో కలిసే నది ఏది?
1) మహి
2) లూని
3) సబర్మతి
4) బాణి
- View Answer
- సమాధానం: 2
29.కింది వాటిలో ‘పరస్థానీయ’ నది ఏది?
1) గంగా
2) లూని
3) మహి
4) సింధూ
- View Answer
- సమాధానం: 4
30. కింది వాటిలో అంతర్భూభాగ నది కానిది?
1) తపతి
2) లూని
3) బాణి
4) ఘగ్గర్
- View Answer
- సమాధానం: 1
31. దేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది?
1) మాసిన్రాం
2) చిరపుంజి
3) షిల్లాంగ్
4) దిగ్భాయ్
- View Answer
- సమాధానం: 1