భారతదేశ ఉనికి - నైసర్గిక స్థితి
1. భారతదేశం మధ్యగా కర్కటక రేఖ (231/2° ఉత్తర అక్షాంశం) ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతోంది?
1) 9
2) 3
3) 8
4) 10
- View Answer
- సమాధానం: 3
2. కింది వాటిలో మయన్మార్‌తో భారత దేశంలోని ఏ రాష్ట్రం భూ సరిహద్దును పంచుకోవడం లేదు?
1) అరుణాచల్ ప్రదేశ్
2) నాగాలాండ్
3) మణిపూర్
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 4
3. ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ.). ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
1) హిమాచల్ హిమాలయాలు
2) హిమాద్రి హిమాలయాలు
3) శివాలిక్ కొండలు
4) ఆరావళి పర్వత శ్రేణులు
- View Answer
- సమాధానం: 2
4.ప్రపంచంలో అతి పొడవైన హిమనీనదం సియాచిన్. ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది?
1) లడక్
2) కైలాస్
3) కారకోరం
4) కున్లున్
- View Answer
- సమాధానం: 3
5. భారతదేశంలో ధాల్ సరస్సు ఎక్కడ ఉంది?
1) ఆరావళి పర్వతాలు
2) వింధ్య-సాత్పురా పర్వతాలు
3) నీలగిరి కొండలు
4) హిమాలయ పర్వతాలు
- View Answer
- సమాధానం: 4
6. వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి?
1) శివాలిక్ కొండలు
2) హిమాచల్ హిమాలయాలు
3) హిమాద్రి హిమాలయాలు
4) పర్వత పాద హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
7. ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ లాంటి తృతీ య మహాయుగానికి చెందిన అవక్షేప శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణులు ఏవి?
1) శివాలిక్ కొండలు
2) హిమాచల హిమాలయాలు
3) హిమాద్రి హిమాలయాలు
4) ఆరావళి పర్వతాలు
- View Answer
- సమాధానం: 1
8. తీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి?
1) నేపాల్ హిమాలయాలు
2) అస్సాం హిమాలయాలు
3) కుమాన్ హిమాలయాలు
4) పంజాబ్ హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
9. పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) సట్లేజ్ - కాళి నదుల మధ్య
2) కాళి - తీస్తా నదుల మధ్య
3) తీస్తా - బ్రహ్మపుత్ర నదుల మధ్య
4) సింధూ - సట్లెజ్ నదుల మధ్య
- View Answer
- సమాధానం: 4
10. నందాదేవి శిఖరం ఏ హిమాలయ శ్రేణుల్లో ఉంది?
1) పంజాబ్ హిమాలయాలు
2) కుమాన్ హిమాలయాలు
3) నేపాల్ హిమాలయాలు
4) అస్సాం హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
11. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు, లవణీయ, స్ఫటిక భూ భాగాలను ఏమని పిలుస్తారు?
1) భంగర్
2) టెరాయి
3) కల్లార్
4) ఖాదర్
- View Answer
- సమాధానం: 3
12.శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో విస్తరించిన గులకరాళ్లతో కూడిన సచ్ఛిద్ర మండలాన్ని ఏమంటారు?
1) టెరాయి
2) భంగర్
3) ఖాదర్
4) బాబర్
- View Answer
- సమాధానం: 4
13. ఇటీవల ఏర్పడిన ఒండలి మైదానాన్ని ఏమంటారు?
1) ఖాదర్
2) కల్లార్
3) భంగర్
4) టెరాయి
- View Answer
- సమాధానం: 1
14. మనదేశంలో 82½° తూర్పు రేఖాంశం కింది వాటిలో ఏ పట్టణం ద్వారా పోతుంది?
1) మచిలీపట్నం
2) కాకినాడ
3) చిత్తూరు
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
15. సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశం చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది?
1) 8 నిమిషాలు
2) 4 గంటలు
3) 4 నిమిషాలు
4) 6 నిమిషాలు
- View Answer
- సమాధానం: 3
16. భారతదేశంలో సముద్రతీరం ఉన్న రాష్ట్రాలు ఎన్ని?
1) 3
2) 9
3) 8
4) 7
- View Answer
- సమాధానం: 2
17. మాల్వా పీఠభూమికి వాయవ్యంగా ఉన్న పర్వతాలు ఏవి?
1) ఆరావళి పర్వతాలు
2) వింధ్య పర్వతాలు
3) సాత్పురా పర్వతాలు
4) నీలగిరి కొండలు
- View Answer
- సమాధానం: 1
18.సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు?
1) గర్విల్‌గర్ కొండలు
2) మహాదేవ్ కొండలు
3) రాజ్‌పిప్ల కొండలు
4) మైకాల్ పీఠభూమి
- View Answer
- సమాధానం: 4
19. అజంతా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 2
20. తాల్‌ఘాట్, పాల్ఘాట్ కనుమలు ఏ పర్వతాల్లో ఉన్నాయి?
1) పశ్చిమ కనుమలు
2) తూర్పు కనుమలు
3) ఆరావళి పర్వతాలు
4) హిమాలయ పర్వతాలు
- View Answer
- సమాధానం: 1
21.ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణశాతం ఎంత?
1) 16.7
2) 5.4
3) 2.4
4) 4.7
- View Answer
- సమాధానం: 3
22. భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఏది?
1) గాడ్విన్ ఆస్టిన్ శిఖర ప్రాంతం
2) కిలిక్ధావన్ కనుమ
3) పూర్వాంచల్ పర్వతాలు
4) సహ్యాద్రి పర్వతాలు
- View Answer
- సమాధానం: 2
23. భారతదేశంలో అతి పురాతమైన పర్వతాలు ఏవి?
1) ఆరావళి
2) నీలగిరి
3) హిమాలయ పర్వతాలు
4) మైకాల్ పర్వతాలు
- View Answer
- సమాధానం: 1
24. లూనీ నది హరివాణం ఏ మైదానాల్లో విస్తరించి ఉంది?
1) పంజాబ్-హర్యానా మైదానాలు
2) అసోంలోని బ్రహ్మపుత్ర లోయ
3) రాజస్థాన్ మైదానాలు
4) గంగా మైదానాలు
- View Answer
- సమాధానం: 3
25. శివాలిక్ కొండలను అరుణాచల్ ప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు?
1) అరుణీ కొండలు
2) గారో కొండలు
3) మిస్మి కొండలు
4) మైకాల్ కొండలు
- View Answer
- సమాధానం: 3
-
26. మహదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
1) ఛత్తీస్‌గఢ్
2) కేరళ
3) మధ్యప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
గతంలో అడిగిన ప్రశ్నలు
1) 1.582
2) 1.258
3) 1.852
4) 1.528
- View Answer
- సమాధానం: 3
2. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? (ఎస్సై - 2012)
1) భూటాన్
2) నేపాల్
3) చైనా
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 2
3.కింది వాటిలో మూడు వైపులా అంత ర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రాలేవి? (ఎస్సై - 2011)
1) జమ్మూ-కశ్మీర్, పంజాబ్, హర్యానా
2) జమ్మూ-కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం
3) పంజాబ్, రాజస్థాన్, హర్యానా
4) హర్యానా, పశ్చిమబెంగాల్, గుజరాత్
- View Answer
- సమాధానం: 2
4. భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న ద్వీపం ఏది? (ఎస్సై - 2011)
1) ఎలిఫెంటా
2) నికోబార్
3) రామేశ్వరం
4) సల్సెట్టి
- View Answer
- సమాధానం: 3
5. కింది వాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్ట్రం ఏది? (ఎస్సై - 2011)
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) మహారాష్ర్ట
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
6. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? (ఎస్సై - 2012)
1) ఇంఫాల్
2) కోహిమా
3) షిల్లాంగ్
4) ఐజ్వాల్
- View Answer
- సమాధానం: 2
7. గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి వేటిని వేరు చేస్తున్నాయి? (ఎస్సై - 2010)
1) శ్రీలంక నుంచి ఇండియాను
2) పాకిస్థాన్ నుంచి గుజరాత్‌ను
3) చైనా నుంచి జమ్మూ-కశ్మీర్‌ను
4) పైన పేర్కొన్నవేవీకావు
- View Answer
- సమాధానం: 1
8. శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? (పోలీస్ కానిస్టేబుల్స్ - 2012)
1) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
2) చిత్తూరు
3) కర్నూలు
4) ప్రకాశం
- View Answer
- సమాధానం: 1
9. పాక్ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? (పోలీస్ కానిస్టేబుల్స్ - 2009)
1) శ్రీలంక - భారతదేశం
2) శ్రీలంక-మాల్దీవులు
3) భారతదేశం - మాల్దీవులు
4) భారతదేశం- మొరీషియస్
- View Answer
- సమాధానం: 1
10. ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారత దేశం నుంచి విభజిస్తోంది? (గ్రూప్-2, 2011)
1) చంబల్
2) కృష్ణా
3) గోదావరి
4) నర్మద
- View Answer
- సమాధానం: 4