Skip to main content

బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏయే రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది?


నదుల వివరాలు - క్విక్ రివ్యూ

1. సింధూ
జన్మస్థానం
: మానస సరోవరం వద్ద బొకార్‌చు (టిబెట్ ప్రాంతం)
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : టిబెట్, భారత్, పాకిస్థాన్, భారత్‌లో జమ్మూ-కశ్మీర్
ఉపనదులు : ష్యోకో, గిల్‌గిత్, త్యాజ్, కాబుల్, గర్తాంగ్, షిగార్,జష్కర్, హుంజ్, ద్రాస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్

2. బ్రహ్మపుత్ర :
జన్మస్థానం :మానస సరోవరం వద్ద ఉన్న చెమయంగ్‌డమ్ (టిబెట్ ప్రాంతం)
పవహించే మార్గం/ రాష్ట్రాలు :టిబెట్ (చైనా), భారత్, బంగ్లాదేశ్. భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం
ఉపనదులు : రైడాక్, తీస్థా, అమోచు, బరేలీ, పగ్లాదియా, బేల్‌సిరి,దిబ్రూ, డిక్కూ, ధన్‌సిరి, సబసిరి, సంకోష్, మానస,దిబాంగ్, లోహిత్, సుర్మా, బారక్

3. గంగా
జన్మస్థానం : గంగోత్రి వద్ద జన్మించే భగీరథి,అల్క వద్ద జన్మించే అలకనంద కలయిక వల్ల ఏర్పడుతుంది
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ (సరిహద్దు గుండా), పశ్చిమ బెంగాల్
ఉపనదులు : రామ్‌గంగా, గోమతి, గండక్, కోసి, కాళి, ఘాఘ్రా,యమున, చంబల్, బెట్వా, కెన్, సోన్, దామోదర్,సింధ్, థాన్‌‌స

4. యమున
జన్మస్థానం : ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్
ఉపనదులు : చంబల్, బెట్వా, కెన్, సింధ్

5. దామోదర్
జన్మస్థానం :
చోటానాగ్‌పూర్ పీఠభూమిలోని ‘టోరి’ వద్ద
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : జార్ఖండ్, పశ్చిమ బెంగాల్
ఉపనదులు : బరాకర్, కోణర్, ఘరీ, జమునై

6. గోదావరి
జన్మస్థానం : పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ వద్ద
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ఉపనదులు : ప్రవర, మూల, మానేరు, మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని

7. కృష్ణా
జన్మస్థానం : పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ఉపనదులు : తుంగభద్ర, భీమా, మలప్రభ, ఘటప్రభ, పంచగంగ, దూద్‌గంగా, మూసీ, దిండి, వర్ణ, కోయనా, పాలేరు, మున్నేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు

8. కావేరి
జన్మస్థానం : పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : కర్ణాటక, తమిళనాడు
ఉపనదులు : హేమవతి, భవాని, అమరావతి, ఆర్కావతి, లోకపావని, కబినీ, హేరంగీ, లక్ష్మణతీర్థ, సువర్ణవతి

9. పెన్నా
జన్మస్థానం : కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని నందిదుర్గ కొండల్లో చెన్నకేశవ శిఖరం
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
ఉపనదులు : చిత్రావతి, జయమంగళి, సగిలేరు, చెయ్యేరు, కుందేరు, పాపాఘ్ని

10. మహానది
జన్మస్థానం : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పీఠభూమి (దండకారణ్యం)లోని శిహావా ప్రాంతం
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : ఛత్తీస్‌గఢ్, ఒడిశా
ఉపనదులు : మండ్, లేవ్, ఇబ్, టెల్, జోంక్, ఓంగ్, సియోనాథ్

11. నర్మదా
జన్మస్థానం
: మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ వద్ద
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్
ఉపనదులు : హిరన్, ఓర్సంగ్, తావా, దూది, బార్నెర్, శక్కార్, కుంద, బంజర్, షార్, వరిపాన్

12. తపతి
జన్మస్థానం : మధ్యప్రదేశ్‌లోని ముల్తాయ్ వద్ద
పవహించే మార్గం/ రాష్ట్రాలు : మద్యప్రదేశ్, మహారాష్ట్ర
ఉపనదులు : పూర్ణ, బేతుల్, పాట్కి, గిర్నా, గంజాల్, పలేర్, కాప్రా గుజరాత్, బోరీ

13. సబర్మతి
జన్మస్థానం : ఆరావళి పర్వతాల్లోని మేవాడ్ ప్రాంతం
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : రాజస్థాన్, గుజరాత్
ఉపనదులు : వాకల్, సేది, హత్‌మతి, హరా

14. మహినది
జన్మస్థానం : వింధ్యా పర్వతాల్లోని సర్ధార్‌పూర్‌కు దక్షిణంగా (మధ్యప్రదేశ్)
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్
ఉపనదులు : సోమ్, పనమ్, అనాబ్

15. సోన్
జన్మస్థానం
: మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ పీఠభూమిలో
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మద్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్
ఉపనదులు : మహానందా, రిహాండ్, గోవత్

16. చంబల్
జన్మస్థానం : మధ్యప్రదేశ్‌లోని జనపావో కొండల్లోని ‘మౌ’ అనే ప్రాంతం
ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్
ఉపనదులు : బనాస్, పర్బతి, కాళీసింధ్
Published date : 14 Jul 2018 05:39PM

Photo Stories