వృక్షరాజ్యం - వర్గీకరణ
1. అత్యంత సరళమైన వేరు, కాండం, పత్రాలుగా విభజించని మొక్క దేహాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
1) మాస్
2) ఫెర్‌న
3) కాలస్
4) థాలస్
- View Answer
- సమాధానం: 4
2. కింది వాటిలో హరితయుత, నీటిలో ఉండే స్వయం పోషక థాలోఫైట్ మొక్కలు ఏవి?
1) మాస్ మొక్కలు
2) ఫెర్‌న మొక్కలు
3) శైవలాలు
4) శిలీంధ్రాలు
- View Answer
- సమాధానం: 3
3. కింది వాటిలో హరితరహిత పరపోషక థాలోఫైట్ మొక్కలు ఏవి?
1) శైవలాలు
2) శిలీంధ్రాలు
3) బ్రయోఫైట్లు
4) స్పెర్మటోఫైట్లు
- View Answer
- సమాధానం: 2
4. శిలీంధ్రాల కణకవచంలో ఉండే నత్రజనిని కలిగిన పాలీశాఖరైడ్ ఏది?
1) సెల్యులోజ్
2) హెమీ సెల్యులోజ్
3) పెక్టిన్
4) ఖైటిన్
- View Answer
- సమాధానం: 4
5. కింది వాటిలో శిలీంధ్రాల్లో లేని కణాంగం ఏది?
1) మైటోకాండ్రియా
2) గాల్జీ సంక్లిష్టం
3) రైబోజోమ్‌లు
4) ప్లాస్టిడ్లు
- View Answer
- సమాధానం: 4
6. ‘వీడ్ ఆఫ్ ది లేబొరేటరీ’ అని సాధారణంగా ఏ శిలీంధ్రాన్ని పిలుస్తారు?
1) రైజోపస్
2) అగారికస్
3) మ్యూకర్
4) పెన్సీలియం
- View Answer
- సమాధానం: 1
7. ఉన్నత శ్రేణి మొక్కల వేర్లతో సహజీవనం జరిపి, మృత్తిక నుంచి ఫాస్ఫేట్‌లను శోషించి మొక్కలకు అందించే వేర్లను ఏమంటారు?
1) హైడథోడ్స
2) మైకోరైజా
3) ఊడ వేర్లు
4) శ్వాస వేర్లు
- View Answer
- సమాధానం: 2
8. వృక్ష రాజ్యంలో మొట్టమొదటి ‘నాళికా కణజాలయుత మొక్కలు’ ఏవి?
1) థాలోఫైట్స్
2) టెరిడోఫైట్స్
3) బ్రయోఫైట్స్
4) ఆవృత బీజాలు
- View Answer
- సమాధానం: 2
9. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) శిలీంధ్రాలన్నీ స్వయం పోషకాలు
2) శిలీంధ్రాలన్నీ పరపోషితాలు
3) శిలీంధ్రాలన్నీ పరాన్న జీవులు
4) కొన్ని శిలీంధ్రాల్లో హరితరేణువులు ఉంటాయి
- View Answer
- సమాధానం: 2
10. కింది వాటిలో ఫలాలను ఉత్పత్తి చేయని మొక్కలు ఏవి?
1) ఏకదళ బీజ మొక్కలు
2) ద్విదళ బీజ మొక్కలు
3) ఆవృత బీజాలు
4) వివృత బీజాలు
- View Answer
- సమాధానం: 4
11.నగ్నమైన విత్తనాలు ఉండే మొక్కలు ఏ వర్గానికి చెందుతాయి?
1) ఆవృత బీజాలు
2) క్రిప్టోగామ్‌లు
3) వివృత బీజాలు
4) థాలోపైట్లు
- View Answer
- సమాధానం: 3
12. జీవ సంబంధ ఎరువుగా ఉపయోగించే శైవలాలు ఏ తరగతికి చెందుతాయి?
1) సయనోఫైసీ
2) క్లోరోఫైసీ
3) జాంథోఫైసీ
4) బాసిల్లారియోఫైసీ
- View Answer
- సమాధానం: 1
13. మొక్కల శిలాజాల అధ్యయనాన్ని ఏమంటారు?
1) పైకాలజీ
2) ఆల్గాలజీ
3) పేలియంటాలజీ
4) పేలియోబోటనీ
- View Answer
- సమాధానం: 4
14. వృక్ష రాజ్యంలో ఉభయచర జీవులుగా ఏ మొక్కలను పేర్కొనవచ్చు?
1) థాలోఫైటా మొక్కలు
2) లెకైన్లు
3) బ్రయోఫైటా మొక్కలు
4) టెరిడోఫైటా మొక్కలు
- View Answer
- సమాధానం: 3
15. ఫెర్‌న మొక్కల పత్రాలను ఏమంటారు?
1) థాలస్
2) కాలాయిడ్
3) ఫిల్లాయిడ్
4) ఫ్రాండ్‌లు
- View Answer
- సమాధానం: 4
16. ‘వృక్ష రాజ్యపు పాములు (బొటానికల్ స్నేక్స్)’గా ఏ మొక్కలను పేర్కొంటారు?
1) లెకైన్లు
2) టెరిడోఫైటా మొక్కలు
3) బ్రయోఫైటా మొక్కలు
4) థాలోఫైటా మొక్కలు
- View Answer
- సమాధానం: 2
17. కిణ్వన ప్రక్రియలో ఉపయోగించే ఏకకణ శిలీంధ్రాలేవి?
1) ఈస్ట్
2) క్లోరెల్లా
3) సెనిడెస్మస్
4) బ్యాక్టీరియా
- View Answer
- సమాధానం: 1
18. కింది వాటిలో పరాన్న జీవిగా బతికే శైవలం ఏది?
1) క్లోరెల్లా
2) సెనిడెస్మస్
3) సిఫాల్యురస్
4) స్పైరోగైరా
- View Answer
- సమాధానం: 3
19. నేల మొక్కల ఆవిర్భవానికి మూలంగా భావించే శైవలం ఏది?
1) కారా
2) ప్రిట్చ్యెల్లా
3) వాల్వాక్స్
4) లామినేరియా
- View Answer
- సమాధానం: 2
20. ‘భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు’గా ఎవరిని పేర్కొంటారు?
1) ఎం.ఒ.పి. అయ్యంగార్
2) కె.సి. మెహతా
3) పి. మహేశ్వరి
4) జె.సి. బోస్
- View Answer
- సమాధానం: 1
21. అధిక కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం ఉన్న ఏకకణ శైవలం ఏది?
1) క్లామిడోమోనస్
2) స్పైరులీనా
3) క్లోరెల్లా
4) యూగ్లీనా
- View Answer
- సమాధానం: 3
22. ఆస్ట్రోనాట్స్ (వ్యోమగాములు) ఆహారం, ఆక్సిజన్ కోసం ఉపయోగించే శైవలం ఏది?
1) లామినేరియా
2) వాచీరియా
3) క్లోరెల్లా
4) సెనిడెస్మస్
- View Answer
- సమాధానం: 3
23. పారిశ్రామికంగా అయోడిన్‌ను సంగ్రహించే మొక్క (శైవలం) ఏది?
1) మాక్రోసిస్టస్
2) లామినేరియా
3) సర్గాసం
4) గ్రాసులేరియా
- View Answer
- సమాధానం: 2
24. కణజాల వర్ధనంలో యానకాన్ని జున్ను గడ్డి (అగార్-అగార్)ని ఉపయోగించి అర్ధ ఘనస్థితికి మార్చుతారు. అగార్-అగార్‌ను సంగ్రహించే ఎరుపు శైవలాలు ఏవి?
1) గ్రాసులేరియా
2) గెలీడియం
3) కాండ్రస్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
25.‘వృక్ష ప్రపంచపు ఆభరణాలు (జ్యువెల్స్ ఆఫ్ ది ప్లాంట్ వరల్డ్)’ అని ఏ శైవలాలను పిలుస్తారు?
1) సయనోఫైసీ
2) రోడోఫైసీ
3) డయాటమ్స్
4) లెకైన్లు
- View Answer
- సమాధానం: 3
26.మొదట కనుగొన్న శిలీంధ్రం ఏది?
1) పుట్టగొడుగు
2) రైజోపస్
3) పెన్సీలియం
4) ఈస్ట్
- View Answer
- సమాధానం: 1
27. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ‘పెన్సిలిన్’ అనే సూక్ష్మజీవనాశినిని ఏ శిలీంధ్రం నుంచి సంగ్రహించాడు?
1) పెన్సీలియం నోటేటమ్
2) పెన్సీలియం క్రైసోజీనం
3) పెన్సీలియం ఆల్టుకాన్స
4) పెన్సీలియం
- View Answer
- సమాధానం: 1
28. బడ్డింగ్ (కోరకీభవనం) ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే శిలీంధ్రం ఏది?
1) పెన్సీలియం
2) పక్సీనియా
3) ఈస్ట్
4) ఆల్బుగో
- View Answer
- సమాధానం: 3
29.మొక్కల అనుక్రమంలో ప్రారంభ మొక్కలు అని వేటిని పిలుస్తారు?
1) శైవలాలు
2) శిలీంధ్రాలు
3) లెకైన్లు
4) ఫెర్‌న మొక్కలు
- View Answer
- సమాధానం: 3
30. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
ఎ) పుట్టగొడుగుల విత్తనాలను ‘స్పాన్’ అంటారు
బి) పుట్టగొడుగుల్లో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా.. ప్రోటీన్లు, మినరల్స్, మిటమిన్లు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ రోగులు తినవచ్చు
సి) ‘అమనీటా’ అనేది విషపూరిత పుట్టగొడుగు ప్రజాతి పేరు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
31.‘శిలీంధ్ర పుష్పాలు’గా వేటిని పేర్కొంటారు?
1) పుట్టగొడుగులు
2) టోడ్స్టూల్స్
3) మోల్డ్‌లు
4) పఫ్బాల్స్
- View Answer
- సమాధానం: 1
32. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
ఎ) ఒక శైవలం, శిలీంధ్రం కలిసి ఏర్పర్చిన దేహాన్ని ‘లెకైన్’ అంటారు
బి) లెకైన్లో శైవలం రక్షణ కల్పిస్తుంది, శిలీంధ్రం ఆహారం తయారు చేస్తుంది
సి) లెకైన్లు లిట్మస్ పేపర్ తయారీకి, కాలుష్య సూచికలుగా ఉపయోగపడతాయి
1) ఎ, బి
2) బి మాత్రమే
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
33. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
ఎ) గింకో బైలోబా ఒక సజీవ శిలాజ మొక్క. ఇది ఇండియా హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది
బి) టాక్సస్ అనే వివృత బీజ మొక్క కాండం నుంచి ‘టాక్సాల్’ అనే యాంటీ కేన్సర్ పదార్థం లభిస్తుంది
సి) సైకస్ను ‘సాగోఫామ్’ అంటారు. దీని ఎండు విత్తనాల(చిల్గోజా)ను కాల్చుకొని తింటారు
1) ఎ, బి
2) బి, సి
3) బి మాత్రమే
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
34. జతపరచండి.
జాబితా - I
a) లిథోఫైట్స్
b) హలోఫైట్స్
c) ఆక్సిలోఫైట్స్
d) సామోఫైట్స్
జాబితా - II
i) నీడలో పెరిగే మొక్కలు
ii) ఇసుకలో పెరిగే మొక్కలు
iii) రాళ్లపై పెరిగే మొక్కలు
iv) క్షార/ లవణ మొక్కలు
v) ఆమ్ల మొక్కలు
1) a - i, b - ii, c - iii, d - iv
2) a - iii, b - iv, c - v, d - ii
3) a - v, b - iv, c - iii, d - ii
4) a - iii, b - iv, c - ii, d - v
- View Answer
- సమాధానం: 2
35. జతపరచండి.
జాబితా - I
a) టిష్యూకల్చర్
b) హార్టికల్చర్
c) సెల్వికల్చర్
d) ఒలరీకల్చర్
జాబితా - II
i) పరీక్ష నాళికల్లో కణజాలవర్ధనం
ii) తోటలు, ఉద్యానవన మొక్కల పెంపకం
iii) కలప (అటవీ) మొక్కల పెంపకం
iv) కూరగాయ మొక్కల పెంపకం
v) ద్రాక్ష తోటల పెంపకం
1) a - i, b - ii, c - iii, d - iv
2) a - i, b - ii, c - iv, d - iii
3) a - v, b - ii, c - iii, d - iv
4) a - v, b - iv, c - iii, d - ii
- View Answer
- సమాధానం: 1
36. కింది వాటిలో సరికానిది జత ఏది?
ఎ) పేలినాలజీ - పరాగరేణువుల అధ్యయన శాస్త్రం
బి) మైకాలజీ - శిలీంధ్రాల అధ్యయన శాస్త్రం
సి) పెలియెంటాలజీ - శిలాజాల అధ్యయన శాస్త్రం
డి) డెండ్రోక్రోనాలజీ - వృక్షాల అధ్యయన శాస్త్రం
1) ఎ, బి
2) సి, డి
3) డి మాత్రమే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
37. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) ఫాదర్ ఆఫ్ బోటనీ - థియోఫ్రాస్టస్
బి) ఫాదర్ ఆఫ్ టాక్సానమీ - లిన్నేయస్
సి) ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ - ఎడ్వర్డ్ జెన్నర్
డి) ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ - మెండల్
1) ఎ, బి
2) ఎ, డి
3) బి, సి
4) సి
- View Answer
- సమాధానం: 4
38. ఎర్ర సముద్రం ఎరుపు వర్ణంలో ఉండటానికి కారణమైన శైవలం ఏది?
1) క్లోరెలా
2) ట్రైకోడెస్మియం
3) డిక్టియోటా
4) అసిటాబ్యులేరియా
- View Answer
- సమాధానం: 2
39. గుర్రపు తోక (హార్సటేల్) అని పిలిచే టెరిడోఫైటా మొక్క ఏది?
1) లైకోపోడియం
2) ఈక్విజిటం
3) సెలాజినెల్లా
4) అజొల్లా
- View Answer
- సమాధానం: 2
40. ‘సైకస్’ సాధారణ నామం ఏమిటి?
1) సాగోఫామ్
2) వాకింగ్ ఫెర్‌న
3) వాటర్ ఫెర్‌న
4) సజీవ శిలాజం
- View Answer
- సమాధానం: 1
-
గతంలోఅడిగిన ప్రశ్నలు
1. ఆల్గే ఏ వర్గం కింద వస్తుంది?(Group-II, 2003)
1) థాలోఫైటా
2) బ్రయోఫైటా
3) జిమ్నోస్పెర్మ
4) టెరిడోఫైటా
- View Answer
- సమాధానం: 1
2. లిట్మస్ కాగితం తయారీకి కింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు?(Group-II, Backlog 2000)
1) ఎర్రశైవలం
2) లెకైన్లు
3) ఫెర్‌న మొక్కలు
4) బ్యాక్టీరియా
- View Answer
- సమాధానం: 2
3. యాంటీబయాటిక్ పెన్సిలిన్‌ను దేని నుంచి ఉత్పత్తి చేస్తారు?(AEE's, 2009)
1) ఆల్గే
2) ఫంగస్
3) బ్యాక్టీరియా
4) సింథటిక్ కణాలు
- View Answer
- సమాధానం: 2
4. పెన్సిలిన్‌ను ఎవరు కనుగొన్నారు?(AEE's, 2009)
1) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
2) జె.సి. బోస్
3) లూయిపాశ్చర్
4) ఎడ్వర్డ్ జెన్నర్
- View Answer
- సమాధానం: 1
5. ‘సముద్రపు ఆకుకూర’గా దేన్ని వ్యవహరిస్తారు? (Group-I, 1999)
1) ఆల్వా
2) పాలీసైఫోనియా
3) సర్గాసమ్
4) బాట్రకోస్పెర్మమ్
- View Answer
- సమాధానం: 1
6. అనబీనా, నాస్టాక్ అనే నీలి, ఆకుపచ్చ శైవలాలు ఏ సమూహం కిందకు వస్తాయి?(Assistant Social WelfareOfficer - 2011)
1) ప్రోటిస్టా
2) పియోఫైటా
3) మిక్సోమైకోటా
4) మొనీరా
- View Answer
- సమాధానం: 4
7.ఫలాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?(Assistant Engineers, A.P. Public Health & Municipal Engineering Department -2012)
1) పోమాలజీ
2) పిస్సికల్చర్
3) కాలాలజీ
4) మారికల్చర్
- View Answer
- సమాధానం: 1
8. క్షార భూముల్లో పెరిగే చెట్లను ఏమంటారు? (Technical Assistant, A.P. Archaeology and Museums-2012)
1) హలోఫైట్స్
2) హైడ్రోఫైట్స్
3) మీసోఫైట్స్
4) థాలోఫైట్స్
- View Answer
- సమాధానం: 1