మానవ శుక్రకణంలో లోపించిన కణాంగం?
1. మానవ శుక్రకణంలో లోపించిన కణాంగం?
1) అంతర్జీవ ద్రవ్యజాలం
2) మైటోకాండ్రియా
3) కేంద్రకం
4) సెంట్రియోల్
- View Answer
- సమాధానం: 1
2. జతపరచండి.
జాబితాI జాబితాII
a) పరీక్షా సంకరణం i) 9 : 3 : 1
b) ఏక సంకరణం ii) Tt × tt
c) పూర్వ సంకరణం iii) Tt × TT
d) ద్వి సంకరణం iv) 3 : 1
1) a-ii, b-iv, c-iii, d-i
2) a-ii, b-iv, c-i, d-iii
3) a-iii, b-iv, c-i, d-ii
4) a-i, b-iv, c-ii, d-iii
- View Answer
- సమాధానం: 1
3. రోగికి అవయవ మార్పిడి చేసే సమయంలో ఉపయోగించే సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుంచి సంగ్రహిస్తారు?
1) బ్యాక్టీరియా
2) శిలీంధ్రం
3) వైరస్
4) మొక్కలు
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో ఏ జంతువు ఒకే ఆవరణ వ్యవస్థలో ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమిస్తుంది?
1) బొద్దింక
2) సింహం
3) మేక
4) కప్ప
- View Answer
- సమాధానం: 1
5. కింది వాటిలో కాలుష్య సూచికలు ఏవి?
1) లెకైన్లు, మాస్లు
2) ఖీరోనోమస్ లార్వా
3) డాప్నియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
6. కింది వాటిలో ఏ హార్మోన్ ఉత్పత్తి వల్ల పత్రాలు రాలుతాయి?
1) సైటోకైనిన్
2) ఏబీఏ
3) ఎన్ఏఏ
4) ఆక్సీన్లు
- View Answer
- సమాధానం: 2
7. నిరంతరాయంగా వినైల్ క్లోరైడ్ బహిర్గతమైతే ఏ కాన్సర్ సోకే అవకాశం ఉంది?
1) యోని
2) చర్మం
3) కాలేయం
4) ప్రొస్టేట్ గ్రంథి
- View Answer
- సమాధానం: 3
8. జతపరచండి.
జాబితాI జాబితాII
a) డిఫ్తీరియా i) బాసిల్లస్
b) డిసెంట్రీ ii) విబ్రియో
c) కలరా iii) పాశ్చురెల్లా
d) టైఫాయిడ్ iv) కొర్ని బ్యాక్టీరియం
v) సాల్మోనెల్లా
1) a-iii, b-v, c-i, d-iv
2) a-ii, b-iii, c-iv, d-i
3) a-ii, b-i, c-iv, d-v
4) a-iv, b-i, c-ii, d-v
- View Answer
- సమాధానం: 4
9. జతపరచండి.
జాబితాI
a) ఎడ్వర్డ జెన్నర్
b) లూయి పాశ్చర్
c) ఐవనో విస్కీ
d) డబ్ల్యు.ఎం. స్టాన్లీ
జాబితాII
i) టి.ఎం.వి. వైరస్ను స్పటీకీకరించడం
ii) కంటాజియమ్ వైవమ్ ప్లూయిడమ్
iii) వైరస్లను కనుక్కోవడం
iv) మశూచి టీకా
v) రేబిస్ టీకా
1) a-iv, b-v, c-iii, d-i
2) a-iv, b-v, c-i, d-iii
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-ii, b-iii, c-iv, d-v
- View Answer
- సమాధానం: 1
10. జతపరచండి.
జాబితాI
a) జిబ్బరెల్లిన్లు
b) ఆక్సీన్లు
c) ఇథిలీన్
d) సైటోకైనిన్లు
జాబితాII
i) రిచ్మాండ్ - లాంగ్ ప్రభావం
ii) ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల
iii) బార్లీ విత్తనాల అంకురణ
iv) అగ్రాధిక్యత
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-i, b-iv, c-iii, d-ii
4) a-iv, b-iii, c-ii, d-i
- View Answer
- సమాధానం: 2
11. జతపరచండి.
జాబితా-I
a) లాక్టోజెనిక్ హార్మోన్
b) యాంటీ డై యురిటిక్ హార్మోన్
c) పోరాట పలాయన హార్మోన్
d) బర్త హార్మోన్
జాబితా-II
i) ఆక్సిటోసిన్
ii) ప్రొలాక్టిన్
iii) వాసోప్రెసిన్
iv) అడ్రినలిన్
1) a-ii, b-iii, c-iv, d-i
2) a-i, b-ii, c-iii, d-iv
3) a-ii, b-iii, c-i, d-iv
4) a-ii, b-i, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 1
12.కింది వాటిలో పుష్పంలోని ఏ భాగం అనావశ్యకం?
1) కేసరావళి
2) అండకోశం
3) రక్షక పత్రావళి
4) పరాగకోశం
- View Answer
- సమాధానం: 3
13. ఏ మొక్కలో వేర్లు, కాండం, పత్రాలు రూపాంతరం చెందుతాయి?
1) డ్రాసీనా
2) కలబంద
3) ఆస్పరాగస్
4) వాండ
- View Answer
- సమాధానం: 3
14. ఏ మొక్కలో వేర్లు, కాండం, పత్రాలు రూపాంతరం చెందుతాయి?
1) డ్రాసీనా
2) కలబంద
3) ఆస్పరాగస్
4) వాండ
- View Answer
- సమాధానం: 2
15. అధిక భాష్పోత్సేకం దేని ద్వారా జరుగుతుంది?
1) వాయు రంధ్రాలు
2) పత్ర రంధ్రాలు
3) అవబాసిని
4) బాహ్య చర్మం
- View Answer
- సమాధానం: 2
16. ‘హైడ్రోపోనిక్స్’ ప్రక్రియలో మొక్కలు పెంచి నప్పుడు కింది వాటిలో అవసరం లేనిది ఏది?
1) నేల
2) కాంతి
3) నీరు
4) పోషకాలు
- View Answer
- సమాధానం: 1
17. పత్రహరితంలో ఉండే మూలకం ఏది?
1) ఇనుము
2) సల్ఫర్
3) మెగ్నీషియం
4) కాల్షియం
- View Answer
- సమాధానం:3