మానవ శరీరంలో ఎన్ని ఎముకలుంటాయి?
1. మానవ శరీరంలో ఎన్ని ఎముకలుంటాయి? (ఏఈఈ-2007)
1) 330
2) 280
3) 206
4) 220
- View Answer
- సమాధానం: 3
2. మానవ శరీరంలో అతి కఠిన భాగం?(ఏఎస్వో-2008)
1) గోర్లు
2) ఎముకలు
3) కొమ్ములు
4) ఎనామిల్
- View Answer
- సమాధానం: 4
3. చెవుల్లోని మొత్తం ఎముకల సంఖ్య?(ఏఎస్వో-2008)
1) రెండు
2) నాలుగు
3) ఆరు
4) ఎనిమిది
- View Answer
- సమాధానం: 3
4. దంతక్షయాన్ని అరికట్టడానికి నీటి సరఫరాలో కలిపే రసాయన పదార్థం? (గ్రూప్-2, 2000)
1) క్లోరైడ్
2) ఫ్లోరైడ్
3) బ్రోమైడ్
4) సల్ఫైడ్
- View Answer
- సమాధానం: 2
5. పాలలోని చక్కెర? (జె.ఎల్.-2007)
1) ఫ్రక్టోజ్
2) గ్లూకోజ్
3) సుక్రోజ్
4) లాక్టోజ్
- View Answer
- సమాధానం: 4
6. పాలు అంటే ఏమిటి? (గ్రూప్-1, 2002)
1) కొవ్వు విస్తరించి ఉన్న రక్తం
2) కొవ్వు విస్తరించి ఉన్న నీరు
3) నీరు విస్తరించి ఉన్న కొవ్వు
4) నీరు విస్తరించి ఉన్న చమురు
- View Answer
- సమాధానం: 2
7. పాలలో కొవ్వు శాతం ఏ సమయంలో తగ్గుతుంది? (ఏఈఈ-2009)
1) చలికాలం
2) వేసవికాలం
3) వర్షాకాలం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
8. ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం? (గ్రూప్-2, 2012)
1) జాంతోపిల్
2) మాల్టోజ్
3) రైబోఫ్లావిన్
4) కెరాటిన్
- View Answer
- సమాధానం: 3
9. కండరాలకు వచ్చే కేన్సర్ ఏది? (గ్రూప్-1, 2003)
1) లింపోమా
2) ల్యూకేమియా
3) సార్కోమా
4) అనీమియా
- View Answer
- సమాధానం: 3
10. నేత్రదానంలో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు? (గ్రూప్-1, 2003)
1) కార్నియా
2) లెన్స్
3) రెటీనా
4) పూర్తి కన్ను
- View Answer
- సమాధానం: 1
11. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటే ఏ విటమిన్ లోపిస్తుంది? (డిప్యూటీ ఈవో-2008)
1) A
2) B2
3) D
4) B1
- View Answer
- సమాధానం: 4
12. ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావమవుతుంది?
1) A
2) D
3) K
4) C
- View Answer
- సమాధానం: 4
13. తాడు రక్తం (Cord Blood) అంటే ఏమిటి? (గ్రూప్-2, 2005)
1) కూతుళ్లకు తండ్రి దానం చేసే రక్తం
2) కృత్రిమ రక్తం
3) గుండె కాండ కణాల నుంచి వృద్ధి చేసిన రక్తం
4) మాయ కాండ కణాల నుంచి వృద్ధి చేసిన రక్తం
- View Answer
- సమాధానం: 4
14.హిమోగ్లోబిన్లో ఉండే లోహం? (గ్రూప్-1, 1987-88)
1) మెగ్నీషియం
2) ఇనుము
3) కోబాల్ట్
4) మాంగనీస్
- View Answer
- సమాధానం: 2
15. పేస్‌మేకర్ దేనికి సంబంధించింది?(గ్రూప్-1, 2010)
1) గుండె
2) ఊపిరితిత్తులు
3) కాలేయం
4) కిడ్నీ
- View Answer
- సమాధానం: 1
16. రక్తం ఒక..?(గ్రూప్-1, 2010)
1) ద్రావణం
2) కొల్లాయిడ్
3) తరల పదార్థం
4) జెల్
- View Answer
- సమాధానం: 2
17. శిశువు పితృత్వాన్ని నిర్ధారించేందుకు ఏ పరీక్ష నిర్వహిస్తారు? (సివిల్స్-2010)
1) ఆమ్నియో సెంటాసిస్
2) డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్
3) జన్యు సైక్లింగ్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
18. AB రక్త గ్రూపునకు చెందిన ఒక వ్యక్తిని విశ్వగ్రహీత అని ఎందుకంటారు? (గ్రూప్-1, 2007)
1) ప్రతిరక్షక జనకాలు లేనందువల్ల
2) ప్రతిరక్షకాలు ఉన్నందువల్ల
3) ప్రతిరక్షకాలు లేనందువల్ల
4) ప్రతిరక్షకాలు - ప్రతి రక్షక జనకాలు లేనందువల్ల
- View Answer
- సమాధానం: 3
19.సిరా రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసేది? (గ్రూప్-2, 2008)
1) పుపుస సిరలు
2) పుపుస ధమనులు
3) కుడి జఠరిక
4) మహాధమని
- View Answer
- సమాధానం: 2
20. చాలా కీటకాలు గాలిని సంగ్రహించే పద్ధతి?
1) చర్మం ద్వారా
2) మొప్పల ద్వారా
3) ట్రాకియల్ వ్యవస్థ ద్వారా
4) లంగ్స్ ద్వారా
- View Answer
- సమాధానం: 3
21. బయోగ్యాస్‌లోని ప్రధానాంశం? (గ్రూప్-1, 1987)
1) ఈథేన్
2) మీథేన్
3) బ్యూటేన్
4) ఎసిటలిన్
- View Answer
- సమాధానం: 2
22.ఆక్సిజన్ లేకుండా ఒక జైవిక పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా ఏ వాయువును ఉత్పత్తి చేయొచ్చు? (గ్రూప్-2, 2001)
1) బొగ్గుపులుసు వాయువు
2) నత్రజని
3) SO2
4) మీథేన్
- View Answer
- సమాధానం: 1
23. ఆల్కహాల్‌ను తయారు చేయడానికి ఏది అవసరం?(గ్రూప్-2, 2001)
1) ప్రోటోజోవా
2) శిలీంధ్రాలు - ఈస్ట్
3) బ్యాక్టీరియా
4) వైరస్
- View Answer
- సమాధానం: 2
24. పురుషుడి గొంతు కంటే స్త్రీ గొంతు కీచుగా ఉంటుంది. ఎందుకంటే? (గ్రూప్-2, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్- 2009)
1) అధిక పీడన వ్యాప్తి
2) అల్ప పీడన వ్యాప్తి
3) అధిక కంపన పరిమితి
4) అల్ప కంపన పరిమితి
- View Answer
- సమాధానం: 4
25. సిలికోసిస్ వ్యాధి ఏ అవయవానికి సంక్రమిస్తుంది?
1) మూత్రపిండాలు
2) కాలేయం
3) నరాలు
4) ఊపిరితిత్తులు
- View Answer
- సమాధానం:4
26. మొదటిసారిగా కృత్రిమంగా తయారు చేసిన జీవ సమ్మేళనం? (గ్రూప్-2,2008)
1) మీథేన్
2) బెంజీన్
3) గ్లూకోజ్
4) యూరియా
- View Answer
- సమాధానం: 4
27. సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమయ్యే పదార్థం?(గ్రూప్-2, 2003)
1) పంచదార
2) గ్లూకోజ్
3) క్రియాటిన్
4) ప్రోటీన్
- View Answer
- సమాధానం: 3
28. మానవ కిడ్నీలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది?
1) కాల్షియం ఆక్జలేట్
2) సోడియం ఎసిటేట్
3) మెగ్నీషియం సల్ఫేట్
4) సోడియం సిట్రేట్
- View Answer
- సమాధానం: 1
29. మూత్రపిండాల్లోని ఏ భాగంలో మూత్రం వడపోత అవుతుంది? (డీఎల్-2012)
1) వృక్కం
2) మూత్ర కోశం
3) ప్రసేకం
4) వృక్క సిర
- View Answer
- సమాధానం:1
30. మానవ మూత్రంలోని యూరియా తయారయ్యే భాగం? (గ్రూప్-2, 2000)
1) మూత్రపిండాలు
2) పెద్దపేగు
3) కాలేయం
4) మూత్రాశయం
- View Answer
- సమాధానం: 3
31. కృత్రిమంగా మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయడాన్ని ఏమంటారు? (గ్రూప్-2బి,1984)
1) పనోరిసిస్
2) మానోమీటర్
3) డయాలసిస్
4) డయామెంటేషన్
- View Answer
- సమాధానం: 3
32. చక్కెర వ్యాధిగ్రస్థుని మూత్ర నమూనాలో ఉండేది? (ఏఈఈ-2009)
1) లాక్టోజ్
2) మాల్టోజ్
3) గ్లూకోజ్
4) సుక్రోజ్
- View Answer
- సమాధానం: 3
33. క్లోమం ఒక ..?(గ్రూప్-1, 1999)
1) అంతస్స్రావ గ్రంథి
2) బహిస్స్రావ గ్రంథి
3) అంతస్స్రావ - బహిస్స్రావ గ్రంథి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం:3
34. శరీరంలో తాప నియంత్రణను కలిగి ఉన్న గ్రంథి?(గ్రూప్-1, 2007)
1) పీనియల్ గ్రంథి
2) పిట్యూటరీ గ్రంథి/ హైపోథలమస్
3) థైరాయిడ్
4) అడ్రినలిన్
- View Answer
- సమాధానం: 2
35. మానవ శరీరంలో ‘ఆడమ్స్ ఆపిల్’ అని పిలిచే గ్రంథి? (గ్రూప్-1, 2007)
1) అడ్రినల్ గ్రంథి
2) లివర్/కాలేయం
3) థైరాయిడ్-బాలగ్రంథి
4) థైమస్-బాలగ్రంథి
- View Answer
- సమాధానం: 3
36. తన జాతి జీవులపై ప్రభావం చూపే, జీవి శరీరం నుంచి బాహ్యంగా స్రవించే సమ్మేళనాన్ని ఏమంటారు?(గ్రూప్-1, 1995)
1) సబ్ హార్మోన్
2) న్యూరో హార్మోన్
3) పిరామోన్స్
4) న్యూరో ట్రాన్స్ మీటర్
- View Answer
- సమాధానం: 3
37. పాల పొదుగు నుంచి - చూషణ ద్వారా పాలను స్రవించేందుకు తోడ్పడే హార్మోన్?(సివిల్స్-1989)
1) ప్రోలాక్టిన్
2) ఆక్సిటోసిన్
3) అడ్రినలిన్
4) థైమోసిన్
- View Answer
- సమాధానం: 2
38. రక్తపోటు (బ్లడ్ ప్రెజర్)కు కారణమైన హార్మోన్? (అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్ లేటర్-2010)
1) కాలేయం
2) థైమోసిన్
3) అడ్రినలిన్
4) సెక్రిటిన్
- View Answer
- సమాధానం: 3
39. కణం శక్తి గృహం (కణ శక్తి భాండాగారం) అని పిలిచే కణాంగం?(గ్రూప్-1, 1994, ఎ.ఎం.వి.ఇన్స్పెక్టర్- 2009)
1) క్లోరోప్లాస్ట్
2) మైటోకాండ్రియా
3) గ్రానా
4) ప్రోటోప్లాజమ్
- View Answer
- సమాధానం: 2
40. తుమ్ములు, మింగడం, వాంతులు, వెక్కిల్లు దేని నియంత్రణలో ఉంటాయి? (గ్రూప్-1, 1990)
1) మజ్జాముఖం
2) మస్తిష్కం
3) అనుమస్తిష్కం
4) హైపోథాలమస్
- View Answer
- సమాధానం: 1
41. అనుమస్తిష్కం (సెరిబెల్లమ్) దేనికి సంబంధించింది?(టౌన్ ప్లానింగ్ - 2010)
1) కండరాల కదలిక సమన్వయం
2) గ్రాహకాంగం
3) జ్ఞాపక శక్తి
4) దృష్టి
- View Answer
- సమాధానం: 1
42. జంతు రాజ్యంలో అతిపొడవైన కణం?(గ్రూప్-1, 2010)
1) ఆస్ట్రిచ్ అండం
2) శుక్రకణం
3) నాడీకణం
4) మైకోప్లాస్మా
- View Answer
- సమాధానం:3
43. మెదడును కప్పి ఉంచే లోపలి పొర?(డీఎల్-2012)
1) ఫ్లూరా
2) డ్యురామ్యాటర్
3) పియామ్యాటర్
4) అరాకినాయిడ్ మెంబ్రేన్
- View Answer
- సమాధానం: 3
44. పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? (ఏఈఈ-2006)
1) గుండె
2) కాలేయం
3) మెదడు
4) చర్మం
- View Answer
- సమాధానం: 3
45. శరీరంలో వార్తలను గ్రహించి సమన్వయ పరిచే కేంద్రం?(జె.ఎల్.-2007)
1) గుండె
2) మెదడు
3) మూత్రపిండాలు
4) పీయూషగ్రంథి
- View Answer
- సమాధానం: 2
46. మెదడులో ఏ భాగం జ్ఞాపకశక్తికి మూలం?(జె.ఎల్.-2004)
1) మస్తిష్కం
2) అనుమస్తిష్కం
3) దవ్వ
4) అథోపర్యంకం
- View Answer
- సమాధానం: 1
47.కిందివాటిలో జీర్ణక్రియా ఎంజైమ్ కానిది?(సివిల్స్-2007)
1) ట్రిప్సిన్
2) పెప్సిన్
3) టయలిన్
4) గ్యాస్ట్రిన్
- View Answer
- సమాధానం: 4
48. హెపటైటిస్ వ్యాధి దేనికి సంబంధించింది?(గ్రూప్-2, 2000)
1) కాలేయంలో మంట
2) గుండెలో మంట
3) మూత్రపిండాల్లో మంట
4) పేగులో మంట
- View Answer
- సమాధానం: 1
49. బేరియాట్రిక్ శస్త్ర చికిత్స అంటే ఏమిటి?(గ్రూప్-1, 2004)
1) గుండె బైపాస్ శస్త్ర చికిత్స
2) పొట్ట బైపాస్ శస్త్ర చికిత్స
3) మెదడు సర్జరీ
4) సియామీ కవలలను విడదీసే సర్జరీ
- View Answer
- సమాధానం: 2
50. కోసిన తర్వాత 2-3 వారాల్లోనే తన పూర్వ స్థితిని తిరిగి దాదాపు 85 శాతం వరకు పెంచుకునే సామర్థ్యం ఉన్న మానవ శరీర అవయం ఏది? (గ్రూప్-1, 2004, ఏఈఈ - 2008)
1) మెదడు
2) మూత్రపిండాలు
3) కాలేయం
4) ఊపిరితిత్తులు
- View Answer
- సమాధానం: 3
51. మానవుని సొల్లు (సెలైవా)లో ఉండే ఎంజైమ్? (గ్రూప్-2, 2003)
1) రెనిన్
2) అమైలేజ్
3) లైపేజ్
4) టయలిన్
- View Answer
- సమాధానం: 4
52. ‘రూట్ కెనాల్ థెరపీ’ వేటికి సంబంధించిన చికిత్స? (గ్రూప్-2, 2000)
1) దెబ్బతిన్న పళ్లు
2) దెబ్బతిన్న మూత్రనాళం
3) రక్తనాళాలు
4) గోర్లు
- View Answer
- సమాధానం: 1
53. మానవుడిలో అతిపెద్ద గ్రంథి?(ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్-2012)
1) కాలేయం
2) ఊపిరితిత్తులు
3) ప్లీహం
4) క్లోమం
- View Answer
- సమాధానం: 1
54. మానవ ఉదరంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం?(గ్రూప్-1, 2012)
1) ఎసిటికామ్లం
2) హైడ్రోక్లోరికామ్లం
3) ఫార్మికామ్లం
4) నైట్రికామ్లం
- View Answer
- సమాధానం: 2
55.కిందివాటిలో సరైన వరస క్రమం ఏది?
1) గడ్డి-తోడేలు-జింక-గేదె
2) గడ్డి-కీటకం-పక్షి-పాము
3) బ్యాక్టీరియా-కీటకం-పాము-జింక
4) బ్యాక్టీరియా-గడ్డి-కుందేలు-తోడేలు
- View Answer
- సమాధానం:2
56. అండోత్పత్తి స్థానం నుంచి అండాలు గర్భాశయంలోకి ప్రవేశించడానికి ఏ భాగం సహాయపడుతుంది? (గ్రూప్-1, 2004)
1) సెర్విక్
2) యోని
3) జరాయువు
4) పెల్లోపియన్ నాళాలు
- View Answer
- సమాధానం: 4