‘ద్వినామీకరణం’ను మొదట ప్రతిపాదించింది ఎవరు?
1. ‘ద్వినామీకరణం’ను మొదట ప్రతిపాదించింది ఎవరు?
1) గాస్పర్డ్ బాహిన్
2) కరోలిస్ లిన్నేయస్
3) డికండోల్
4) థియోప్రాస్టస్
- View Answer
- సమాధానం: 1
2. ద్వినామీకరణాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు?
1) గాస్పర్డ్ బాహిన్
2) కరోలిస్ లిన్నేయస్
3) హచిన్సన్
4) తక్తజాన్
- View Answer
- సమాధానం: 2
3. ప్రజాతి, జాతి పేర్లు రెండూ ఒకటే ఉంటే.. వాటిని ఏమని పిలుస్తారు?
1) సిన్టైప్
2) పారాటైప్
3) టాటోనిమ్
4) టోపోటైప్
- View Answer
- సమాధానం: 3
4. కింది వాటిలో టాటోనిమ్స్కు ఉదాహరణ?
1) యాక్సిస్ యాక్సిస్
2) గాలస్ గాలస్
3) నాజా నాజా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
5. మచ్చల జింక టాటోనీమ్?
1) గాలస్ గాలస్
2) గొరిల్లా గొరిల్లా
3) రాటస్ రాటస్
4) యాక్సిస్ యాక్సిస్
- View Answer
- సమాధానం: 4
6. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది?
1) కమలం
2) తామర
3) తంగేడు
4) చామంతి
- View Answer
- సమాధానం: 3
7. జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదట ఎవరు ప్రతిపాదించారు?
1) విల్సన్
2) వాల్టర్ రోసెన్
3) పీటర్స్
4) కార్ల ఎరికే
- View Answer
- సమాధానం: 2
8. ప్రపంచంలోని 34 హాట్‌స్పాట్ (జీవ వైవిధ్య సున్నిత ప్రదేశాలు)లలో భారత్‌లో ఉన్న హాట్‌స్పాట్?
1) తూర్పు హిమాలయాలు
2) పశ్చిమ కనుమలు
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
9. జీవ వైవిధ్యంలో ప్రథమ స్థానంలో బ్రెజిల్ ఉంది. ఈ అంశంలో భారత్ స్థానం ఎంత?
1) 4
2) 6
3) 7
4) 10
- View Answer
- సమాధానం: 3
10. ప్రమాద స్థితిలో ఉండి, అంతరించిపోతున్న జాతుల గురించి పొందుపరిచే పుస్తకాన్ని ఏమంటారు?
1) వైట్ డేటా బుక్
2) గ్రీన్ డేటా బుక్
3) ఎల్లో డేటా బుక్
4) రెడ్ డేటా బుక్
- View Answer
- సమాధానం: 4
11. ‘జీవ వైవిధ్య దినోత్సవం’గా ఎప్పుడు పాటిస్తారు?
1) డిసెంబర్ 1
2) జూన్ 10
3) మే 22
4) సెప్టెంబర్ 30
- View Answer
- సమాధానం: 3
12. జాతీయ జలచర జంతువు (ఆక్వాటిక్ యానిమల్) ఏది?
1) ఆక్టోపస్
2) రివర్ డాల్ఫిన్
3) బ్లూ వేల్
4) టర్టిల్
- View Answer
- సమాధానం: 2
13. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా గుర్తించిన జంతు జాతి పేరు తెలంగాణ క్రాబ్ స్పైడర్. దీన్ని మొదట ఏ జిల్లాలో గుర్తించారు?
1) వరంగల్
2) కరీంనగర్
3) రంగారెడ్డి
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 2
14. ప్రపంచంలో ఆపదలో ఉన్న 100 జంతు జాతుల్లో భారతదేశానికి చెందినవి 4 ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జాతి ఏది?
ఎ. గూటీ టారంటలా సాలీడు
బి. బట్టమేక పక్షి
సి. కంగారు
1) ఎ, బి, సి
2) ఎ, సి
3) ఎ మాత్రమే
4) ఎ, బి
- View Answer
- సమాధానం: 4
15. జీవ సాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు?
1) జాన్ కోల్ రీటర్
2) కార్ల ఎరికే
3) బులాక్
4) వాక్స్మన్
- View Answer
- సమాధానం: 2
16. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక శిలీంధ్రం నుంచి సంశ్లేషణ చేసిన సూక్ష్మజీవ నాశక ఔషధం ఏది?
1) స్ట్రెప్టోమైసిన్
2) ఎరిథ్రోమైసిన్
3) పెన్సిలిన్
4) ఆక్సీటెట్రాసైక్లిన్
- View Answer
- సమాధానం: 3
17. వైరస్ వల్ల వ్యాధిగ్రస్థమైన సకశేరుకాల (అతిథేయి) కణం ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ఏమంటారు?
1) హార్మోన్లు
2) ఎంజైమ్‌లు
3) ఇంటర్పెరాన్స్
4) ఎబిజైమ్లు
- View Answer
- సమాధానం: 3
18. కణజాల వర్ధనం అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు?
1) హప్ మిస్టర్
2) హబర్ లాంట్
3) హన్స్టెయిన్
4) హన్నింగ్
- View Answer
- సమాధానం: 2
19. అర్ధ ఘన యానకాన్ని తయారుచేయడానికి కావలసిన పదార్థం?
1) అగార్-అగార్
2) జిగురు
3) రెజిన్
4) పిండి పదార్థం
- View Answer
- సమాధానం: 1
20. పోషక యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది?
1) ఆల్ట్రాసెంట్రిఫ్యూజ్
2) అటోక్లేవ్
3) ఇనాక్యులేషన్ చాంబర్
4) మైక్రోటోమ్
- View Answer
- సమాధానం: 2
21. కణజాల వర్ధనంలో ఏర్పడిన విభేదనం లేని కణాల సమూహాన్ని ఏమంటారు?
1) కాలోజ్
2) కైమీర స్థితి
3) కాలస్
4) ఎంబ్రియాయిడ్
- View Answer
- సమాధానం: 3
22. సోడియం ఆల్జినేట్తో గుళికలుగా మార్చిన శాఖీయ పిండాలను ఏమంటారు?
1) అనిషేక ఫలాలు
2) సంశ్లేషిత లేదా కృత్రిమ విత్తనాలు
3) సంకర విత్తనాలు
4) ఆనృత ఫలాలు
- View Answer
- సమాధానం: 2
23. కణజాల వర్ధనం ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి?
1) తక్కువ కాలంలో, తక్కువ ప్రదేశంలో మిలియన్లకొద్దీ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు
2) కాండాగ్రవర్ధనం ద్వారా వైరస్ తెగులు సోకని మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు
3) కణజాల వర్ధనం ద్వారా కేవలం స్త్రీ మొక్కలను మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
24.జీవ కీటకనాశినులకు ఉదాహరణ?
1) బాసిల్లస్ థురెంజియెన్సిస్
2) బాసిల్లస్ స్పైరికస్
3) హిర్సుటెల్లా థాంసోసై
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
25. గోల్టెన్ రైస్ సృష్టికర్త ఎవరు?
1) ఇంగోపాట్రికుస్
2) నార్మన్ బోర్లాగ్
3) పాల్ బెర్గ్
4) ఎం.ఎస్. స్వామినాథన్
- View Answer
- సమాధానం: 1
26. జన్యు పరివర్తన మొక్కలకు ఉదాహరణ?
1) బి.టి.వంకాయ
2) బి.టి.పత్తి
3) ఫ్లెవర్ సెవర్ టమాటా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
27. అంతరించిపోతున్న జీవులను పరిరక్షించడంలో భాగంగా సీసీఎంబీ లాల్జీసింగ్ ఆధ్వర్యంలో IVF పద్ధతి ద్వారా సృష్టించిన జీవి?
1) మచ్చల జింక
2) కృష్ణజింక
3) డాలి
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
28. స్కాట్లాండ్ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ ప్రపంచంలో మొదటిసారిగా (1997) క్లోనింగ్ ద్వారా ‘డాలి’ అనే గొర్రెపిల్లను సృష్టించాడు. అతడు ప్రయోగాలు చేసిన సంస్థ?
1) ఎన్డీఆర్ఐ, కర్నాల్
2) సియోల్ నేషనల్ యూనివర్సిటీ
3) రోసెలిన్ ఇన్స్టిట్యూట్
4) UAE
- View Answer
- సమాధానం: 3
29. ‘సరోగేట్ మదర్’ అంటే అర్థమేమిటి?
1) గర్భం ధరించిన స్త్రీ
2) గర్భాశయాన్ని 9 నెలలు అద్దెకిచ్చే స్త్రీ
3) నెలలు నిండిన స్త్రీ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
30. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) పేలియో బోటనీ
2) పేలియో జువాలజీ
3) పేలియంటాలజీ
4) పేలినాలజీ
- View Answer
- సమాధానం: 3
31. పేరమీషియం ఏ ఆకారంలో ఉంటుంది?
1) ఏనుగు చెవి ఆకారం
2) స్తూపాకారం
3) గంట ఆకారం
4) కాలి చెప్పు ఆకారం
- View Answer
- సమాధానం: 4
32. ఈజిప్టులోని పిరమిడ్లను ఫొరామినిఫెరా జీవుల అస్థిపంజరాల (CaCO3)తో నిర్మించారు. ఈజీవులు ఏ వర్గానికి చెందుతాయి?
1) ప్రోటోజోవా
2) ఫొరిఫెరా
3) సీలెంటరేటా
4) అనెలిడా
- View Answer
- సమాధానం: 2
33. అమీబాలో విసర్జక అవయవాలేవి?
1) సంకోచ రిక్తికలు
2) ఆహార రిక్తికలు
3) మొప్పలు
4) ట్రాకియా
- View Answer
- సమాధానం:1
34. స్పంజికల దేహకుడ్యంలో అధికంగా ఉండేవి?
1) జెమ్మాకప్పులు
2) ప్రరోహలు
3) రంధ్రాలు
4) ఆస్కులమ్
- View Answer
- సమాధానం: 3
35. ‘మృతుడి వేలు’ (డెడ్ మ్యాన్స్ ఫింగర్) అని ఏ స్పంజికను పిలుస్తారు?
1) యూప్లెక్టెల్లా
2) యూస్పాంజియా
3) చలైనా
4) క్లయోనా
- View Answer
- సమాధానం:3
36. స్థానబద్ధ జాతికి చెందిన జీవి ఏది?
1) తాచుపాము
2) ఆవు
3) స్పంజికలు
4) గుర్రం
- View Answer
- సమాధానం: 3
37. కణజాల స్థాయికి ఎదిగిన మొట్టమొదటి బహుకణ, ద్విస్తరిత జీవులేవి?
1) ప్రోటోజోవా
2) సీలెంటరేటా
3) ఫొరిఫెరా
4) అనెలిడా
- View Answer
- సమాధానం: 2
38. ఆంథోజోవన్ల ఎండిన బాహ్య అస్థిపంజరాన్ని ఏమంటారు?
1) స్కెల్టన్
2) ఎక్సోస్కెల్టన్
3) ప్రవాళం/కోరల్స్
4) బోన్ న్యూరో
- View Answer
- సమాధానం: 3
39. కింది వాటిలో ఆభరణాల తయారీలో ఉపయోగపడే సముద్ర జీవి?
1) సముద్ర చేప
2) శైవలాలు
3) ప్రవాళాలు
4) జీవకణాలు
- View Answer
- సమాధానం: 3
40. అతి పొడవైన ప్రవాళాలతో ఏర్పడిన గ్రేట్ బారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలోని ఏ సముద్రంలో ఉంది?
1) ఆర్కిటిక్
2) అంటార్కిటిక్
3) హిందూ మహాసముద్రం
4) పసిఫిక్ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 4
41. అనుకూల పరిస్థితుల్లో హైడ్రాలో జరిగే ప్రత్యుత్పత్తి విధానం?
1) ద్విదావిచ్ఛిత్తి
2) బహుధావిచ్ఛిత్తి
3) కోరకీభవనం (బడ్డింగ్)
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
42. పల్టీలు కొట్టే చలనాన్ని చూపే జీవి ఏది?
1) వానపాము
2) కప్ప
3) హైడ్రా
4) చేప
- View Answer
- సమాధానం: 3
43. నిడేరియా వర్గానికి చెందిన అరీలియా సాధారణ నామం?
1) జెల్లి చేప
2) సీఫాన్
3) సీఫెన్
4) మృతుడి వేలు
- View Answer
- సమాధానం: 1
44. బద్దెపురుగు (టీనియా సోలియం)లో విసర్జక క్రియ నిర్వర్తించే అవయవం ఏది?
1) వృక్కాలు
2) కోక్సల్ గ్రంథులు
3) జ్వాళా కణం
4) బోట్రాయిడల్ కణజాలం
- View Answer
- సమాధానం: 3
45. ప్లాటిహెల్మింథిస్ జీవులు సాధారణంగా ఏ రకమైనవి?
1) ఏసీలోమేట్లు
2) సూడో సీలోమేట్లు
3) సీలోమేట్లు
4) హీమోలింఫ్
- View Answer
- సమాధానం: 1
46. ప్లాటీహెల్మింథిస్ జీవులు సాధారణంగా..?
1) గుండ్రటి పురుగులు
2) బల్లపరుపు పురుగులు
3) గుడ్డి పురుగులు
4) నులి పురుగులు
- View Answer
- సమాధానం: 2
47. మచ్చల పందిమాంసం (మీస్లీ పోర్క్) కలిగి ఉండే బద్దెపురుగు డింభక దశ?
1) షట్కంటకి డింభకాలు
2) మైక్రో ఫైలేరియా
3) సిస్టీసర్కస్
4) ఫైలేరిఫార్మ డింభకం
- View Answer
- సమాధానం: 3
48. నులి పురుగులు/ కొంకి పురుగులు ఉండే వర్గం?
1) ప్రోటోజోవా
2) ప్లాటిహెల్మింథిస్
3) నిమాటి హెల్మింథిస్
4) అనెలిడా
- View Answer
- సమాధానం: 3
49. పిన్వార్మ శాస్త్రీయ నామం ఏమిటి?
1) ఎంటరోబియస్ వర్మిక్యులారిస్
2) ఎన్కైలోస్టోమాడుయోడినేల్
3) వుచరేరియా బాన్క్రాప్టే
4) ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్
- View Answer
- సమాధానం: 1
50.మానవుడిలో బోదకాలు వ్యాధి కలుగజేసే మైక్రోఫైలేరియా డింభకాలు ఎక్కడ ఉంటాయి?
1) ప్లీహం
2) శోషరస నాళాలు
3) పరదీయ రక్తనాళాలు
4) 2, 3
- View Answer
- సమాధానం: 4
51. ఆస్కారిస్ మాధ్యమిక అతిథేయి ఏది?
1) ఈగ
2) నత్త
3) నల్లి
4) ఉండదు
- View Answer
- సమాధానం:4
52. వర్మీకంపోస్ట్ అనేది ఒక..?
1) శీతల పానీయం
2) సబ్బు బ్రాండ్ నేమ్
3) వైరస్
4) ఎరువు
- View Answer
- సమాధానం: 4
53. ‘ఫార్మర్స్ ఫ్రెండ్’, ‘ప్రకృతి నాగలి’గా ఏ జీవిని పేర్కొంటారు?
1) జలగ
2) వానపాము
3) బ్యాక్టీరియా
4) బొద్దింక
- View Answer
- సమాధానం: 2
54. వానపాములో సంపర్కం సాధారణంగా ఏ సమయంలో జరుగుతుంది?
1) పగటిపూట
2) రాత్రిపూట
3) వర్షాకాలంలో రాత్రి
4) వేసవి రాత్రి
- View Answer
- సమాధానం: 3
55. వానపాములో చలనానికి తోడ్పడే నిర్మాణాలేవి?
1) స్పర్శకాలు
2) కేసరాలు
3) శైలికలు
4) సీటములు (శూకాలు)
- View Answer
- సమాధానం: 4
56. జలగ అనేది ఒక ..
1) పరాన్నజీవి
2) బాహ్య పరాన్న జీవి
3) స్వాంగివోరస్ బాహ్య పరాన్నజీవి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం:3
57. ఏ జీవిలో బోట్రాయిడల్ కణజాలం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది?
1) వానపాము
2) ఆప్రోడైట్
3) పెలాలో పురుగు
4) జలగ
- View Answer
- సమాధానం: 4
58. కింది వాటిలో ఏ జీవి జీవసందీప్తిని ప్రదర్శిస్తుంది?
1) నీరిస్
2) ఆఫ్రోడైట్
3) వానపాము
4) పెలాలో పురుగు
- View Answer
- సమాధానం: 4