Inter Practical Exams : ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు.. నిబంధనలు తప్పనిసరి..

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి.సుజాత కోరారు. ఈ మెరకు ఏర్పాట్లు కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నిబంధనల పాలన తప్పనిసరి
యలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం, జనవరి 30వ తేదీన జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ లెక్చరర్లకు ఒక రోజు శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా లెక్చరర్లతో మాట్లాడుతూ వారంతా నిబంధనలను సక్రమంగా పాటిస్తూ, కేంద్రాల్లో ప్రకటించిన నియమాల ప్రకారం ఇంటర్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలన్నారు.
AP Intermediate Exams 2025 News: నేటితో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు ముగింపు
పరీక్ష విధానం..
ప్రతిరోజు రెండు సెషన్లలో జరిగే పరీక్షలకు సంబంధించి ఆయా సెషన్ల సమయం ముగిసిన వెంటనే విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి మార్కులను పోస్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు. పరీక్షలు జరిగే అన్ని ల్యాబుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీవరకు జిల్లాలో 88 పరీక్ష కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు జరగనున్నట్టు తెలిపారు. మొత్తం 13,255 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
పరీక్షల తేదీలు..
ముందుగా 5వ తేదీ నుంచి వోకేషనల్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1న నైతికత, మానవీయ విలువలు, ఫిబ్రవరి 3న పర్యావరణ విద్య పరీక్షలు జరుగుతాయని, ఈ రెండు పరీక్షల్లో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలన్నారు.
జనరల్ విద్యార్థులకు ఇంటర్ ప్రయోగ పరీక్షలు పక్కాగా నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను విస్తృతంగా తనిఖీ చేయడానికి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించనున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో యలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, లాలంకోడూరు కళాశాల ప్రిన్సిపాల్ స్వామినాయుడు, ప్రేమ్‌కుమార్, చక్రధర్, భాగ్యమతి, జిల్లాలో వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 300 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- AP Inter Exams
- Inter Practicals
- ap intermediate exams 2025
- public exam preparations
- exam centers
- ap inter students
- first year practical exams
- physics and chemistry practical exams 2025
- inter 2025 exams
- intermediate first year practical exams
- AP Inter Board
- ap inter practical exams updates
- practical exams news
- students education
- practical exams updates
- Education News
- Sakshi Education News
- Education officer instructions
- Intermediate mock exams