Skip to main content

APBIE: ఇంటర్‌ ఫెయిలైనవారికి భరోసా

సాక్షి, అమరావతి: ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్‌ బోర్డు అధికారులను ఆదేశించారు.
APBIE
ఇంటర్‌ ఫెయిలైనవారికి భరోసా

ఈ మేరకు విద్యా శాఖ ఏప్రిల్‌ 28న సర్క్యులర్‌ జారీ చేసింది. ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ శాఖల ఆధీనంలో పనిచేస్తున్న కళాశాలల్లోని విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని మంత్రి బొత్స సూచించారు. మే 1 నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు శిక్షణ ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.  

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

అధికారులకు విద్యా శాఖ సూచనలు..

  • ఇంటర్‌ ఫెయిల్‌ వారి జాబితాను సిద్ధం చేయాలి.గ్రూపులు, సబ్జెక్టుల వారీగా ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి.
  • ప్రిన్సిపాళ్లు, జూనియర్‌ లెక్చరర్లు ఫెయిల్‌ అయిన విద్యార్థులను గుర్తించి.. వారు ఎంపిక చేసుకున్న కళాశాలలో శిక్షణా తరగతులకు హాజరయ్యేలా చూడాలి.
  • విద్యార్థులు ప్రభుత్వ/ఎయిడెడ్‌ లేదా ఇతర ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడైనా డే స్కాలర్‌గా లేదా హాస్టలర్‌గా శిక్షణా తరగతులకు హాజరు కావచ్చు.
  • అన్ని జిల్లా వృత్తి విద్య, ప్రాంతీయ తనిఖీ అధికారులు ప్రత్యేక శిక్షణా తరగతులు, వాటి పనితీరు, విద్యార్థుల హాజరును పర్యవేక్షించాలి.
Published date : 29 Apr 2023 04:11PM

Photo Stories