School Education Department: ఈ పాఠశాలల్లో ఇంటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 162 ఆదర్శ పాఠశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ మే 19న ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పాఠశాలల్లో ఇంటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం
మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 22 నుంచి జూన్ 7వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీలు రూ.150, ఓసీ, బీసీ, ఈడబ్ల్యూసీ విద్యార్థులు రూ.200 నిర్ణీత రుసుం చెల్లించి. apms.apcfss.in, cse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పదో తరగతి మార్కుల మెరిట్ ప్రాతిపదికన, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.