Intermediate practical exams: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి
అనకాపల్లి: సీసీ కెమెరాల నిఘాలో వచ్చే నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి బి.సుజాత తెలిపారు. మంగళవారం స్థానిక మెయిన్‌రోడ్డు జీవీఎంసీ కళాశాల ఆవరణలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జనరల్ విద్యార్థులకు 60, ఒకేషనల్‌కు 45 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
Also Read: Tips To Ace in Practicals
ఈ ఏడాది జిల్లాలో 8,100 జనరల్ విద్యార్థులు, 4,849 మంది ఒకేషనల్ వారు ప్రాక్టికల్‌కు హాజరవుతారన్నారు. ఒకేషనల్‌కు వచ్చే నెల 5 నుంచి, జనరల్ విద్యార్థులకు 11 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షా కమిటీ అధికారులు పి.శిరీషారాణి, పీవీఎన్ మూర్తి, బాలకృష్ణ పాల్గొన్నారు.
Tags
- AP Intermediate Practical Exam Time Table 2024
- Good news for Inter students
- Good news for AP Intermediate students
- AP Intermediate Practical Exam Schedule 2024
- inter public exam time table 2024 details in telugu
- Latest News
- Intermediate Board News
- Intermediate News
- AnakapalliEducation
- IntermediatePracticals
- CCcameras
- EducationDepartment
- Sakshi Education Latest News