Admissions: జూలై 15లోగా ఇంటర్ 2వ దశ అడ్మిషన్లు ముగించాలి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్ రెండో దశ ప్రవేశాలను జూలై 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ జూన్ 23న ఓ ప్రకటనలో తెలిపారు.
జూలై 15లోగా ఇంటర్ 2వ దశ అడ్మిషన్లు ముగించాలి
ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగానే రెండేళ్ల ఇంటర్, ఒకేషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు ముగించాలని.. తదుపరి పొడిగింపు ఉందని స్పష్టం చేశారు.