Intermediate Re-exams: ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్ళీ పరీక్షలు
Sakshi Education
ఇంటర్ విద్యార్థుల్లో ఎవరైతే ఫెయిల్ అయిన వారు ఉంటారో, వారిని గుర్తించి మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి తెలిపారు..
సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి పరీక్షలు రాయడానికి ఫీజు చెల్లించేలా కళాశాలల అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్మీడియట్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖర్‌బాబు సూచించారు. భీమవరంలోని సీఎస్‌ఎన్ కళాశాలలో శనివారం ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
➤ Annual Exams for Tenth Students: విద్యార్థులకు వార్షిక పరీక్షల తయారీ
గడిచిన రెండేళ్లల్లో ఇంటర్ రెండో ఏడాది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి పరీక్ష రాసేలా ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని చంద్రశేఖర్‌బాబు అన్నారు. ఈ సమావేశంలో వివిధ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
Published date : 24 Oct 2023 12:33PM