Skip to main content

AP EAPCET Final Phase Counseling : నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

Guntur Education: AP EAPSET-2023 Updates, APEAPSET2023B-Pharmacy, Pharmacy, Pharmaceutical Engineering Admissions, AP EAPSET-2023 BIPC Stream Admissions, AP EAPSET-2023 BIPC Stream Admissions, AP EAPCET Final Phase Counseling : నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌
AP EAPCET Final Phase Counseling : నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఏపీ ఈఏపీసెట్‌–2023 బైపీసీ స్ట్రీమ్‌ తుది విడత ప్రవేశాల ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. మొదటి విడతలో భర్తీ కాగా మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు తుది విడత వెబ్‌ బేస్డ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. బీ–ఫార్మసీ, ఫార్మాడీ, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి విడతలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులు బుధ, గురువారాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపుతోపాటు ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. విద్యార్థులు ప్రైవేటు ఇంటర్నెట్‌ కేంద్రాలతో పాటు వివిధ ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌, ఆప్షన్ల నమోదు నిర్వహించుకోవచ్చు. 

Also Read :  JEE Success Tips : జేఈఈ మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌ రాసే విద్యార్థుల‌కు నా స‌ల‌హా ఇదే..


కాగా విద్యార్థులు అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను ఎంపిక చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనే పరిశీలన చేయనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 22, 23, 24వ తేదీల్లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్‌ బేస్డ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొని ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈనెల 25న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశాన్ని కల్పించిన ఉన్నత విద్యామండలి 27న సీట్ల కేటాయింపు జరపనుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28, 29, 30వ తేదీల్లో కళాశాలల్లో చేరాల్సి ఉంది. బైపీసీ స్ట్రీమ్‌ తుది విడత కౌన్సెలింగ్‌కు సహాయకంగా గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ ఉన్నత విద్యామండలి సైట్‌లో సమగ్రమైన వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను సందర్శించాలి.

Published date : 22 Nov 2023 03:12PM

Photo Stories