EAPCET: బైపీసీ స్ట్రీమ్‌లో సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఈఏపీసెట్‌కు సంబంధించి బైపీసీ స్ట్రీమ్‌లో నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌లో డిసెంబర్ 19 రాత్రి విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి తెలిపారు.
189 కాలేజీల్లో ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మా డీ విభాగాల్లో 10,456 సీట్లు ఉండగా 10,398 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్‌లో 83,411 మంది అర్హత సాధించగా 15,178 మంది తొలివిడత కౌన్సెలింగ్‌కు రిజిస్టరయ్యారు. వీరిలో 14,658 మంది ఆప్షన్లను నమోదు చేశారు. ఇంకా 58 సీట్లు మిగిలి ఉన్నాయి.
✓ College Predictor 2022 AP EAPCET | TS EAMCET
Published date : 21 Dec 2022 03:14PM