AP SSC Results 2022: పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాలను జూన్ 4న రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ విడుదల చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల సోమవారానికి వాయిదా వేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను www.sakshieducation.com లో చూడవచ్చు.
10వ తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)
ఈ సారి ఈ ప్రకారంగానే..
ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించనున్నారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా ..
ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో గతంలో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించే వారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలతో ఆయా విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా చర్యలు తీసుకోవాలని, వీటివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని పలువురు పాఠశాల విద్యాశాఖకు వినతులు ఇచ్చారు.
Career Guidance: పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..
ఇలా చేస్తే.. ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష జరిమానా..
ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నందున ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఏ రూపంలోను, ఏ స్థాయిలోను ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.
Central Government Jobs: పదితోనే కేంద్ర కొలువు.. పూర్తి వివరాలు ఇలా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
10th Class Study Material, BitBank: పదో తరగతి స్టడీ మెటీరియల్, బిట్ బ్యాంక్ కోసం క్లిక్ చేయండి