టెన్త్ ఇంగ్లిష్ (తెలుగు మీడియం).. మారిన సిలబస్‌పై పట్టు సాధిస్తేనే విజయం
Sakshi Education
పదో తరగతి ఇంగ్లిష్ సబ్జెక్టు సిలబస్ మారినప్పటికీ పరీక్ష విధానం గతంలో మాదిరిగానే ఉంది. స్వల్పంగా మార్పులు ఉన్నాయి. మారిన సిలబస్‌పై విద్యార్థులు పట్టు సాధిస్తేనే ‘ఏ’ గ్రేడ్ సాధించవచ్చు.
పదో తరగతి ఇంగ్లిష్ సబ్జెక్టు సిలబస్ మారినప్పటికీ పరీక్ష విధానం గతంలో మాదిరిగానే ఉంది. స్వల్పంగా మార్పులు ఉన్నాయి. మారిన సిలబస్‌పై విద్యార్థులు పట్టు సాధిస్తేనే ‘ఏ’ గ్రేడ్ సాధించవచ్చు. పాఠ్యపుస్తకంలో యూనిట్లు, ఒక్కో యూనిట్‌లో ఏయే అంశాలున్నాయి? వాటిలో నుంచి సాహిత్యపరంగా ఏం గ్రహించాలి? భాషాపరంగా ఏ సామర్థ్యాలు నేర్చుకోవాలి? వంటి అంశాలను గురించి తెలుసుకుందాం. ఇందులో మొత్తం 8 యూనిట్లున్నాయి.
Discourses – A: story/narrative, conversation, description, drama script/play, interview
Discourses – B: biography, essay, letter, report/news report, speech (script)
- Personality Development: కాళ్లూ చేతులూ లేకుండా పుట్టి ప్రపంచానికి ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని అందిస్తున్న ‘నిక్ వుజికిక్’ యధార్థ గాథ ’’Attitude Is Altitude''. ప్రతి విజయం వైఫల్యాల సమాహారమేనని చాటే శాస్త్రవేత్తల వైఫల్య, విజయగాథల కథనం ’Every Success Story Is also a Story of Great Failures'. దీన్ని 'You Can Win' అనే పుస్తకంలో శివ్‌ఖేరా రాశారు. ఇన్ఫోసిస్ అధినేత ఎన్.ఆర్.నారాయణమూర్తి సక్సెస్ స్టోరీ 'I Will Do It' ని సుధామూర్తి రచించిన 'How I Taught My Grand mother to Read and Other Stories' నుంచి తీసుకున్నారు. ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ఈ యూనిట్ లక్ష్యం.
లాంగ్వేజ్ పరంగా: Positive – Negative Vocabulary, Biography రాసే పద్ధతి, Defining and Non defining Relative Clauses గురించి తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి.
- Wit and Humour: ఆంగ్ల నాటకకర్త W.S. Houghton రచించిన నాటిక 'The Dear Departed' కుటుంబంలో మానవ సంబంధాలు, మమతల కంటే ఆస్తుల్ని పంచుకొంటున్న వైనాన్ని వ్యంగ్యంగా తెలుపుతుంది. 1908 నాటిదైనా 2014కి సమకాలికంగా అనిపిస్తుంది. తెలుగు జానపద కథల్లో అత్యంత ఆదరణ పొందిన ‘సాహస కమ్మరి’, 'The Brave Potter' రూపంలో మార్గరెట్ సీక్ అందించారు. సాహిత్యపరంగా వ్యంగ్యం, హాస్యం ఈ యూనిట్ లక్ష్యం.
భాషాపరంగా Irregular Plurals, Interjections, Compound Adjectives, Idiomatic Expressions, 'enough' usage, articles and their omissions, compound prepositions, 'It's time' expression, డ్రామాని కథగా మార్చి రాయడం, Tableలోని అంశాలను Reportగా ప్రజెంట్ చేయడం ప్రాక్టీస్ చేయాలి.
- Human Relations: అస్సామీ సాహితీవేత్త వై.డి.తోంగ్జీ రచించిన కథ 'The Journey' డీపీ.నాథ్ ఆంగ్లానువాదం తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ కోసం పడే తపనను తెలుపుతుంది. పాకిస్థానీ రచయిత్రి ‘ఇంతియాజ్ ధర్కర్’ కవిత 'Another Woman' సమాజం, కుటుంబ సభ్యులు స్త్రీలను బానిసలుగా చూస్తున్న వైఖరిని ప్రతిబింబిస్తుంది. సెడ్రిక్ మౌంట్ రచించిన నాటిక 'The Never-Never Nest' స్థాయిని మరిచి వాయిదాల పద్ధతిలో విలాసాలు కోరుకునే మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రశ్నిస్తుంది. సాహిత్యపరంగా సున్నితమైన మానవ సంబంధాలు ఈ యూనిట్ లక్ష్యం.
భాషాపరంగా Compound words, Reduplicative words, Usage of Past Perfect Tense, Writing Essay on given hints, Summarisation, Debatingలను ప్రాక్టీస్ చేయాలి.
- Films and Theatre: భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలిపిన సత్యజిత్‌రే గురించి 'Rendezvous with Ray', తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో కలికితురాయి ‘మాయాబజార్’, మహానటి సావిత్రి గురించి 'A Tribute' విద్యార్థులను సినీ ప్రపంచంలోకి తీసుకువెళతాయి. సాహిత్యపరంగా ‘సినిమా’ అనే సృజనాత్మక కళాప్రక్రియను పరిచయం చేయడం, కళాత్మకతను పెంపొందించడం ఈ యూనిట్ లక్ష్యం.
భాషాపరంగా One word Substitutes, ఇంగ్లిష్‌లోని పరభాషా పదాలు, వాటి Roots, Prefixes and Suffixes, హింట్స్‌ని లింకర్‌స సాయంతో ఒక క్రమపద్ధతిలో పేరాగ్రాఫ్‌లుగా మార్చి రాయడం, Prepositions Followed by Adjectives and verbs, Past Perfect Tense, Simple Past Tense, Idiomsని ఉపయోగించి Paragraphని మరింత ఎఫెక్టివ్‌గా రాయడం, Binomials, Modal Auxiliaries, Review letter writing, discussion on gathered informationలను ప్రాక్టీస్ చేయాలి.
- Social Issues: దళిత్ పాంథర్ ఉద్యమంలో భాగంగా ‘వామన్ గోవింద్ హోవల్’ మరాఠీలో రచించిన కథ 'The Storyed House'. అగ్రకుల పెత్తందారీతనాన్ని నిరసిస్తూ అట్టడుగు కులాలకు ఆత్మగౌరవాన్ని నూరిపోస్తుంది. చెత్తకుప్పలో వదిలివేసిన ఓ పసిపాప ఆక్రందనే 'Abonded' కవిత. ఇది చదివేటప్పటికంటే చదవడం పూర్తయ్యాక మనసు ఆవేదనతో నిండి ఆలోచింపచేయడం కవి ‘సూరయ నసీం’ ప్రత్యేకత. సాహిత్యపరంగా సామాజికసృ్పహ కలిగించడం ఈ యూనిట్ లక్ష్యం.
భాషాపరంగా Compound Adjectives, Phrasal Verbs, Idioms, Adverbial clauses, News Reporting, Note making, Speech Preparationలు నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి.
- Bio-Diversity: మొక్కల్ని నాటుతూ ఆఫ్రికాలో గ్రీన్ బెల్ట్ మూవ్‌మెంట్‌ను చేపట్టిన నోబెల్ గ్రహీత ‘వంగరి మథాయి’ రేడియో ఇంటర్వ్యూ 'Environment'. మానవాళి చర్యలతో అంతరిస్తున్న వివిధ వృక్ష, జంతు జాతుల గురించి మానవులను ఇప్పటికైనా మేల్కొంటారా? అంటూ ‘మెడోరా షెవాలియర్’ రాసిన వచన కవితే 'Or will The Dreamer Wake?'. ఆధునిక పారిశ్రామికీకరణ మిగిల్చిన చేదును మింగుతున్న మూడు గ్రామాల బాధే 'A Tale of Three Villages'. జీవ వైవిధ్యాన్ని కాపాడటం, పర్యావరణ పరిరక్షణ స్పృహ కలిగించడం ఈ యూనిట్ లక్ష్యం.
భాషాపరంగా Personality Traits, One word Substitutes, Non-finite clauses, Reported Speech, Adjective phrases, Quantifiers, Dialogue writingలను ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి.
- Nation and Diversity: మాజీ రాష్ర్ట పతి అబ్దుల్ కలాం స్వీయ చరిత్ర 'Wings of Fire' నుంచి తీసుకున్న భాగమే 'My Childhood'. ఇది మత సామరస్యాన్ని చాటుతుంది. భారతదేశ ఏకతను చాటుతూ, మేము కులమత కలహాలకు దూరమని చెప్పే దేశభక్తి కవిత.. 'A Plea fo India'. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపే వ్యాసం 'Unity in Diversity in India'. దేశభక్తిని రగిలించడమే ఈ యూనిట్ లక్ష్యం.
భాషాపరంగా Linkers, Passive Voice without agent, Editing paragraph (in the areas like punctuation, spellings, tense, prepositions, articles), Diary Writing, Personal letter writing, Graph reading and writing comments, Data collection and interpretationలను ప్రాక్టీస్ చేయాలి.
- Human Rights: తెలుపు - నలుపు అనే జాతిభేదాలు వద్దని, అందరూ సమానమనే అర్థాన్ని రెండు జాతుల నుంచి ఏర్పడ్డ కుటుంబం నుంచి వచ్చిన ‘ఎ.ఎల్.హెండ్రిక్’ 'Jamaican Fragment'గా రాశారు. మానవుల్లో నశిస్తున్న సహజత్వాన్ని, పెరుగుతున్న కృత్రిమ ప్రవర్తనను నిరసిస్తూ ఆఫ్రికన్ కవి ‘గాబ్రియేల్ ఒకారా’ రాసిన కవితే 'Once Upon a Time'. కుటుంబ బాధ్యతల్లో మునిగి తనకంటూ అస్తిత్వం లేకుండా పోతున్న స్త్రీల ఆత్మాభిమానంపై రచించిన కథే 'What is My Name?'. తెలుగు రచయిత్రి సత్యవతి ‘ఇల్లలకగానే పండగౌనా?’ అనే కథా సంపుటిలోనిదీ కథ. మనుషులంతా ఒక్కటే, అందరూ సమానమేనని చాటడం ఈ యూనిట్ లక్ష్యం.భాషాపరంగా Similes & Metaphors in writing passage, Prefixes-Suffixes of Roots, Simple Past Tense, Present Perfect Tense, Punctuation (Hyphen, dash & commas), Writing Essay depend on given hints, Writing a Report depend on Tabular data, Speech Preparation, Telugu to English and English to Telugu Transalation నేర్చుకోవాలి.
ప్రతి యూనిట్‌ని ప్రిపేరైతే మంచి గ్రేడ్‌తోపాటు భాషపై పట్టు లభిస్తుంది. కథ, కవిత, నాటకం, వ్యాసం, ఇంటర్వ్యూ, నివేదిక, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర వంటి అనేక కోణాల నుంచి సమగ్రంగా తయారు చేసిన పాఠ్యపుస్తకమిది. అర్థం చేసుకుంటూ ప్రిపేరైతే చాలు.
- పార్ట్-ఎ: ఈ భాగం 20 మార్కులకు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నాలుగు రకాల ప్రశ్నలుంటాయి.
- ప్రశ్న - 1-10: టెక్ట్స్‌బుక్‌లోని 8 యూనిట్లలోని ఎ, బీ రీడింగ్ విభాగాల నుంచి ఈ ప్రశ్నలిస్తారు. పదింటిలో ఏవైనా ఐదింటికి జవాబులివ్వాలి. ఒక్కోదానికి 2 మార్కులు. టెక్ట్స్‌బుక్‌లో ఇచ్చిన ప్రశ్నలు తప్పనిసరిగా చదవాలి. (5 × 2 = 10)
- 11, 12, 13 ప్రశ్నలు రీడింగ్ కాంప్రహెన్షన్‌కు చెందినవి. ప్యాసేజ్ లేదా పోయం ఇచ్చి వాటిపై కొన్ని ప్రశ్నలడుగుతారు. ఒకటి లేదా రెండు వాక్యాల్లో సమాధానాలు రాస్తే చాలు.
- ప్రశ్న- 11: టెక్ట్స్‌బుక్‌లోని పోయంల నుంచి ఇస్తారు. (5 × 1 = 5)
- ప్రశ్న - 12: టెక్ట్స్‌బుక్‌లోని రీడింగ్-ఎ విభాగం నుంచి ఇస్తారు. (3 × 1 = 3)
- ప్రశ్న-13: టెక్ట్స్‌బుక్‌లోని రీడింగ్-బి విభాగం నుంచి ఇస్తారు. (2 × 1 = 2)
- పార్ట్-బి: ఈ విభాగం 30 మార్కులకు ఉంటుంది. ఇది పూర్తిగా గ్రామర్, ఫంక్షనల్ ఇంగ్లిష్‌కు సంబంధించింది. మొత్తం 21 ప్రశ్నల్లో నాలుగు 1 మార్కు ప్రశ్నలు. మిగిలినవన్నీ అర మార్కు ప్రశ్నలే. ఇందులో Parts of speech, matching structures, grammar points from the Reader, prepositions, synonyms, antonyms, morphology, classification of words, spelling, pronunciation, alphabetical order, functional English (Request, advice, command, wishes, predictions, etc.) అంశాలపై ఒక్కో దాని నుంచి 2-4 ప్రశ్నలుంటాయి.
- పేపర్-1లో పాఠాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే పార్‌ట-ఎలో 20 మార్కులు స్కోర్ చేయవచ్చు. అలాగే చదివేటప్పుడు ఆ లెసన్‌లో పదాలకు meanings, synonyms, antonyms, spellings, ఏ parts of speech కిందకు వస్తుంది? గ్రామర్‌పరంగా ఈ వాక్యం ఎలా ఉంది? ఇదే వాక్యాన్ని మరోలా రాయవచ్చా? రాస్తే ఎలా? ఎన్ని రకాలుగా రాయవచ్చు? ఇంతకీ ఈ లెసన్‌లో ఫంక్షనల్ ఇంగ్లిష్‌కు సంబంధించిన వాక్యాలు ఏమున్నాయి? అని ప్రశ్నించుకుంటూ వెతికి, వాటిని పదే పదే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీసే ఇంగ్లిష్‌లో మార్కుల్ని తెచ్చి పెడుతుంది.
- పార్ట్-ఎ: ఇది 30 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు రకాల ప్రశ్నలుంటాయి. మొదటి రెండు టెక్ట్స్‌బుక్ నుంచి వస్తే తర్వాత రెండు క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్‌సకు సంబంధించినవి.
- ప్రశ్న - 1-10: టెక్ట్స్‌బుక్‌లో 8 యూనిట్లలో రీడింగ్ ‘సి’ విభాగం నుంచి పది ప్రశ్నలిస్తారు. ఏవైనా ఐదింటికి జవాబులివ్వాలి.ఒక్కోదానికి 1 మార్కు(5×1= 5)
- ప్రశ్న-11: రీడింగ్-సిలో నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి దానిపై ఐదు ప్రశ్నలడుగుతారు. (5 × 1 = 5)
- ప్రశ్న-12:స్టోరీ/సంఘటన ఇస్తారు. దానికి సంబంధించి రెండు డిస్కోర్సెస్ అడుగుతారు. అందులో ఒకటి రాయాలి. ఇంటర్నల్ చాయిస్ ఉంది. (1×10 = 10)
- ప్రశ్న-13:సంఘటన/సందర్భం/నివేదిక ఇస్తారు. దానిపై రెండు డిస్కోర్సెస్ అడుగుతారు. ఒకదానికి సమాధానం రాయాలి. (1 × 10 = 10)
Discourses – A: story/narrative, conversation, description, drama script/play, interview
Discourses – B: biography, essay, letter, report/news report, speech (script)
- ప్రతి యూనిట్‌లో ఇచ్చిన క్రియేటివ్ రైటింగ్ ఎక్సర్‌సైజ్‌లు, ప్రాజెక్ట్ వర్‌కలు ప్రాక్టీస్ చేస్తే చక్కటి మార్కులు పొందవచ్చు.
- పార్ట్-బి: ఇది 20 మార్కులకు ఉంటుంది. ఇది పూర్తిగా అన్‌సీన్ ప్యాసేజెస్‌తోనే నిండి ఉంటుంది. అంటే టెక్ట్స్‌బుక్ లెసన్‌సకు సంబంధం లేనిది. ఏ విషయాన్నైనా ఇంగ్లిష్‌లో స్వయంగా చదివి అర్థం చేసుకోగలుగుతున్నారా? లేదా? అనే విషయాన్ని పరీక్షించే భాగమిది. ముఖ్యంగా మూడు భిన్నమైన ప్రశ్నలున్నాయి ఇందులో.
- ప్రశ్న-14: (Data Interpretation): ఒక Data Table ఇస్తారు. అందులోని సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. (5 × 1 = 5)
- ప్రశ్న-15: ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు. దానిపై 4 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. (4 × 1 = 4). అలాగే ఆరు వాక్యాలిస్తారు. పై ప్యాసేజ్‌లో పేర్కొన్న అంశానికి సరిపోయే 3 సరైన వాక్యాల్ని గుర్తించాలి. (3 × 1 = 3)
- ప్రశ్న-16: ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చి దానిపై వివిధ రకాల ప్రశ్నలిస్తారు.
- ఎ - కాంప్రహెన్షన్ క్వశ్చన్‌స 2 × 1 = 2
- బి - పదాలు వాటి అర్థాలు జతచేయడం 4 × 1/2 = 2
- సి - Word/Phraseలతో వాక్యాన్ని పూర్తి చేయడం 2 × 1/2 = 1
- డి -ప్యాసేజ్‌లోని విషయంపై ప్రత్యేకించి రెండు విషయాలను రాయమంటారు. 2 × 1 = 2
- ఇ - Word / Phraseలో సమాధానాలు రాసే రెండు ప్రశ్నలు 2 × 1/2 = 1
ఈ విభాగంలో మార్కులు సాధించాలంటే టెక్ట్స్‌బుక్‌లో లేని ఒక ప్యాసేజ్‌ని ఎంపిక చేసుకొని దానిపై స్వంతంగా ప్రశ్నలు తయారు చేసుకోవాలి. who, what, when, why, where, which, how, how many, how much వంటి విషయాలపై దృష్టి పెడితే ప్రశ్నలు తయారు చేయడం సులువవుతుంది. అన్‌సీన్ ప్యాసేజెస్‌కి ప్రశ్నలు తయారు చేయగలిగితే సమాధానాలు అవే వస్తాయి.
Published date : 03 Jan 2015 05:34PM