సైన్స్ పరీక్షకు రెండు బుక్‌లెట్‌లు
Sakshi Education
పార్వతీపురం: పదోతరగతి విద్యార్థులకు ఏప్రిల్ 13న జగరనున్న సైన్స్ పరీక్షకు రెండు బుక్‌లెట్‌లను అందిస్తామని డీఈఓ ఎస్‌డీవీ రమణ ఏప్రిల్ 10న ఒక ప్రకటనలో తెలిపారు.
భౌతిక శాస్త్రానికి 12 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ను, జీవశాస్త్రానికి మరో 12 పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌ను విడివిడిగా అందిస్తామని తెలిపా రు. ఈ రెండు ఆన్సర్ బుక్‌లెట్‌లకు ఓఎంఆర్ లు వేరువేరుగా జతపరచాలన్నారు. విద్యార్థు లు భౌతిక శాస్త్రానికి సంబంధించిన సమాధానాలు భౌతిక శాస్త్రం బుక్‌లెట్‌లోను, జీవశాస్త్రానికి సంబంధించి సమాధానాలను జీవశాస్త్రం ఆన్సర్ బుక్‌లెట్‌లో రాసేలా విద్యార్థులకు ఇన్విజిలేటర్లు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు అయోమయానికి గురికాకుండా ఇన్విజిలేటర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
Published date : 11 Apr 2023 05:12PM