Tenth Students: విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి
చింతూరు: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని కష్టపడి విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత విజయాలు సాధించవచ్చని చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు.
Education News: విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలోచన.. జెడ్పీ హైస్కూల్లో వలంటీర్ వ్యవస్థ
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ కష్టపడి చదివి త్వరలో జరిగే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాక్షించారు. పై తరగతుల్లో మరింత మంచి మార్కులు సాధించే దిశగా ప్రయత్నించాలని, తమ తోటి వారికి కూడా మంచి విద్య అందించేందుకు తోడ్పాటు అందించాలన్నారు. త్వరలో జరగనున్న పరీక్షల్లో వందశాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
RFCL Recruitment 2024: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 27 ప్రొఫెషనల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ప్రీ ఫైనల్ పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు మెరుగుపడేలా చూడాలని పీవో కావూరి చైతన్య ఆదేశించారు. ఎంఈవో లక్ష్మీనారాయణ, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు జిక్రియా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.