Tenth Class Exams: సహాయకుల అవసరం లేకుండా పరీక్షలు
ఈసారి దేశంలోనే తొలిసారిగా సహాయకుల అవసరం లేకుండా ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ల్యాప్‌టాప్ సహాయంతో అంధ విద్యార్థులు పదో తరగతి తెలుగు పరీక్ష రాశారు. ఆర్డీటీ అంధుల పాఠశాలలోని ఆరుగురు బాలికలు చైత్రిక, శ్రీధాత్రి, సౌమ్య, నాగరత్నమ్మ, దివ్యశ్రీ, పావని ల్యాప్‌టాప్‌లో ఉన్న ప్రశ్నపత్రాన్ని హెడ్‌ఫోన్ల ద్వారా విని, విద్యార్థులు జవాబును టైప్ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా ప్రశ్నలు వినిపించకపోతే ప్రశ్నలు చదివి వినిపించేందుకు రీడర్లను సైతం ఏర్పాటు చేశారు. ల్యాప్‌టాప్ ద్వారా జవాబులను ప్రింట్ తీసి ఓఎంఆర్ షీట్‌కు జత చేశారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
కొత్త అనుభవం కలిగింది
మా సీనియర్లు గతంలో సహాయకుల సాయంతో పరీక్షలు రాసేవాళ్లు. మేము మొదటిసారిగా ల్యాప్‌టాప్ సాయంతో డిజిటల్ విధానంలో పరీక్షలు రాస్తున్నాం. ఇది మాకు కొత్త అనుభవం. ఇందుకు మా ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. మూడు నెలలపాటు మా పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. ఫస్ట్ రోజు కదా కాస్త భయపడ్డాం. అయినా తెలుగు పరీక్ష బాగా రాశాం. మిగిలిన పరీక్షలు కూడా భయం లేకుండా రాస్తాం.
– నాగరత్నమ్మ, అంధ విద్యార్థి, ఆర్డీటీ అంధుల పాఠశాల, రాప్తాడు