టీసీ లేకుండానే 1 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తర గతి వరకు విద్యార్థు లకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) లేకుండానే బడుల్లో చేర్చుకునే నిబంధనను పక్కాగా అమలుచేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎలిమెంటరీ విద్యలో (ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు) పాఠశాలల్లో ఏ తరగతిలోనూ విద్యార్థుల ప్రవేశాలను నిరాకరించడానికి వీల్లేదు.
కరోనా కారణంగా చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యం లో నిబంధన అమలుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోంది.
Published date : 23 Jun 2021 02:19PM