ఏపీలో పాఠశాల విద్యా విధానం భేష్
కృష్ణా, విశాఖ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఫిబ్రవరి 13న ఢిల్లీ ఎస్‌సీఈఆర్‌టీ బృందం పరిశీలించింది. మృదుల భరద్వాజ్ నేతృత్వంలోని 28 మంది సభ్యులతో కూడిన ఒక ఢిల్లీ ఉపాధ్యాయుల బృందం కృష్ణా జిల్లా పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను, ఢిల్లీ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ రామకిశోర్ పర్యవేక్షణలో మరో బృందం విశాఖలోని మధురానగర్, నరవ, నడుపూరు పాఠశాలలను పరిశీలించాయి. తరగతి గదుల్లో సౌకర్యాలు, విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ట్యాబ్‌లు, సైన్స్ ల్యాబ్‌ల నిర్వహణ, అటల్ టింకరింగ్ హబ్, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన కానుకలను బృందం సభ్యులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
చదవండి: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సుల పరిస్థితి ఇదీ..
ముఖ్యంగా నడుపూరు ఉన్నత పాఠశాల ఆవరణలో వాతావరణం చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. ఈ పాఠశాలలో అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ విధానం, రెయిన్ హార్వెస్టింగ్ విధానాన్ని, డిజిల్ లెరి్నంగ్, ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను చూసి ఆనందం వ్యక్తంచేశారు. విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న విద్యా విధానాలను ఢిల్లీ బృందాలకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు వివరించారు. పేద విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యా ప్రమాణాలు, అనేక పథకాలు అమలు చేయడం గొప్ప విషయమని ఢిల్లీ బృందం సభ్యులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా ముందుచూపుతో అమలు చేస్తున్న పథకాలను ఢిల్లీలోని పాఠశాలల్లో కూడా అమలు చేయాలని తమ ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు.
చదవండి: Elluri Shankar: వెక్కిరించిన వైకల్యాన్ని ‘కాళ్ల’రాశాడు