Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు ‘వ్యక్తిత్వ’ శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సెట్కూరు సీఈవో పీవీ రమణ చెప్పారు. శుక్రవారం సెట్కూ రు కార్యాలయంలో హ్యాపీ ఎగ్జామ్స్‌పై అవగాహన కార్యక్రమానికి సంబంధించి వాల్‌పోస్టర్‌ను పీవీ రమణ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సెట్కూరు–యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10వ తరగతి విద్యార్థులకు హ్యాపీ ఎగ్జామ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిష్ణాతులైన వ్యక్తిత్వ వికాస నిపుణులతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు పదో తరగతి తర్వాత విద్యావకాశాలపై వివరిస్తారన్నారు.
Also Read : Biology study material
వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విద్యావకాశాలు తెలిపే కరపత్రిక, బుక్‌లెట్ అందజేస్తామన్నారు. త్వర లో యువజన సర్వీసుల శాఖ ద్వారా మై కెరీర్ అనే మొబైల్ యాప్‌ను యువతకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సెట్కూ రు కార్యాలయాన్ని నేరుగా గానీ, ఫోన్‌నంబర్ 8688 361250, 9849909070 ద్వారా సంప్రదించి కార్యక్రమాన్ని తమ పాఠశాలల్లో ఏర్పాటు చేయించుకో వాలని కోరారు.సెట్కూరు మేనేజర్ సత్యనారాయణ, వ్యక్తిత్వ వికాస నిపుణులు రాజశేఖర్ పాల్గొన్నారు.