ఆధునిక పోటీ ప్రపంచంలో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్షర దీపం వెలిగించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
విద్యా సంస్కరణలతో వెలుగుతున్న అక్షర దీపం
విద్యా రంగంపై శాసనసభలో నవంబర్ 26న ఆయన స్వల్ప కాలిక చర్చలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని 2020లో తీసుకురాగా.. అదే విధానాన్ని 2019లోనే రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయడం ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలు తమ పిల్లలను పాఠశాల, కళాశాలలకు పంపేలా చేయడంతో పాటు వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపాయని మంత్రి చెప్పారు.