Skip to main content

Andhra Pradesh: సర్కారు బడిలో అంతర్జాతీయ విద్య

సాక్షి, అమరావతి: ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి. అందుకోసం వారికి మీ జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి డిజిటల్‌ బోధన ప్రవేశపెట్టాం. సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నాం. మన పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బక్‌లారియెట్‌ (ఐబీ) బోధన కూడా ప్రవేశపెడతాం’’ జగనన్న ఆణిముత్యాలు రాష్ట్ర స్థాయి సత్కార వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాట ఇది. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఐబీ సంస్థతో బుధవారం ఒప్పందం చేసుకుని ఆచరణలోకి తెచ్చారు.
International Education in Government School,Digital Teaching,Jagananna Animuthyalu
సర్కారు బడిలో అంతర్జాతీయ విద్య

ఇప్పటికే సర్కారు బడిలో సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్‌ బోధనను అందుబాటులోకి తె చ్చిన ప్రభుత్వం ఇప్పుడు ‘ఐబీ’ చదువులను సైతం పేద పిల్లలకు చేరువ చేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 210 వరల్డ్‌ క్లాస్‌ కార్పొరేట్‌ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్‌ అమల్లో ఉంది. ఈ స్కూళ్లలో సంపన్నులు మాత్రమే తమ పిల్లలను చదివించగలరు. అలాంటి చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్‌ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ ప్లస్‌2 వరకు విద్యనందించేందుకు చర్యలు తీసుకుంది.  

ప్రపంచం మె చ్చిన విద్యా విధానం  

సాధారణంగా ప్రైవేటు స్కూళ్లలో మార్కులు.. ర్యాంకులు.. ఒకరితో మరొకరికి పోటీతో పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెంచుతారు. దీనికి భిన్నంగా మానసిక ఒత్తిడి లేకుండా పిల్లలు సొంతంగా ఎదగడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బోధనను ఐబీ అందిస్తుంది. ఐబీ ఒక నాన్‌ ప్రాఫిట్‌ ఫౌండేషన్‌. పిల్లలపై పరీక్షల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన కొంత మంది ఉపాధ్యాయులు పరిశోధన చేసి 1968లో స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్‌ బోర్డు.

ఇందులో 3 నుంచి 19 ఏళ్ల వయసు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణనిస్తారు. ఈ సిలబస్‌ చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్‌ థింకింగ్, ఇండిపెండెంట్‌ థింకింగ్, సెల్ఫ్‌ లెరి్నంగ్‌ వంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్‌–మైండెడ్, ఓపెన్‌ లెర్నింగ్‌ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఆకళింపు చేసుకుని, సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

159 దేశాల్లో ఈ విద్యా విధానం అమలులో ఉంది. ఈ బోర్డులో చదువుకున్న పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశాలు, అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇతర కోర్సులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న నేటి యుగంలో ‘ఐబీ సిలబస్‌’లో పిల్లల నైపుణ్యాలను అంచనా వేసే అంతర్గత పరీక్షలేగాని అధికారిక పరీక్షలు ఉండవు.  

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

నాలుగు దశల్లో ప్రోగ్రాములు 

ఐబీ ప్రోగ్రాములు నాలుగు దశల్లో ఉంటాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయసు విద్యార్థులకు ప్రైమరీ ఇయర్స్‌ ప్రోగ్రామ్‌ (పీవైపీ) అందిస్తారు. ఇందులో పిల్లలకు నేర్చుకునే ఆసక్తి పెంచడం, కమ్యూనికేషన్‌ స్కిల్స్, బేసిక్‌ నాలెడ్జ్, సొంతంగా ఆలోచించడం వంటివి నేర్పిస్తారు. ఈ ప్రోగ్రాంలో పరీక్షలు గానీ, గ్రేడింగ్‌ కానీ ఉండవు. పదేళ్ల ఈ ప్రోగ్రామ్‌ పూర్తయిన తర్వాత చివరలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ వంటిది నిర్వహించి పిల్లలను భాగస్వామ్యం చేస్తారు.  

  • కాగా, 11 నుంచి 16 సంవత్సరాల విద్యార్థులకు మిడిల్‌ ఇయర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎంవైపీ) ఉంటుంది. ఇందులో విద్యార్థులకు ఆర్ట్స్, లాంగ్వేజ్, లాంగ్వేజ్‌ అక్విజిషన్, మ్యాథ్స్, డిజైన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఇండివిడ్యువల్స్‌ అండ్‌ సొసైటీస్, సైన్సెస్‌ అనే 8 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో పిల్లలు నైపుణ్యాలను ఎంత నేర్చుకుంటున్నారు అనే దానిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ కోర్సు ప్రస్తుతం మన పదో తరగతికి సమానం.   
  • ఇక 16 నుంచి 19 ఏళ్ల వయసున్న విద్యార్థులకు డిప్లొమా ప్రోగ్రామ్‌ (డీపీ) ఉంటుంది. మూడేళ్ల పాటు ఉండే ఈ ప్రోగ్రామ్‌లో లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్, లాంగ్వేజ్‌ అక్విజిషన్, సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్, ఇండివిడ్యువల్స్‌ అండ్‌ సొసైటీస్‌ అనే 6 గ్రూపులు ఉంటాయి. డిప్లొమా ప్రోగ్రామ్‌ పూర్తయిన తర్వాత చివర్లో సరి్టఫికెట్‌ ప్రదానం చేస్తారు. మన ప్లస్‌ 2 విద్యకు సమానమైన ఈ డిప్లొమా సర్టిఫికెట్‌ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా చెల్లుతుంది.  
  • ఇదే వయసున్న (16–19 సం.) విద్యార్థుల కోసం కెరీర్‌ రిలేటెడ్‌ ప్రోగ్రామ్‌ (సీపీ) డిజైన్‌ చేశారు. ఇది విశ్వవిద్యాలయాలు, ఉపాధి, తదుపరి ట్రైనింగ్‌ కోసం విద్యార్థులను సిద్ధం చేసే రెండేళ్ల ప్రోగ్రామ్‌. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందిస్తారు.  

విశ్వ మానవుడిగా ఎదుగుదల  

ఐబీ విద్య విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రశి్నంచడం అలవాటు చేస్తుంది. ఇది సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించే సామర్థాన్ని ఇస్తుంది. రాయడం, మాట్లాడటం, ప్రెజెంటేషన్‌ సహా వివిధ మార్గాల్లో సమర్థవంతంగా కమ్యూనికేట్‌ చేసే నైపుణ్యాలు బోధిస్తారు. వారి చదువు, కెరీర్‌ను మరింత విజయవంతం చేసేందుకు దోహదం చేస్తుంది. ఐబీ విద్యార్థులు విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల గురించి నేర్చుకుంటారు.

ఇది వారికి మరింత సహనాన్ని, ఇతరులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. విద్యార్థులు బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా తయారు చేస్తారు. ప్రపంచంలో ఏమూల ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా అక్కడ సానుకూల మార్పును తీసుకురావడానికి ఈ విద్య సహాయపడుతుంది. అంతర్జాతీయంగా అత్యున్నత కెరీర్‌ను సొంతం చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. 

భారత్‌లో 210 ఐబీ స్కూళ్లు  

వాస్తవానికి ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ చదువులు చాలా ఖర్చుతో కూడుకున్నది. మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముస్సోరి, కొడైకెనాల్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పరిధిలో 210 ఐబీ వరల్డ్‌ స్కూల్స్‌ ఉన్నా యి. వాటిల్లో ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా స్కూళ్లలో ప్రైమరీ ఇయర్స్‌ ప్రోగ్రామ్‌ (3–12సం.) మాత్రమే అందిస్తుండగా, కొన్ని కొన్ని మిడిల్‌ ఇయర్‌ ప్రోగ్రామ్‌ (11–16 సం.) వరకు, అతి తక్కువ స్కూళ్లు మాత్రం డిప్లొమా ప్రోగ్రామ్‌ (డీపీ) వరకు బోధిస్తున్నాయి.  

Published date : 22 Sep 2023 09:42AM

Photo Stories