Jagananna Vidya Kanuka: బడి తెరిచిన రోజే పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్న విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. సీఎం జగనన్న మానస పుత్రిక అమ్మ ఒడితోపాటు మన బడి, నాడు – నేడు, గోరుముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన ఇలా అనేక విద్యా సంబంధిత పథకాలు ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. మరో విద్యా సంవత్సరం త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుక అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చదవండి: AP News: ఏపీలో మూడు ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్... ఎక్కడెక్కడంటే
సిద్ధమవుతున్న జగనన్న విద్యాకానుక
పేద విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం నింపి, వారికి విద్య ద్వారానే ఉన్నతి సాధ్యమని నమ్మకాన్ని కలిగించి కేవలం చదువుపైనే దృష్టిపెట్టేలా చేయడమే సీఎం జగనన్న లక్ష్యం. దీనిలో భాగంగా జగనన్న విద్యాకానుకగా విద్యార్థులకు యూనిఫాంతో పాటు విద్యా సామగ్రి అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. ఏటా క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్న విద్యాకానుకను ఈ ఏడాది కూడా పాఠశాలలు తెరిచిన రోజునే వారికి అందజేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ప్రతి విద్యార్థికీ విద్యాకానుక అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.
చదవండి: Applications: ప్రైవేటు స్కూళ్లలో పేదల ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు
బడి తెరిచిన రోజే పంపిణీ
మూడేళ్లుగా జగనన్న విద్యాకానుకను బడి తెరిచిన రోజే విద్యార్థులందరికీ అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ లేదా జనవరి నుంచే విద్యార్థుల వివరాలు సేకరించడంతో పాటు వారికి అందించే బూట్లు, యూనిఫాం కొలతలు సేకరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత నూతనంగా పాఠశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు కూడా విద్యా కానుక అందించేందుకు విద్యాసామగ్రిని సిద్ధంగా ఉంచుతున్నారు.
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
ముఖ్యమంత్రి అమలు చేస్తున్న విద్యారంగ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రైవేట్ పాఠశాలల నుంచి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఏలూరు జిల్లాలో 1,22,654 మందికి సుమారు రూ.18.77 కోట్ల విలువైన విద్యాకానుకలు అందజేశాారు. 2021–22లో 1,39,229 మంది విద్యార్థులకు రూ.21.30 కోట్ల విలువైన విద్యా కానుకలు, 2022–23లో 1,87,051 మంది విద్యార్థులకు రూ. 37.33 కోట్ల విలువైన విద్యాకానుకలు అందజేశారు.