School Education Department: క్లాస్ బేస్డ్ అసెస్‌మెంట్ పరీక్షలు తేదీలు ఇవే
ఈ మేరకు జూలై 30న షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆగష్టు 1, 2, 3తేదీలలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం తెలుగు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఓఎస్‌ఎస్‌సీ (మూడు నుంచి ఐదు తరగతులకు), మధ్యాహ్నం గణితం, ఇంగ్లిష్ పార్ట్–ఏ, మూడు, నాలుగు, ఐదు తరగతులకు పార్ట్–బి అసెస్‌మెంట్ నిర్వహించనున్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
6,7,8 తరగతులకు ఆగష్టు 1న మధ్యాహ్నం సెషన్‌లో తెలుగు, గణితం, బుధవారం హిందీ, జనరల్ సైన్స్, గురువారం సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ పార్ట్–ఎ, పార్ట్–బి, శుక్రవారం ఓఎస్‌ఎస్‌సీ–1, 2 పేపర్లు ఉంటాయి. 9,10 తరగతులకు ఆగష్టు 1న ఉదయం తెలుగు, మ్యాథ్స్, బుధవారం ఉదయం హిందీ, జనరల్ సైన్స్, గురువారం సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, ఇంగ్లిష్ పార్ట్–బి (తొమ్మిదో తరగతికి), శుక్రవారం ఓఎస్‌ఎస్‌సీ–1, 2 ఉంటాయని పేర్కొంది.