Skip to main content

Breaking News: ఏపీలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల తేదీలు ఖరారయ్యాయి.
AP 10th Class and Inter Exams Schedule
AP 10th Class and Inter Exams Dates

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌ రెడ్డి షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. మే 2వ తేదీ నుంచి మే 13వ తేదీ వ‌ర‌కు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించనున్నారు. అలాగే ఏప్రిల్ 8 నుంచి 28వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్ మార్చి 11 నుంచి 31వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఇంటర్మీడియట్ పరిక్షల షెడ్యూల్‌:
మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు.

పదో తరగతి పరిక్షల షెడ్యూల్‌:
టెన్త్‌ పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరిక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు.

10th and Inter Exams Dates

Breaking news: పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

Breaking news: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

ఏపీ ఇంట‌ర్ స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 10 Feb 2022 02:06PM

Photo Stories