గోరుముద్దలో మరో పౌష్టికాహారం ఇదే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చదవండి: KMS Khalsa: జగనన్న గోరు ముద్ద భేష్!
బలవర్థకమైన ఆహారానికి ఏటా రూ.1,910 కోట్లు
మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఏటా రూ.1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచి్చస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ రుచికరమైన మెనూతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది.
చదవండి: School Education Department: బడికి రప్పించేలా రవాణా చార్జీలు
ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) బెల్లంతో కూడిన రాగిజావను అందించనున్నారు. ఇక మిగిలిన 3 రోజులు గోరుముద్దలో బలవర్థకమైన చిక్కీని పిల్లలకు ఇస్తున్నారు. జగనన్న గోరుముద్దలో వారానికి 15 వెరైటీలు ఉండగా ఐదు రోజుల పాటు కోడిగుడ్డు, 3 రోజులు చిక్కీ ఇస్తున్నారు. ఇకపై మూడు రోజులు రాగిజావ కూడా అందనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కావడం, చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో పథక నిర్వహణలో భాగంగా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు.
చదవండి: నాడు–నేడుతో సర్కారీ బడి.. సరికొత్త సవ్వడి..
నాడు నాసిరకం తిండి..
నాడు నాసిరకం ఆహారం, ఉడికీ ఉడకని అన్నం, రుచిపచీ లేని కూరలతో మధ్యాహ్న భోజన పథకాన్ని టీడీపీ సర్కారు నీరుగార్చింది. పిల్లలకు ఏమాత్రం రుచించని విధంగా ప్రతి రోజూ సాంబారు అన్నంతో కూడిన ఒకే రకమైన మధ్యాహ్న భోజనం సరఫరా చేయడంతో తినలేక అవస్థలు పడ్డారు. ఇక వంట సహాయకులకు గౌరవ భృతి నెలకు కేవలం రూ.1,000 మాత్రమే చెల్లించగా ఆయాల జీతాలు, సరుకుల బిల్లులు సైతం 8–9 నెలలు పెండింగ్‌లోనే ఉన్న దుస్థితి. గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా వంట సహాయకులకు నెలకు రూ. 3,000 చొప్పున గౌరవ భృతితోపాటు క్రమం తప్పకుండా గోరుముద్ద బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోంది.