Adjustment orders of Teachers: ఉపాధ్యాయులులో దుమారం రేపిన సర్దుబాటు ఉత్తర్వులు
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులుకు ఇచ్చిన పని సర్దుబాటు ఉత్తర్వులు దుమారం రేపాయి. మండల పరిధిలో కానీ, డివిజన్ పరిధిలో కాకుండా జిల్లా స్థాయిలో ఉత్తర్వులు ఇవ్వడం వివాదానికి కారణమైంది. ఈ విషయంపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో పని సర్దుబాటు ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపి వేశారు. ప్రజాప్రతినిధుల సూచనలను పాటిస్తూ ఉత్తర్వులను మార్పు లు చేసి మండల, డివిజన్ పరిధిలోనే సర్దుబాటు చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఆదోని డివిజన్‌లోని స్కూళ్లలో సబ్జెక్టు టీ చర్ల కొరత ఉంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఈ విషయాన్ని గుర్తించారు. టీచర్ల కొరత లేకుండా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలో వివిధ సబ్జెక్టుల టీచర్లు 98 మంది అదనంగా ఉన్న ట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీరిని ఆదోని డివిజన్ పరిధిలోని హైస్కూళ్లలో సర్దుబాటు చేశారు. మండలాలు, డివిజన్ పరిధిలో కాకుండా జిల్లా పరిధిలో సర్దుబాటు చేయడం వివాదానికి కారణమైంది. దీంతో విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
Published date : 25 Jul 2023 01:39PM