చరిత్రలో ప్రముఖ మహిళలు

  • యాజ్ఞవాల్కవ్యునితో వాదించిన వేద కాలం నాటి మహిళ?
    – గార్గి
  • పార్శ్వనాథుడి తల్లి పేరు?
    – రాణి వామల
  • వర్థమాన మహావీరుని తల్లి ఎవరు?
    – త్రిశాల దేవి
  • వర్థమానుని కుమార్తె పేరు?
    –అనోజ్ఞ (ప్రియదర్శిని)
  • బుద్ధుడి తల్లి ఎవరు?
    – మహామాయ
  • బుద్ధుడిని పెంచిన తల్లి ?
    – ప్రజాపతి గౌతమి
  • బుద్ధుడికి పాయసాన్ని ఇచ్చిన మహిళ?
    – సుజాత
  • బుద్ధుడి భార్య పేరు?
    – యశోధర
  • వర్థమాన మహావీరుని భార్య పేరు?
    – యశోద
  • బుద్ధుని చర్యలతో మారిన అజాతశత్రువు ఆస్థాన నర్తకి?
    – ఆమ్రపాలి
  • చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకున్న గ్రీకు వనిత ?
    – హెలీనా (హేలన్‌)
  • అశోకుడి తల్లి పేరు?
    – సుభద్రాంగి
  • అశోకుని పట్టపు రాణి?
    – ఆనంది మిత్ర
  • శ్రీలంకలో బౌద్ధ ప్రచారానికి వెళ్లిన అశోకుని కుమార్తె పేరు?
    – సంఘమిత్ర
  • మౌర్య సామ్రాజ్య పతనానికి కారకుడు అశోకుడేనని తెలిపిన చరిత్రకారిణి?
    – రొమిల్లా థాపర్‌
  • మొదటి శాతకర్ణి గురించి వివరిస్తోన్న నానాఘట్‌ శాసనాన్ని వేయించింది?
    – నాగానిక
  • నాసిక్‌ శాసనాన్ని వేయించింది?
    – గౌతమీ బాలశ్రీ
  • అజాతశత్రువు వివాహం చేసుకున్న కోసల రాజు ప్రసేనజిత్తు కుమార్తె?
    – వజీరా
  • బౌద్ధ మతాన్ని స్వీకరించిన శ్రావస్తి నగర స్త్రీ?
    – విశాఖ
  • పూనా శాసనాన్ని వేయించిన ప్రముఖ మహిళ?
    – ప్రభావతీ గుప్తా
  • హర్షుడి తల్లి పేరు?
    – యశోమతి
  • హర్షుడి సోదరి పేరు?
    – రాజశ్రీ
  • జైన మతాన్ని ఆదరించిన వేంగీ చాళుక్యరాజు కుబ్జ విష్ణువర్థనుడి భార్య?
    – అయ్యణ్ణ మహాదేవి
  • విమాలాదిత్యుడు అనే వేంగి రాజు వివాహం చేసుకున్న చోళ రాజరాజు–1 కుమార్తె?
    – కుందవ్వ
  • రాజరాజ నరేంద్రుడు వివాహం చేసుకున్న చోళ రాజు మొదటి రాజేంద్రుడి కుమార్తె ?
    – అమ్మంగదేవి
  • ప్రముఖ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుని కుమార్తె పేరు?
    – లీలావతి
  • బోధి వృక్షం క్షీణించడానికి విష ప్రయోగం చేయించిన అశోకుడి భార్య?
    – తిశ్యరక్షిత (రెండో పట్టమహిషి)
  • బౌద్ధ మతానికి సేవ చేసి, విజయపురి, నాగార్జున కొండల్లో కీర్తి గడించిన బోధిశర్మ మేనకోడలు?
    – ఉపాశిక బోధిశ్రీ
  • శ్రీశాంత మూలుడు అనే ఇక్ష్వాక రాజు సోదరి పేరు?
    – శాంతిశ్రీ
  • శ్రీశాంత మూలుడి కుమార్తె?
    – అడవి శాంతిశ్రీ
  • ఇంద్రపాల నగరం (నల్గొండ)లో బౌద్ధులకు మహా విహారాన్ని నిర్మించిన విష్ణుకుండిన రాణి?
    – పరమ భట్టారిక
  • వేములవాడ చాళుక్యు రాజు రెండో నరసింహుడు వివాహం చేసుకున్న మూడో ఇంద్రుని కుమార్తె?
    – జాకవ్వ
  • వీరపురుషదత్తుడు అనే ఇక్ష్వాక రాజు కుమార్తె పేరు?
    – కొండ బలసిరి
  • రెండో చంద్రగుప్తుడు వివాహం చేసుకున్న రామగుప్తుని భార్య?
    – ధృవాదేవి
  • రెండో చంద్రగుప్తుడిని వివాహం చేసుకున్న నాగ వంశ రాణి?
    – కుబేర నాగ
  • విజయవాడలో నెడుంబి బసతిని నిర్మించింది?
    – అయ్యణ్ణ మహాదేవి
  • మొదటి చాళుక్య భీముడు (వేంగి) ఆదరించిన ఏ కవయిత్రి అత్తిలిని బహుమానంగా పొందింది?
    – చల్లవ్వ
  • రెండో చాళుక్య భీముడు (వేంగి) వివాహం చేసుకున్న స్త్రీలు?
    – ఉర్జివ (అంకందేవి), లోకాంబిక
  • నలగామరాజుకు ప్రధానిగా పనిచేసింది?
    – నాగమ్మ
  • బాలచంద్రుని భార్య?
    – మాంచాల
  • బయ్యారం చెరువు శాసనం వేయించింది?
    – మైలాంబ
  • మొదటి బేతరాజు అనే కాకతీయ రాజుకు కళ్యాణి చాళక్యుల నుంచి∙కొంత భూ భాగాన్ని ఇప్పించింది?
    –మిరియాల కామసాని
  • సంగమ యుగం నాటి గొప్ప కవయిత్రి?
    – అవ్వయార్‌
  • కాకతీయ రుద్రదేవుడు వివాహం చేసుకున్న పానగల్లు యువరాణి?
    –పద్మావతి
  • గణపతిదేవుడును వివాహం చేసుకున్న అయ్యచోడుని కుమార్తెలు?
    –నారాంబ, పేరాంబ
  • దక్షిణాదిలో ఏకైక హిందూ పాలకురాలు?
    – రాణి రుద్రమదేవి
  • రుద్రమదేవి కుమార్తెలు?
    – మమ్ముడమ్మ, రుయ్యమ, రుద్రమ
  • రెండో ప్రతాపరుద్రుని ఆస్థాన నర్తకి?
    – మాచల్దేవి
  • శ్రీకృష్ణదేవరాయల కుమార్తె?
    – మోహనాంగి
  • వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుని సోదరీమణులు?
    – హర్షిశ్రీ, శాంతిశ్రీ
  • రెండో ప్రతాపరుద్రుడి సేనలను ఎదిరించిన మగువలు?
    – సమ్మక్క, సారక్క
  • రాష్ట్రకూట రాజు ధృవుడు వివాహం చేసుకున్న వేంగీ చాళుక్య 4వ విష్ణువర్థనుని కుమార్తె?
    – శీల మహాదేవి
  • రెండో నందివర్మ అనే పల్లవ రాజును వివాహం చేసుకున్న దంతిదుర్గుని కుమార్తె?
    – రేవతిదేవి
  • సుభద్రా కల్యాణం రాసిన అన్నమయ్య భార్య?
    – తాళ్లపాక తిమ్మక్క
  • కంచర్ల గోపన్న (భక్త రామదాసు) భార్య?
    – కమల
  • శ్రీకృష్ణదేవరాయల భార్యలు?
    – చిన్నాదేవి, తిరుమలదేవి
  • మొదటి దేవరాయలు అనే విజయనగర రాజు ఎవరి కోసం బహమనీ రాజు ఫిరోజ్‌షాతో యుద్ధం చేశాడు?
    – నేహాల్‌
  • ఇనుగుర్తిలో గోపాలకృష్ణుడి ఆలయాన్ని నిర్మించిన గణపతిదేవుడి సోదరి?
    – మైలాంబ
  • రామనాథాలయం (కరీంనగర్, యెల్గేడు)కు కానుకలు సమర్పించిన రెండో ప్రతాపరుద్రుని దేవేరి?
    – లక్ష్మీదేవి
  • రాధికాస్వాంతనం రాసింది?
    – ముద్దు పళని
  • గణపతి దేవుడిని వివాహం చేసుకున్న యాదవుల యువరాణి?
    – సోమలదేవి
  • కశ్మీర్‌ పాలనలో పాలుపంచుకున్న మహిళ?
    – దిద్దాదేవి
  • కలువచేరు శాసనాన్ని వేయించింది?
    – అనితల్లి
  • ఇబ్రహీం కులీ కుతుబ్‌షా వివాహం చేసుకున్న హిందూ మహిళ?
    – భగీరథీదేవి
  • శాతవాహనుల కాలం నాటి కవయిత్రులు?
    – రేవతి, మాధవి, చల్లువ, బోదిశ్వ
  • బొబ్బిలి యుద్ధం చేసి వీర మరణం పొందిన రంగారావు భార్య?
    – మల్లమ్మ
  • రాచకొండలో ‘నాగ సముద్రం’ను నిర్మించింది?
    – నాగాంబికS
  • గోల్కొండలో ఆపద్ధర్మ పాలన సాగించిన జంషీద్‌ కులీ భార్య?
    – బిల్కిస్‌ జహాన్‌
  • మహ్మద్‌ కులీ కుతుబ్‌షా ఏకైక కుమార్తె ?
    – హయత్‌ భక్షీ బేగం
  • మహ్మద్‌ కులీ కుతుబ్‌షా వివాహం చేసుకున్న హిందూ మహిళ?
    – భాగమతీదేవి
  • పృథ్వీరాజ్‌ చౌహాన్‌ భార్య పేరు?
    – రాణి సంయుక్త
  • ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు?
    – రజియా సుల్తానా
  • గుండేశ్వరాలయాన్ని నిర్మించిన గోన బుద్ధారెడ్డి సోదరి?
    – కుప్పాంబిక
  • అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ వివాహం చేసుకున్న కర్ణ దేవుని భార్య?
    – కమలాదేవి
  • రామాయణాన్ని తెలుగులో రాసిన మహిళ?
    – మొల్ల
  • అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ చర్యల వల్ల జౌహార్‌ చేసి మరణించిన రతన్‌సింగ్‌ భార్య?
    – రాణి పద్మిని
  • సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన నర్తకి?
    – భోగిని
  • కృష్ణ భక్తిని ప్రచారం చేసిన భక్తి ఉద్యమ కారిణి?
    – మీరాబాయి
  • మన్నారు దాస విలాసం రాసింది ?
    – పసుపులేటి రంగాజమ్మ
  • షాజహాన్‌ తల్లి పేరు?
    – తాజ్‌ బీబీ బిల్కిస్‌ మకానీ
  • రెడ్డిరాజు కుమారగిరిరెడ్డి ఆస్థాన నాట్యకత్తె?
    – లకుమాదేవి
  • తుక్క పంచమి రాసింది?
    – తక్కమాంబ
  • ప్రపంచ ప్రఖ్యాత తొలి అనస్థీషియనిస్ట్‌ అయిన భారత మహిళ?
    – డా.రూపబాయి పుర్ధోంజీ
  • ‘మధురా విజయం’ను రాసిన కుమార కంపన భార్య?
    – గంగాదేవి
  • వరదాంబిక పరిణయం రాసింది?
    – తిరుమలాంబ
  • శ్రీకృష్ణదేవరాయల తల్లి?
    – నాగులాంబ (నాగాంబ)
  • హుమయూన్‌ నామా రాసింది?
    – గుల్‌బదన్‌ బేగం
  • అక్బర్‌ వివాహం చేసుకున్న అంబర్‌ రాజ్య యువరాణి?
    – మర్యం–ఇ–జమానీ
  • అక్బర్‌ని పెంచిన తల్లి?
    – మహం అంగా
  • గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్‌షా పోషించిన కళావతులు?
    –తారామతి, ప్రేమామతి
  • హయత్‌నగర్‌ ఎవరి పేరు మీద నిర్మితమైంది?
    – హయత్‌ భక్షీ బేగం
  • జహంగీర్‌ వివాహం చేసుకున్న వితంతువు పేరు?
    – నూర్జహాన్‌
  • అక్బర్‌ను ఎదిరించిన అహ్మద్‌నగర్‌ రాణి?
    – చాంద్‌ బీబీ
  • అక్బర్‌ను ఎదిరించిన గోండ్వానా రాణి పేరు?
    – దుర్గావతి
  • షేర్షా వివాహం చేసుకున్న వితంతువు?
    – లాడ్‌ మాలిక
  • అక్బర్‌ కాలం నాటి మాళ్వా ప్రాంత సంగీతకారిణి?
    – రూపమతి
  • అక్బర్‌ తల్లి పేరు?
    – హమీదా భాను బేగం
  • షాజహాన్‌ వివాహం చేసుకున్నlఅసఫ్‌ఖాన్‌ కుమార్తె?
    – ముంతాజ్‌ బేగం
  • షాజహాన్‌ సోదరుడు షహ్రియార్‌ వివాహం చేసుకున్న నూర్జహాన్‌ కుమార్తె?
    – లాడ్లీ బేగం
  • షాజహాన్‌ (ఖైదీగా ఉన్నప్పుడు)కు సేవ చేసిన కుమార్తె?
    – జహనార
  • ఛత్రపతి శివాజీ భార్యలు?
    –సౌరయబాయి, షాహిబాయి
  • రాజకీయ రంగంలో కీర్తి గడించిన షాజహాన్‌ కుమార్తె?
    – రోషనార
  • కాలిగ్రఫీ అనే సుందరంగా రాసే విద్యలో నిపుణురాలైన ఔరంగజేబు కుమార్తె?
    – జేబున్నీసా
  • మొదటి బాజీరావు (పీష్వా) ప్రేమించిన మహిళ?
    – మస్తానీ
  • శివాజీ తల్లి పేరు?
    – జిజియాబాయి
  • మహారాష్ట్రను పాలించిన రాజారాం భార్య
    – తారాబాయి
  • బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీకి అనుమతి ఇచ్చింది?
    – ఎలిజబెత్‌–1
  • టిప్పుసుల్తాన్‌ తల్లి పేరు?
    – ఫాతిమా ఫక్రున్నీసా
  • బ్రిటీష్‌ వారిని ఎదిరించిన కిత్తూరు రాణి?
    – చెన్నమ్మ
  • గణపతిదేవుని పెద్ద కుమార్తె?
    – గణపాంబ
  • లక్నో/అయోధ్యలో 1857 తిరుగుబాటులో తిరుగుబాటు చేసింది?
    – బేగం హజ్రత్‌ మహల్‌
  • సర్‌ హ్యూగ్‌ రోజ్‌తో పోరాడిన ఝాన్సీ రాణి?
    – లక్ష్మీబాయి / మనూబాయి / మణికర్ణిక
  • హన్మకొండలో కడలాలయ బసతి ఏర్పాటు చేసింది?
    –మైలమ
  • 1858 నుంచి భారతదేశ పాలన బాధ్యతలు నిర్వహించిన ఇంగ్లండ్‌ రాణి?
    – విక్టోరియా మహారాణి
  • ప్రప్రథమ యక్షగాన కవయిత్రి
    – బాల పాపాంబ (అక్కమహాదేవి చరిత్ర రాసింది)
  • కందుకూరి వీరేశలింగం తొలిసారి వివాహం చేసిన వితంతువు?
    – సీతమ్మ (గౌరమ్మ) (ఈమె శ్రీరాములును వివాహమాడింది)
  • కందుకూరి వీరేశలింగం భార్య పేరు?
    – రాజ్యలక్ష్మి
  • వివేకానందుని శిష్యురాలు?
    – సిస్టర్‌ నివేదిత (మార్గరెట్‌ నోబుల్‌)
  • రామకృష్ణ పరమహంస అర్థాంగి?
    – శారదాదేవి
  • అంబేద్కర్‌ తల్లి పేరు?
    – భీమబాయి
  • దివ్యజ్ఞాన సమాజ ప్రతినిధిగా భారత్‌ వచ్చిన ఐర్లాండ్‌ మహిళ?
    – అనీబిసెంట్‌
  • భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలుగా ఎవరిని కీర్తిస్తారు?
    – సావిత్రిబాయి పూలే
  • బొంబాయిలో శారదా సదన్‌ను ఏర్పాటు చేసింది?
    – పండిత రమాబాయి
  • భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి విదేశీ మహిళ?
    – అనిబిసెంట్‌
  • భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ?
    – సరోజినీ నాయుడు
  • మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ తల్లి?
    – అమాత్‌–ఉజ్‌–జహ్రున్నీసా బేగం
  • జవహర్‌లాల్‌ నెహ్రూ భార్య పేరు?
    – కమలా నెహ్రూ
  • వందేమాతర ఉద్యమంలో యువకుల కోసం వీరాష్టమి ఉత్సవాన్ని నిర్వహించింది?
    – సరళాదేవి
  • జవహర్‌లాల్‌ నెహ్రూ తల్లి?
    – స్వరూపరాణి
  • జర్మనీలోని ‘స్టట్‌గర్ట్‌’లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది?
    – మేడం కామా
  • మౌంట్‌బాటన్‌ భార్య పేరు?
    – ఎడ్వినా
  • గాంధీజీ తల్లి పేరు?
    – పుత్లీబాయి
  • గాంధీజీ భార్య పేరు?
    – కస్తూరిబాయి
  • భగత్‌సింగ్‌ తల్లి పేరు?
    – విద్యావతి
  • భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల్లో పాల్గొన్న కలకత్తా విశ్వవిద్యాలయ తొలి మహిళా గ్రాడ్యుయేట్‌?
    – కాదింబినీ గంగూలీ
  • గాంధీజీకి అనుచరురాలిగా మారిన అహ్మదాబాద్‌ వాసి?
    – అనసూయ బెన్‌
  • శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్న నాగాలాండ్‌ రాణి?
    – గైడిన్లూ
  • సహాయ నిరాకరణ ఉద్యమంలో తన యావదాస్తిని దేశసేవకు, తన దేవదాసీ వృత్తిని వదిలేసిన స్త్రీ?
    – యామినీ పూర్ణతిలకం
#Tags