వ్యవసాయ రంగం - విప్లవాలు

హరిత విప్లవం
ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తికి ఉద్దేశించింది. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం, నీటిపారుదల సౌకర్యాల కల్పన ద్వారా అధిక ఆహార ఉత్పత్తిని సాధించడమే హరిత విప్లవ ప్రధాన లక్ష్యం. నార్మన్ బోర్లాగ్ ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవానికి నాంది పలికాడు. అందువల్లే ఆయన్ను హరితవిప్లవ పితామహుడు (Father of Green Revolution గా పేర్కొంటారు. ఆయన ప్రవేశపెట్టిన అధిక దిగుబడినిచ్చే వంగడాలను 1967లో ఎం.ఎస్.స్వామినాథన్ మన దేశంలో ప్రవేశపెట్టి హరిత విప్లవానికి నాంది పలికారు. కాబట్టే ఆయన్ను భారతదేశ హరిత విప్లవ పితామహుడు (Father of Indian Green Revolution) గా పేర్కొంటారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించిన హరిత విప్లవం అనతికాలంలోనే భారతదేశం అంతటా విస్తరించింది.

తెలుపు/శ్వేత విప్లవం
భారతదేశంలో అధిక పాల ఉత్పత్తికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని శ్వేత విప్లవంగా పేర్కొంటారు. వర్గీస్ కురియన్‌ను శ్వేత విప్లవ పితామహుడు (Father of White Revolution) అని అంటారు. ఆయన గుజరాత్‌లోని ఆనంద్ అనే గ్రామంలో రైతులందరితో కలసి Anand milk Union Limited (Amul) అనే సహకార సంస్థను ప్రారంభించారు. ఇది అనతికాలంలో Amul బ్రాండ్‌గా మారింది. అధిక పాల ఉత్పత్తికి 1970లో రైతుల సహకారంతో ఆపరేషన్ ఫ్లడ్‌ను ప్రారంభించారు. ఫలితంగా పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. వర్గీస్ కురియన్‌ను మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.

నీలి విప్లవం
భారతదేశంలో అధిక చేపల ఉత్పత్తి కోసం ఉద్దేశించింది. ప్రొఫెసర్ హీరాలాల్ ఛౌదురిని నీలి విప్లవ పితామహుడు (Father of Blue Revolution)గా పేర్కొంటారు.

పసుపు విప్లవం
నూనె గింజల అధిక ఉత్పత్తికి ఉద్దేశించింది.
1986 నాటికి భారతదేశం వంటనూనె కోసం దిగుమతులపై ఆధారపడేది. వంటనూనెకు ఆధారమైన నూనెగింజల అధికోత్పత్తి కోసం భారత ప్రభుత్వం 1986లో టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ ను ప్రారంభించింది.
  • శామ్ పిట్రోడాను పసుపు విప్లవ(Yellow Revolution) పితామహుడుగా పేర్కొంటారు.
  • Round Revolution: బంగాళాదుంపల అధిక ఉత్పత్తి కోసం ప్రారంభించారు.
  • Grey Revolution: ఫెర్టిలైజర్స్ (ఎరువుల) అధిక ఉత్పత్తి కోసం ఉద్దేశించింది.
  • Silver Revolution: గుడ్లు అధికోత్పత్తి కోసం ఉద్దేశించింది. కోడిగుడ్ల అధిక ఉత్పత్తి, పౌల్ట్రీ రంగ అభివృద్ధి ఈ విప్లవం ప్రధాన లక్ష్యాలు.
  • Black Revolution: భారతదేశంలో పెట్రోలియం అధిక ఉత్పత్తి కోసం 1970లో ప్రారంభించారు.
  • Golden Revolution: పండ్లు (Apple) అధిక ఉత్పత్తి కోసం
  • Golden Fiber Revolution: జనపనార అధికోత్పత్తి.
  • Silver Fiber Revolution: పత్తి అధిక ఉత్పత్తి కోసం దీన్ని ప్రారంభించారు.
  • Pink Revolution: అధిక రొయ్యల ఉత్పత్తి/ అధిక ఉల్లిపాయల ఉత్పత్తి/ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు.
  • Red Revolution: టమోటా లేదా మాంసం అధికోత్పత్తి కోసం.
  • Brown Revolution: లెదర్ ఉత్పత్తులు
  • (తోళ్లు) సంప్రదాయేతర శక్తి వనరుల అభివృద్ధి, అధిక కోకో ఉత్పత్తి.
  • Rainbow Revolution: వ్యవసాయంతో పాటు వ్యవసాయానుబంధ రంగాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధినే Rainbow Revolution అంటారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, చేపలు, కోళ్లు, చెరకు ఇతర పాడి పశువుల.. సమగ్ర అభివృద్ధి కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీన్ని ప్రారంభించారు.

మాదిరి ప్రశ్నలు

1. సిల్వర్ విప్లవం దేనికి సంబంధించింది?
 1) వెండి 
 2) వరి
 3) గుడ్లు 
 4) పాలు





















#Tags