Office Subordinates: జూనియర్‌ అసిస్టెంట్‌లుగా ఎలా నియమిస్తారు?

సాక్షి, హైదరాబాద్‌: విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)లను జూనియర్‌ అసిస్టెంట్లుగా ఎలా నియమిస్తారని..వారి నియామకం సమంజసం కాదంటూ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆఫీస్‌ సబార్డినేట్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
జూనియర్‌ అసిస్టెంట్‌లుగా ఎలా నియమిస్తారు?

 ముందుగా తమ పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని, ఆ తర్వాతే వీఆర్‌ఏల నియామక అంశాన్ని పరిశీలించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్‌ఏలను జూనియర్‌ అసిస్టెంట్, ఇతర పోస్టుల్లో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 81 జారీ చేసిన విషయం తెలిసిందే. ఇది చట్టవిరుద్ధమని రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన కురిసెంగ ఆదిత్యతో పాటు మరో 29 మంది పిటిషనర్లు పేర్కొన్నారు.

చదవండి: Government Jobs 2023 : ఇకపై వీరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఈ కొత్త పోస్టుల్లోకి వీరే..

‘ఎన్నోసార్లు మాకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేసినా ఆ ప్రక్రియ చేపట్టకుండానే కేవలం రాజకీయ లబ్ది కోసమే వీఆర్‌ఏలను ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల్లో నియమించారు. జీవో 81ను వెంటనే కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ మాధవీదేవి ఆగస్టు 9న విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలకు సిద్ధమైనా..ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు అందుబాటులో లేకపోవడం విచారణ ఆగస్టు 10కి వాయిదా వేశారు.  

చదవండి: Department of Revenue: వీఆర్‌ఏల కోసం సూపర్‌న్యూమరీ పోస్టులు!

#Tags