B Sc Agriculture Courses : తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల్లో అగ్రి బీఎస్సీ కోర్సులో ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తులు..

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తి, కరీంనగర్‌లోని అగ్రికల్చర్‌ కాలేజీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు­లో ప్రవేశాలకు బాలికల నుంచి మాత్రమే దరఖాస్తులు కోరుతోంది.

»    కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    అగ్రికల్చర్‌ కాలేజ్, సీట్ల వివరాలు: అగ్రికల్చర్‌ కాలజ్, వనపర్తి–120 సీట్లు, అగ్రికల్చర్‌ కాలేజ్, కరీంనగర్‌–120 సీట్లు.
»    అర్హత: ఇంటర్మీడియట్‌(బైపీసీ)ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. టీజీ ఈఏపీసెట్‌–2024 ర్యాంకు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదా­యం రూ.2,00,000(పట్టణ ప్రాంతం), రూ. 1,50,000(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
»    వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
»    ఎంపిక విధానం: టీజీ ఈఏపీసెట్‌–2024 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.08.2024
»    దరఖాస్తు సవరణ తేదీలు: 01.09.2024 నుంచి 02.09.2024 వరకు
»    వెబ్‌సైట్‌: http://https//mjptbcwreis.telangana.gov.in-

Engineering AI Course : బీటెక్‌ తొలి ఏడాది నుంచే ఏఐపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత.. ఈ రంగాల‌కు పెరుగుతున్న ప్రాధాన్య‌త‌..

#Tags