BSc Nursing Courses : నిమ్స్‌లో బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సులు.. ఈ ర్యాంకుల ఆధారంగా..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (నర్సింగ్‌) కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం సీట్ల సంఖ్య: 100.
»    కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. టీజీ ఈఏపీసెట్‌–2024లో తప్పనిసరి­గా అర్హత సాధించి ఉండాలి.
»    వయసు: 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: టీజీ ఈఏపీసెట్‌–2024 ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాసు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 09.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.08.2024.
»    దరఖాస్తు హార్డ్‌కాపీలకు చివరితేది: 27.08.2024.
»    ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా వెల్లడితేది: 16.09.2024.
»    తుది మెరిట్‌ జాబితా వెల్లడితేది: 18.09.2024.
»    వెబ్‌సైట్‌: https://www.nims.edu.in

National Flag: 'ఫ్లాగ్‌ కోడ్' ఇదే.. అగౌరవపరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు!!

#Tags