Maha Kumbh Mela: మేళాలో ప్రత్యేక ఆకర్షణ 'నాగ సాధువులు'.. కుంభమేళా కోసం..

ఒళ్లంతా విభూది ధరిస్తారు. జనవాసాలకు దూరంగా సాధనే ప్రపంచంగా గడుపుతారు. కుంభమేళా సమయంలో మాత్రమే జన సామాన్యానికి కనిపిస్తారు. వాళ్లే నాగసాధువులు. కుంభమేళాకు శ్రీకారం చుట్టేది వాళ్లే. ఈసారి కూడా మేళాలో వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొహెంజోదారో కాలం నుంచీ నాగాల ఉనికికి సంబంధించిన ఆధారాలున్నాయి.
అవసరమైనప్పుడు ఆలయాలను, సనాతన సంప్రదాయాలను అన్య మతస్తుల దాడులు తదితరాల నుంచి వీరు కాపాడినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆయుధాల వాడకంలోనూ వీళ్లు దిట్ట. అందుకే వీరిని హిందూ ధర్మానికి కమాండర్లుగానూ అభివర్ణిస్తుంటారు. వీరి ప్రాముఖ్యత అనాది కాలం నుంచీ కొనసాగుతూ వస్తోంది. హిమాలయాల్లో ఉంటారంటారు. కుంభమేళా సమయంలో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు. తద్వారా పుణ్య జలాలకు మరింత పవిత్రత వస్తుందన్నది విశ్వాసం. అందుకే మేళాలో తొలి రాజ (షాహీ) స్నానం వీరితోనే చేయించి గౌరవిస్తారు.
Maha Kumbh Mela 2025: రికార్డులు కొల్లగొడుతూ.. ఆర్ట్ వర్క్‌తో అందమైన రూపాన్ని నిలుపుకున్న మహాకుంభమేళా!
కుంభమేళా కోసం..
- ప్రయాగ్‌రాజ్‌లో 92 రహదారులు నిర్మించారు
- 17 ప్రధాన రోడ్లను సుందరీకరించారు
- 30 బల్లకట్టు వంతెనలు కట్టారు
- భిన్న భాషల్లో 800 దారిసూచికలు ఏర్పాటుచేశారు
- తొలిసారిగా అండర్‌వాటర్ డ్రోన్లను రంగంలోకి దింపారు. ఇవి 100 మీటర్ల లోతుకు సైతం వెళ్లి గాలిస్తాయి. అలాగే 120 మీటర్ల ఎత్తులోనూ గస్తీ కాయనున్నాయి.
- రోజూ వేలాది భక్తులకు కంటి పరీక్షలకు 10 ఎకరాల్లో 11 భారీ గుడారాల్లో నేత్ర కుంభ్‌ను నెలకొల్పారు.
- భద్రతకు ఏడంచెల కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు.
- భక్తుల కోసం దేశ నలుమూలల నుంచి 13,000 ప్రత్యేక రైళ్లు ఏర్పాటయ్యాయి.
- తప్పిపోయిన వారికోసం ‘ఖోయా–పాయా’ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Maha Kumbh Mela: మహాకుంభమేళాలో.. తొమ్మిదేళ్ల నాగసన్యాసి.. గడ్డకట్టే చలిలో కఠోర తపస్సు