B Sc Nursing Course Admissions : ఏఎఫ్‌ఎంఎస్‌లో ఈ విద్యా సంవ‌త్స‌రంలో బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. అర్హులు ఈ మ‌హిళ‌లే..

ఇండియన్‌ ఆర్మీ దేశవ్యాప్తంగా ఉన్న ఐదు కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌)లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్‌) కోర్సులో అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం సీట్ల సంఖ్య: 220.
»    ఏఎఫ్‌ఎంఎస్‌ సీట్లు
కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, పుణె–40, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, కోల్‌కతా–30, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, ముంబై–40, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, లక్నో–40, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, బెంగళూరు–40.
»    అర్హత
అవివాహిత/విడాకులు తీసుకున్న/చట్టబద్ధంగా విడిపోయిన/వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 50 శాతం మార్కులు సీనియర్‌ సెకండరీ పరీక్ష 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,ఇంగ్లిష్‌). నీట్‌(యూజీ)2024లో అర్హత సాధించి ఉండాలి. కనిష్ట ఎత్తు 152 సెం.మీ. కలిగి ఉండాలి.
»    వయసు: 01.10.1999 నుంచి 30.09.2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.
»    ఎంపిక విధానం: నీట్‌ 2024 స్కోరు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/జనరల్‌ ఇంగ్లిష్‌ టెస్ట్, సైకలాజికల్‌ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 07, 2024
»    వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

BFSC Course Admissions : ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీలో బీఎఫ్‌ఎస్సీ కోర్సులో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. సీట్ల వివ‌రాలు.!

#Tags